Begin typing your search above and press return to search.

గంగం గణేశా బిజినెస్ లెక్కలు ఎలా ఉన్నాయంటే?

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ తరహాలోనే తమ్ముడు ఆనంద్ దేవరకొండ కూడా హీరోగా ఒక్కో మెట్టు ఎక్కుతూ అందరికి చేరువ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   31 May 2024 5:30 AM GMT
గంగం గణేశా బిజినెస్ లెక్కలు ఎలా ఉన్నాయంటే?
X

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ తరహాలోనే తమ్ముడు ఆనంద్ దేవరకొండ కూడా హీరోగా ఒక్కో మెట్టు ఎక్కుతూ అందరికి చేరువ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఆనంద్ విజయ్ దేవరకొండ తరహాలో కాకుండా కాస్తా డిఫరెంట్ అప్రోచ్ తో కథలు ఎంపిక చేసుకొని మూవీస్ చేస్తూ ఉండటం విశేషం. గత ఏడాది బేబీ సినిమాతో ఆనంద్ దేవరకొండ బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నాడు. ఆ సినిమాలో తన పెర్ఫార్మెన్స్ తో ఆనంద్ విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు.

బేబీ తర్వాత ఈ ఏడాది గంగం గణేశా సినిమాతో థియేటర్స్ లోకి వస్తున్నాడు. ఈ మూవీ అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. కథకి కాస్తా యాక్షన్ టచ్ కూడా ఇచ్చారు. అయితే కంటెంట్ మేగ్జిమమ్ ఫన్ బేస్డ్ గానే ఉండబోతోందని ట్రైలర్ బట్టి అర్ధమవుతోంది. ఈ సినిమాతో మరో సక్సెస్ ని అందుకోవాలని ఆనంద్ దేవరకొండ అనుకుంటున్నారు. అందుకు తగ్గట్లుగానే సినిమా ప్రమోషన్స్ స్ట్రాంగ్ గా చేశారు.

కచ్చితంగా ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందనే కాన్ఫిడెన్స్ తో చిత్ర యూనిట్ ఉంది. ఇదిలా ఉంటే ఈ సినిమాని తెలుగు రాష్ట్రాలలో 350 థియేటర్స్ లో రిలీజ్ చేస్తూ ఉన్నారు. అలాగే వరల్డ్ వైడ్ గా 500 థియేటర్స్ లో గంగం గణేశా ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. ఇక ఈ సినిమా బిజినెస్ లెక్కలు చూసుకుంటే తెలుగు రాష్ట్రాల వరకు 4.5 కోట్ల వేల్యూ ఉన్నట్లు తెలుస్తోంది. వరల్డ్ వైడ్ గా చూసుకుంటే 5.5 కోట్ల వరకు గంగం గణేశా బిజినెస్ జరిగిందని సమాచారం.

ఈ లెక్కన చూసుకుంటే 6 కోట్ల షేర్ అందుకుంటే గంగం గణేశా మూవీ బ్రేక్ ఈవెన్ అందుకుంటుంది. బేబీ తర్వాత ఆనంద్ దేవరకొండ వస్తోన్న చిత్రం కావడంతో కచ్చితంగా యూత్ నుంచి మంచి ఆదరణ లభిస్తుందని భావిస్తున్నారు. కంటెంట్ కూడా ప్రామిసింగ్ గా ఉండటంతో బ్రేక్ ఈవెన్ అందుకొని బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంటామని చిత్ర యూనిట్ బలంగా చెబుతోంది.

బేబీ మూవీ హిట్ అయిన ఆ సినిమా క్రెడిట్ మొత్తం దర్శకుడు సాయి రాజేష్, హీరోయిన్ వైష్ణవికి వెళ్ళిపోయింది. గంగం గణేశా హిట్ అయితే సోలోగా ఆనంద్ మార్కెట్ ఎంత అనేది అందరికి ఒక క్లారిటీ వస్తుంది. తరువాత అతని సినిమాలకి బిజినెస్ పెరగడానికి అవకాశం ఉంటుంది. మరి ప్రేక్షకులు ఈ చిత్రానికి ఎలాంటి రిజల్ట్ ఇస్తారనేది వేచి చూడాలి.