Begin typing your search above and press return to search.

గం గం గణేశా.. బాక్సాఫీస్ వద్ద సాలిడ్ గా!

ఆనంద్ దేవరకొండ హీరోగా ఉదయ్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రగతి శ్రీ వాస్తవ, నయన్ సారిక హీరోయిన్లుగా నటించారు.

By:  Tupaki Desk   |   3 Jun 2024 10:46 AM GMT
గం గం గణేశా.. బాక్సాఫీస్ వద్ద సాలిడ్ గా!
X

టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినా.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు యువ కథానాయకుడు ఆనంద్ దేవరకొండ. కెరీర్ స్టార్టింగ్ నుంచి డిఫరెంట్ జోనర్లలో సినిమాలు చేస్తున్న ఆనంద్.. గత ఏడాది బేబీ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. రీసెంట్ గా గం గం గణేశా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మే 31వ తేదీన ఈ మూవీ రిలీజైంది.


ఆనంద్ దేవరకొండ హీరోగా ఉదయ్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రగతి శ్రీ వాస్తవ, నయన్ సారిక హీరోయిన్లుగా నటించారు. హైలైఫ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై క్రైమ్ కామెడీ మూవీగా రూపొందిన ఈ మూవీని కేదార్‌ సెలగంశెట్టి, వంశీ కారుమంచి గ్రాండ్ గా నిర్మించారు. ఇమాన్యుయెల్, ప్రిన్స్ యావర్ సహా పలువురు నటీనటులు కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ చైతన్ భరద్వాజ్ సంగీతం అందించారు.

అయితే బేబీ తర్వాత ఆనంద్ చేసిన సినిమా కావడంతో మంచి అంచనాలు నెలకొన్నాయి. థియేటర్లలో రిలీజైన ఫస్ట్ డే మిక్స్ డ్ రెస్పాన్స్ అందుకుంది ఈ చిత్రం. ఓపెనింగ్స్ కూడా అదే విధంగా వచ్చాయి. ఇప్పుడు వసూళ్లు మెల్లమెల్లగా పెరుగుతున్నాయి. మొదటి రెండు రోజులతో పోలిస్తే మూడో రోజు ఎక్కువ వసూళ్లు వచ్చాయి. దీంతో మేకర్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. బాక్సాఫీస్ వద్ద క్లీన్ హిట్ అవుతుందనే నమ్మకంతో ఉన్నారు.

తొలి రోజు రూ.1.82 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసిన గం గం గణేశా మూవీ.. రెండో రోజు దాదాపు రూ.1.50 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. రెండు రోజుల్లో రూ.3 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. నిన్న వీకెండ్ స్పెషల్ గా రూ.2 కోట్లకు పైగా వసూలు చేసినట్లు తెలుస్తోంది. అయితే బాక్సాఫీస్ వద్ద ఇదే ట్రెండ్ కొనసాగితే రానున్న రోజుల్లో ఈ సినిమా మంచి వసూళ్లను సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయని సినీ పండితులు అభిప్రాయపడుతున్నారు.

ఇక గం గం గణేశా మూవీకి ప్రపంచవ్యాప్తంగా రూ.5 కోట్ల మేర బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. దాదాపు రూ.5.50 కోట్లకు పైగా బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. అయితే ఇప్పటి వరకు రూ.3 కోట్లకు పైగా షేర్ వసూలు అయినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో మరో రెండు రోజుల్లో ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఈజీగా కంప్లీట్ చేసుకుంటుందని అంటున్నారు. మరి చూడాలి ఆనంద్.. ఈ సినిమాతో ఎలాంటి వసూళ్లు సాధిస్తారో.