Begin typing your search above and press return to search.

గం గం గణేశా.. ఆనంద్ సరికొత్త యాక్షన్ టచ్

విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ తన సొంత టాలెంట్ తోనే తనకంటూ ప్రత్యేకతను సృష్టించుకుంటున్నాడు.

By:  Tupaki Desk   |   20 May 2024 8:31 AM GMT
గం గం గణేశా.. ఆనంద్ సరికొత్త యాక్షన్ టచ్
X

విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ తన సొంత టాలెంట్ తోనే తనకంటూ ప్రత్యేకతను సృష్టించుకుంటున్నాడు. ఆనంద్, తన మొదటి సినిమా "దొరసాని"తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత ఆయన కొన్ని సినిమాలలో తన నటనతో మెరుగుపరుచుకున్నాడు. రీసెంట్‌గా "బేబీ" అనే సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లను సాధించింది.

ఇప్పుడు, "బేబీ" సినిమా హిట్ అయిన తర్వాత, ఆనంద్ దేవరకొండ తన కొత్త చిత్రం "గం గం గణేశా"తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా ట్రైలర్ ఇటీవల విడుదలైంది. ట్రైలర్ చాలా ఆకట్టుకునే విధంగా ఉంది. ఉదయ్ భూమిశెట్టి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఆనంద్ ఒక దొంగ పాత్రలో కనిపించబోతున్నాడు. ఆనంద్ తన డైలాగ్ డెలివరీలో కూడా మార్పులు చేశాడు.

ట్రైలర్ చాలా సరదాగా సాగుతుండగా ఒక బిగ్ క్రైమ్ లో హీరో ఉండడం, మధ్యలో విలన్ ఎంట్రీతో కథ సీరియస్ గా మారుతుంది. హీరోయిన్ తో మంచి లవ్ సీన్స్ తో కూడా ఆనంద్ కనిపించాడు. ట్రైలర్ లో వినాయకుడి విగ్రహం కనబడుతుంది. ఈ విగ్రహం కథకు ఎలా సంబంధించబోతుందో తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. "గం గం గణేశా" సినిమా క్రైమ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోంది.

ఇక సినిమాలో కొంతమంది కమెడియన్స్ కూడా హైలెట్ అవుతున్నట్లు తెలుస్తోంది. హీరో ఫ్రెండ్ గా జబర్దస్త్ ఫేమ్ ఇమ్మాన్యూయేల్ నటించగా ఒక విభిన్నమైన పాత్రలో వెన్నెల కిషోర్ కనిపించనున్నాడు. ఇక సినిమాలో గన్ సీన్స్ కూడా హైలెట్ అవుతున్నాయి. ఈసారి చాలా డిఫరెంట్ స్టైల్ లో ఆనంద్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు.

ఈ సినిమా కామెడీ క్రైమ్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక సినిమాను కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మిస్తున్నారు. ఉదయ్ భూమిశెట్టి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇప్పటివరకు సాఫ్ట్ పాత్రల్లో కనిపించిన ఆనంద్, ఈ సినిమాలో యాక్షన్ హీరోగా మారనున్నారు. ఈ సినిమాలో చాలా కొత్తవారిని నటింపజేయడం జరిగింది.

ఈ సినిమాతో ఆనంద్, కొత్త తరహా పాత్రలో కనిపించబోతున్నాడు. విజయ్ దేవరకొండ తమ్ముడు అని కాకుండా, ఆనంద్ తన సొంత ప్రతిభతో ఎదగాలని నిరూపించుకుంటున్నాడు. "గం గం గణేశా" సినిమా మే 31 న విడుదల కానుంది. మరి ఈ సినిమా ద్వారా ఆనంద్ నటనలో మరింత మెరుగుపరచుకుంటూ, కమర్షియల్ హీరోగా నిలదొక్కుకుంటాడో లేదో చూడాలి.