Begin typing your search above and press return to search.

గేమ్ చేంజర్.. ఓ టెన్షన్ తీరింది

అయితే శంకర్ మూవీపైన ఫోకస్ పెట్టకపోవడంతో దిల్ రాజు గేమ్ చేంజర్ బాద్యతలని ఇంకో దర్శకుడికి అప్పగించారంటూ టాక్ వినిపించింది.

By:  Tupaki Desk   |   11 Oct 2023 4:45 AM GMT
గేమ్ చేంజర్.. ఓ టెన్షన్ తీరింది
X

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పాన్ ఇండియా మూవీ గేమ్ చేంజర్. దిల్ రాజు భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కియరా అద్వానీ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమాలో తండ్రి కొడుకులుగా డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే సగానికి పైగా మూవీ షూటింగ్ కంప్లీట్ అయ్యింది.

శంకర్ ఓ వైపు కమల్ హాసన్ తో ఇండియన్ 2 మూవీ షూటింగ్ చేస్తూనే గేమ్ చేంజ్ ని కూడా ప్యారలల్ గా చిత్రీకరిస్తూ వచ్చారు. రెండు కూడా పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ కావడంతో శంకర్ ఇండియన్ 2పైన ఎక్కువ దృష్టి పెట్టాడనే టాక్ వినిపించింది. అయితే ఆ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకొని డబ్బింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయని కమల్ హాసన్ ఆ మధ్య ఒక వీడియో రిలీజ్ చేశారు.

అయితే శంకర్ మూవీపైన ఫోకస్ పెట్టకపోవడంతో దిల్ రాజు గేమ్ చేంజర్ బాద్యతలని ఇంకో దర్శకుడికి అప్పగించారంటూ టాక్ వినిపించింది. అయితే అలాంటిదేం లేదని తరువాత క్లారిటీ వచ్చింది. తాజాగా శంకర్ గేమ్ చేంజ్ కొత్త షూటింగ్ షెడ్యూల్ స్టార్ట్ అయినట్లు ఒక ఫోటో షేర్ చేసి కన్ఫర్మ్ చేశారు. మంగళవారం నుంచి హైదరాబాద్ లోనే ఎమోషనల్ ఎలిమెంట్స్ కి తెరకెక్కించే పని మొదలు పెట్టారు.

ఈ విషయాన్ని దర్శకుడు శంకర్ ట్విట్టర్ లో ధ్రువీకరించారు. దీంతో గేమ్ చేంజర్ మూవీపై వచ్చిన రూమర్స్ అన్నింటికి ఫుల్ స్టాప్ పడినట్లు అయ్యింది. మరో వైపు ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ ని దసరా కానుకగా రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. ఆ సాంగ్ షూటింగ్ కూడా ఇప్పటికే కంప్లీట్ అయ్యిందంట. దీంతో కొన్ని విజువల్ ఎలిమెంట్స్ యాడ్ చేసి సాంగ్ ని ప్రేక్షకులకి అందించాలని అనుకుంటున్నారు.

మరి ఆర్ఆర్ఆర్ తర్వాత పాన్ ఇండియా లెవల్ లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చేస్తోన్న గేమ్ చేంజర్ మూవీ అతనికి ఎలాంటి సక్సెస్ ఇస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. శంకర్ డైరెక్షన్ అంటే కచ్చితంగా నెక్స్ట్ లెవల్ లోనే ఉంటుందని ఫ్యాన్స్ అంచనాకి వచ్చేస్తున్నారు. అయితే ఒకే సారి రెండు సినిమాలు డీల్ చేయడం వలన ఎలా ఉంటుందో అనే టెన్సన్ కూడా మరో వైపు ఉంది.