కల్కి- గణపత్.. ఇవి గమనించారా ?
రెండు కథలు, సినిమాలోని పాత్రలు ఇంచుమించు ఒకేలా అనిపిస్తున్నాయి. ముఖ్యంగా రెండు చిత్రాలు ఫ్యూచరిస్టిక్ డ్రామాగానే రానుండటం విశేషం
By: Tupaki Desk | 30 Sep 2023 5:25 AM GMTబాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ హీరోగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం గణపత్. తాజాగా ఈ మూవీ టీజర్ రిలీజై సినీ ప్రియులను, మరీ ముఖ్యంగా ప్రభాస్ అభిమానులను షాక్ అండ్ సర్ప్రైజ్కు గురి చేసింది. ఈ ప్రచార చిత్రం చూస్తుంటే.. ప్రతిఒక్కరికీ ప్రభాస్ నటిస్తున్న కల్కి 2898 ఏడి సినిమా మదిలో మెదులుతోంది.
రెండు కథలు, సినిమాలోని పాత్రలు ఇంచుమించు ఒకేలా అనిపిస్తున్నాయి. ముఖ్యంగా రెండు చిత్రాలు ఫ్యూచరిస్టిక్ డ్రామాగానే రానుండటం విశేషం. 2070 ఏడీతో ప్రారంభమైన గణపత్ టీజర్లో.. భవిష్యత్‌లో తిండి కూడా దొరకని పరిస్థితుల్లో ఆహారం కోసం కొట్టుకునే మనుషులు ఉండటాన్ని చూపించారు. ఫైనల్‌గా చెడును అంతం చేసేందుకు హీరో పుట్టాడు అంటూ ముగించారు.
ఇక ప్రభాస్ కల్కిలోనూ ఫైనల్ కాన్సెప్ట్ చెడును అంతం చేసేందుకు కల్కిగా ప్రభాస్ వస్తాడని అన్నారు. భవిష్యత్‌లో తిండి కూడా దొరకనివ్వకుండా, మనుషులను బానిసలను చేసి చెడు ప్రపంచాన్ని పాలిస్తున్న సమయంలో హీరో ఎంట్రీ ఇచ్చి దాన్ని ఎలా ఎదుర్కొన్నాడనేదే కథ అని అన్నారు. అంటే ఇప్పుడు ఈ రెండు చిత్రాలు ఫ్యూచరిస్టిక్ డ్రామాగా.. ప్రపంచాన్ని కమ్మేసిన చెడుపై యుద్ధం చేసే వీరుడి కథే అని అర్థమైంది.
పాత్రలు కూడా చూసుకుంటే ప్రాజెక్ట్‌లో చెడుపై యుద్ధం చేసేందుకు హీరో ప్రభాస్ కల్కిగా అవతారమెత్తితే..టైగర్ ష్రాఫ్ గణపత్గా రానున్నారు. ప్రభాస్ చేసే యుద్ధంలో ఆయనకు సాయంగా దీపికా పదుకొణె, వెనక ఉండి నడిపించే గాడ్‌ఫాదర్‌లా అమితాబ్ బచ్చన్ కనిపించబోతుంటే.. గణ్పత్లో టైగర్ ష్రాప్‌కు కృతిసనన్, అమితాబ్ బచ్చన్ తోడుగా ఉండనున్నారని టీజర్ చూస్తే అర్థమవుతోంది.
ఇక కల్కి ఫస్ట్ పోస్టర్ బ్యాక్ గ్రౌండ్, గణపత్ టీజర్ బ్యాక్ గ్రౌండ్ గమనిస్తే.. వాతవరణం, టైమ్ లైన్, గ్రాఫిక్స్, ఉపయోగించిన వెపన్, వెహికల్, యాక్షన్.. అన్ని దాదాపుగా ఒకే రకమైన ఫీలింగ్‌ను కలిగిస్తున్నాయి. కల్కి చిత్రానికి ఇమిటేషన్ ప్రాడెక్ట్ అన్న కామెంట్లు కూడా వినపడుతున్నాయి.
ఏదేమైనప్పటికీ గణపత్తో పోలిస్తే.. కల్కి మరింత భారీ బడ్జెట్‌తో రాబోతుంది. రియలిస్ట్ గ్రాఫిక్స్‌కు పెద్ద పీట వేస్తున్నట్లు మూవీటీమ్ మొదటి నుంచే చెబుతోంది. చూడాలి మరి ఒకే రకమైన కాన్సెప్ట్‌తో రాబోతున్నా.. సినిమాలో స్క్రీన్ ప్లే, నరేషన్, ట్విస్ట్‌లు, గ్రాఫిక్స్‌ను ఎలా తీర్చిదిద్దారో.. కాగా, గణపత్ అక్టోబర్ 20న రానుండగా.. కల్కి వచ్చే ఏడాది రానుంది.