హిట్టైనా..ప్లాపైనా వరుణ్ మాత్రం ఆగడు!
ప్రేక్షకుల ప్రోత్సాహంతో ఇలాంటి కొత్త కథల్లో నటిస్తూనే ఉంటా. సామాజిక సందేశం ఉన్న సినిమాలు చాలా అరుదుగా వస్తుంటాయి
By: Tupaki Desk | 23 Aug 2023 6:06 AM GMTమెగాప్రిన్స్ వరుణ్ తేజ్ కెరీర్ జర్నీ గురించి చెప్పాల్సిన పనిలేదు. కమర్శియల్ సినిమాలతో పాటు వైవిథ్యమైన సినిమాలు చేయడం వరుణ్ ప్రత్యేకత. మెగా హీరోలెవరు? చేయని డిఫరెంట్ అటెంప్ట్స్ చేసి ఆ ఫ్యామిలీ పేరు తెచ్చాడు. ఈవిషయంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఎంతో మెచ్చాడు. తాము ఎవరు చేయలేనిది తమ్ముడు చేస్తున్నాడని సంతోషపడ్డారు. మెగాస్టార్ చిరంజీవి సైతం వరుణ్ జర్నీ చూసి ఎంతో సంబరపడ్డారు.
'కంచె'..'అంతరిక్షం'..'గద్దలకొండ గణేష్' లాంటి సినిమాలే అందుకు ఉదాహరణ. తాజాగా 'గాండీవధారి అర్జున'లో నటిస్తున్నాడు. ఇది ఓ డిఫరెంట్ సినిమా. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో వరుణ్ తేజ్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసారు. 'విభిన్నమైన సినిమాలు తీసిన ప్రతీసారి కమర్శియల్ చిత్రాలు తీయోచ్చు కదా? అని సలహాలిస్తుంటారు. కానీ నాకు కొత్త కథలు చేయడం అంటేనే ఇష్టం. సినిమా హిట్ అయినా ప్లాప్ అయినా ఈ రకమైన జర్నీ మాత్రం ఆగదు.
ప్రేక్షకుల ప్రోత్సాహంతో ఇలాంటి కొత్త కథల్లో నటిస్తూనే ఉంటా. సామాజిక సందేశం ఉన్న సినిమాలు చాలా అరుదుగా వస్తుంటాయి. ఈసినిమాలో ఆ కోర్ పాయింట్ వల్లే ఈ సినిమా అంగీకరించా. మనమెప్పుడు కుటుంబం గురించి ఆలోచిస్తాం. కానీ ఈ సినిమా చూస్తున్నప్పుడు సమాజం గురించి ఆలోచిస్తాం. ఓ అంతర్జాతీయ సమస్య మీద ఈ సినిమా తీసాం. హీరో చుట్టూ అల్లుకున్న కథ కాదు.
రొటీన్ చిత్రాలకు భిన్నంగా ఉంటుంది. ఆ పాయింట్ ని ప్రేక్షకులు తప్పక ఎంజాయ్ చేస్తారు' అని అన్నారు. మొత్తానికి వరుణ్ తేజ్ మరోసారి డేరింగ్ గా తాను ఎలా ఉంటాడు? ఎలాంటి సినిమాలు చేస్తాడు? అన్నది క్లారిటీ ఇచ్చేసారు. డిఫరెంట్ సినిమాలు చేసిన సందర్భంలో కొన్నిసార్లు ప్రయత్నాలు ఫలిస్తాయి..మరికొన్ని సార్లు ఫెయిలవుతుంటాయి. అలాంటప్పుడు విమర్శలు తప్పవు..ప్రశంసలు ముంగిట ఉంటాయి. ఆ రెండిటిని బ్యాలెన్స్ చేస్తూ వెళ్లాలి. వరుణ్ ఆవిషయంలో చాలా క్లారిటీ గా ఉన్నాడు.