Begin typing your search above and press return to search.

గాండీవదారి అర్జున సెన్సార్.. రన్ టైమ్ ఎంతంటే?

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో గాండీవదారి అర్జున మూవీతో ప్రేక్షకుల ముందుకి రావడానికి సిద్ధం అవుతున్నారు

By:  Tupaki Desk   |   19 Aug 2023 4:33 AM GMT
గాండీవదారి అర్జున సెన్సార్.. రన్ టైమ్ ఎంతంటే?
X

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో గాండీవదారి అర్జున మూవీతో ప్రేక్షకుల ముందుకి రావడానికి సిద్ధం అవుతున్నారు. ఆగష్టు 25న ఈ మూవీ గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఇప్పటికే బిజినెస్ డీల్స్ అన్ని క్లోజ్ అయ్యాయి. సినిమాని భారీ బడ్జెట్ తో యాక్షన్ థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కించారు. ప్రమోషన్ యాక్టివిటీస్ కూడా స్టార్ట్ అయ్యాయి. హీరో, హీరోయిన్స్ ఇద్దరు ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.

మెగా ప్రిన్స్ చివరిగా గని మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చి డిజాస్టర్ ని తన ఖాతాలో వేసుకున్నారు. అయితే ఈ సారి మాత్రం పక్కా హిట్ కొట్టాలని కమర్షియల్ టచ్ తో పాటు తనకి సెట్ అయ్యే యాక్షన్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో గాండీవదారి అర్జున చేశారు. ఈ సినిమాపై వరుణ్ చాలా నమ్మకంగా ఉన్నారు. కచ్చితంగా తనకి పాజిటివ్ రిజల్ట్ ఇస్తుందని భావిస్తున్నారు.

తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తిచేసుకుంది. సెన్సార్ నుంచి యూ/ఏ సర్టిఫికెట్ మూవీకి వచ్చింది. అలాగే సినిమా రన్ టైం కూడా 2 గంటల 20 నిమిషాలు మాత్రమే. అంటే ఈ మధ్యకాలంలో వస్తోన్న చాలా సినిమాల కంటే తక్కువ రన్ టైంతో గాండీవదారి అర్జున వస్తోంది. యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఉన్న సబ్జెక్టు అయిన కూడా ఎలాంటి అనవసరమైన ల్యాగ్ కి చోటు ఇవ్వకుండా కంటెంట్ ని పెర్ఫెక్ట్ గా ప్రెజెంట్ చేసి ఉంటారని తెలుస్తోంది.

అందుకే తక్కువ రన్ టైం సినిమాకి వచ్చింది. ఇది కూడా సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ కావడానికి కారణం అవ్వొచ్చని భావిస్తున్నారు. ప్రవీణ్ సత్తారు చివరిగా కింగ్ నాగార్జునతో ది ఘోస్ట్ మూవీ చేశారు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. ఇక వరుణ్ తేజ్ చివరగా గని సినిమాతో డిజాస్టర్ అందుకున్నాడు. కాబట్టి ఈ సినిమాతో తప్పనిసరి సక్సెస్ కొట్టాలని అనుకుంటున్నారు.

అయితే గాండీవదారి అర్జున సినిమాలో ప్రకృతి విధ్వంసం అనే కాన్సెప్ట్ ని ఎంచుకోవడం ద్వారా ప్రతి ఒక్కరు రిలేట్ అయ్యేవిధంగా చేశారు. మనచుట్టూ ప్రకృతి విధ్వంసం ఏ స్థాయిలో జరుగుతోంది. దాని ద్వారా భవిష్యత్తుకి ఎలాంటి అనర్ధాలు వస్తాయనేది చిత్రంలో చూపించబోతున్నారు. అయితే సినిమాపై ఇప్పటివరకు అనుకున్నంత బజ్ అయితే పెరగలేదు. కాబట్టి సినిమాకు ఇంకాస్త ప్రమోషన్స్ చేస్తే బెటర్ అనిపిస్తుంది.