Begin typing your search above and press return to search.

గాండీవధారి అర్జున ట్రైలర్ 2: తెలియాల్సిన ఆ నిజమేంటి?

ఈ సినిమాలో కొన్ని యాక్షన్ షాట్స్ అయితే బాగానే ఉన్నాయి. కానీ అవి కదా ప్రకారం సినిమా కంటెంట్ లో ఉంటాయా లేదా అనేది వెండితెరపై చూడాలి.

By:  Tupaki Desk   |   21 Aug 2023 4:27 PM GMT
గాండీవధారి అర్జున ట్రైలర్ 2: తెలియాల్సిన ఆ నిజమేంటి?
X

మెగా హీరో వరుణ్ తేజ్ యాక్షన్ స్పై ఫిలిం గాండీవదారి అర్జున ఈనెల 25వ తేదీన గ్రాండ్ గా విడుదల కాబోతోంద ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను SVCC ప్రొడక్షన్ బీవిఎస్ఏన్ ప్రసాద్ నిర్మించారు. ఇక ఇప్పటికే టీజర్ ట్రైలర్ ను కూడా విడుదల చేశారు. అయితే ఇప్పుడు రిలీజ్ ముంగిట మరొక యాక్షన్ ట్రైలర్ కూడా విడుదల చేశారు.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ చేతుల మీదుగా విడుదలైన ఈ ట్రైలర్ యాక్షన్ తో పాటు ఒక మిషన్ ఉన్నట్లు హైలెట్ చేశారు. మొదటి ట్రైలర్ లో ఎలాగైతే సస్పెన్స్ గా చూపించారో ఇప్పుడు రెండవ ట్రైలర్ ను కూడా దాదాపు అదే తరహాలో మిస్టరీనీ ఎక్కడ చెప్పకుండా దాచేసారు. వాతావరణంలో ఏదో జరుగుతోంది అని నిఘా వర్గాలు ఛేదించేందుకు ప్రయత్నిస్తున్నాయి అని అలాగే మాఫియా ఒక ఉన్నతమైన వ్యక్తులను టార్గెట్ చేసినట్లు చూపించారు.

ఇక స్పై ఆఫీసర్ గా ఒకవైపు వరుణ్ తేజ్ నిజాలను బయటకు తీసేందుకు ప్రయత్నిస్తూనే మరొకవైపు యాక్షన్ ఎలివేషన్స్ తో ఆకట్టుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. హీరోయిన్ సాక్షి వైద్య కూడా ఈ సినిమాలో కథలో కీలకమైన పాత్రలో కనిపించినట్లుగా తెలుస్తోంది. నాజర్ ప్రధాన పాత్రలో నటించగా అతన్ని మరి కొంతమంది టార్గెట్ చేయడం ఇక ఏదో మిషన్ దాగి ఉన్నట్లుగా హీరో విచారణ జరుపుతున్నట్లుగా కథను చూపించారు.

అంతేకాకుండా వేలాదిమంది చావులు వృధా కాకూడదు అని నిజం ఈ ప్రపంచానికి తెలియాలి అని అర్జునుడు ఏదో చెప్పాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఇక ట్రైలర్ లో అయితే అసలు కథను ఎక్కడ కూడా రివిల్ చేయకుండా ఒక మిషన్ ను మాత్రం యాక్షన్ ఎలిమెంట్స్ తో చూపించబోతున్నట్లుగా చెప్పకనే చెప్పేశారు.

ఈ సినిమాలో కొన్ని యాక్షన్ షాట్స్ అయితే బాగానే ఉన్నాయి. కానీ అవి కదా ప్రకారం సినిమా కంటెంట్ లో ఉంటాయా లేదా అనేది వెండితెరపై చూడాలి. మొత్తానికి సెకండ్ ట్రైలర్ లో కూడా ఒక సస్పెన్స్ అయితే క్రియేట్ చేసి ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఇప్పటివరకు సినిమాపై అనుకున్నంత స్థాయిలో అంచనాలు అయితే పెరగలేదు. ఇక రెండవ ట్రైలర్ తో జనాలను మరింత ఆకట్టుకోవాలి అని ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఈ ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.