కొరియోగ్రాఫర్ భార్య వంటకాలు తినేందుకు స్టార్ హీరోల క్యూ!
బాలీవుడ్ లో ప్రఖ్యాత కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య ఇటీవల పింక్‌విల్లా ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను తెలిపారు.
By: Tupaki Desk | 26 March 2025 3:57 AMసెట్లో లంచ్ టైమ్ లో క్యారేజీలు ఓపెన్ చేసి పది మంది ఆర్టిస్టులు ఆ వంటకాలను షేర్ చేసుకునే కల్చర్ ఒకప్పుడు ఉండేది. దశాబ్ధాల క్రితం నాటి మాట ఇది. నాటి రోజుల్లో హోటళ్ల నుంచి క్యారేజీలు రప్పించే సంస్కృతి లేదు. ఇంటి నుంచి వండిన క్యారేజీలను సెట్స్ లోకి తెచ్చేవారు. అందరితో కలిసి తినేవారు. లంచ్ టైమ్ లో ఇతరులతో వండినవి షేర్ చేసుకోవడం, సరదా ముచ్చట్లు ఉండేవి. వారి మధ్య మంచి అనుబంధం ఉండేది. కానీ నేటిరోజుల్లో అలాంటి కల్చర్ అంతరించింది. ఆన్ లైన్ ఫుడ్ ఆర్డర్లతో ప్రజలు కాలక్షేపం చేస్తున్నారు. సినీజనం దీనికి అతీతులు కారు.
ఒకానొక సందర్భంలో సీనియర్ నటీమణి శారద, అన్నపూర్ణ వంటి వారు నాటి రోజుల్లో సెట్స్ లో కల్చర్ ఎంత ముచ్చటగా ఉండేదో వెల్లడించేవారు. అప్పట్లో ఒకరు క్యారేజీ తెచ్చినా నలుగురూ ఎలా షేర్ చేసుకునేవారో కూడా తెలిపేవారు. అప్పట్లో ఆర్టిస్టుల నడుమ మంచి అనుబంధం ఉండేది. చిన్నపాటి పొరపొచ్చాలు ఉన్నా కానీ, మరీ కుట్రలకు దారి తీసే పరిస్థితులు నాడు ఉండేవి కావు.
ఇటీవలి కాలంలో డార్లింగ్ ప్రభాస్ సెట్స్ లో తన కథానాయికలు, సీనియర్ ఆర్టిస్టులకు మంచి వంటకాలను అందజేస్తూ కల్చర్ ని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారని కథనాలొస్తున్నాయి. అతడి ఇంటి నుంచి వచ్చే క్యారేజీలను ఆర్టిస్టులు అబగా ఆరగిస్తున్నారు. ప్రభాస్ కి గొప్ప కాంప్లిమెంట్స్ ఇచ్చినవారిలో పలువురు కథానాయికలు, సీనియర్ ఆర్టిస్టులు కూడా ఉన్నారు.
బాలీవుడ్ లో ప్రఖ్యాత కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య ఇటీవల పింక్‌విల్లా ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను తెలిపారు. ముంబైలోని తన ఇంటికి కొందరు స్టార్ హీరోలు ప్రత్యేక పర్యటనకు వచ్చేవారు. వచ్చిన హీరోలు అందరూ తన ఇంట్లోని వంటగదికి వెళ్లి.. తన భార్య విధితో కావాల్సిన ఆహార పదార్థాలను వండించుకుని మరీ తినేవారు. ఆమె చేతి వంట రుచి చూసిన వారిలో రణ్‌బీర్ కపూర్, రణ్‌వీర్ సింగ్, అక్షయ్ కుమార్ వంటి ప్రముఖులు ఉన్నారు. తన భార్య వంటలను స్టార్లు ఇష్టంగా తినేవారని తెలిపారు. ఫలానా వెరైటీ కావాలని చెప్పి మరీ వండించుకుని తినేవారు.
గణేష్ ఆచార్య తన భార్య విధి ఆచార్య తమ సినిమా `పింటు కి పప్పీ సెట్స్`లో తారాగణం- సిబ్బందికి చాలా ఆహారం వండి పెట్టామని వెల్లడించారు. విధి తయారుచేసిన చికెన్‌ని రణబీర్ కపూర్, రణవీర్ సింగ్, అయాన్ ముఖర్జీ నిజంగా ఇష్టపడతారని గణేష్ తెలిపారు. మాస్టర్ జీ పాలక్ చికెన్, పాలక్ మూంగ్ దాల్ వో సబ్ చీజ్ కావాలని కొందరు డిమాండ్ చేసేవారట. రణబీర్ కపూర్, లవ్ రంజన్‌కి ఇలాంటి తిండి చాలా ఇష్టం. కానీ అక్షయ్ కుమార్‌కి స్పైసీ ఫుడ్ ఇష్టమని చెప్పుకొచ్చారు.