Begin typing your search above and press return to search.

బాలీవుడ్‌లోని అహం.. అల్లు అర్జున్‌లో లేదు!

ఎవ‌రైనా అద్భుత‌మైన ప‌ని చేస్తే `శ‌భాష్` అని మెచ్చుకునేందుకు మంచి మ‌న‌సుండాలి. అహం అడ్డొస్తే ఇది సాధ్య‌ప‌డ‌దు.

By:  Tupaki Desk   |   24 March 2025 9:17 AM IST
Ganesh Acharya Praises South India
X

ఎవ‌రైనా అద్భుత‌మైన ప‌ని చేస్తే `శ‌భాష్` అని మెచ్చుకునేందుకు మంచి మ‌న‌సుండాలి. అహం అడ్డొస్తే ఇది సాధ్య‌ప‌డ‌దు. ఇప్పుడు ప్ర‌ముఖ కొరియోగ్రాఫ‌ర్ గ‌ణేష్ ఆచార్య హిందీ ప‌రిశ్ర‌మ‌లోని అహాన్ని ప్ర‌శ్నిస్తూ.. త‌న ఆవేద‌నను వెలిబుచ్చారు. బాలీవుడ్ లో ఎన్నో హిట్ నంబ‌ర్ల‌కు కొరియోగ్ర‌ఫీ అందించిన గ‌ణేష్ ఆచార్య ఎంతో సీనియ‌ర్. కానీ ఆయ‌న‌ను ఏనాడూ ఏ ఒక్క హిందీ స్టార్ కూడా క‌నీస మాత్రానికైనా ప్ర‌శంసించ‌లేద‌ని చెప్పారు.

బాలీవుడ్ లో ఒక టెక్నీషియ‌న్ గా త‌న‌ను గుర్తించిన స్టార్ క‌నిపించ‌లేద‌ని అన్నాడు. బాలీవుడ్‌లో చాలా అహం ఉంది. దీనికి విరుద్ధంగా.. `పుష్ప‌` చిత్రాలకు కొరియోగ్ర‌ఫీ అందించినందుకు తెలుగు సూపర్ స్టార్ అల్లు అర్జున్ ప్రశంసించారని గణేష్ ఆచార్య అన్నారు. ''మీ వల్ల ప్రజలు నన్ను అభినందిస్తున్నారు!'' అని అల్లు అర్జున్ గుర్తుచేసుకున్నాడు. ఎవరైనా స్టార్ నాతో అలా చెప్పడం ఇదే మొదటిసారి!'' అని గణేష్ తెలిపారు.

హిందీ చిత్ర‌సీమ‌తో పోలిస్తే సాంకేతిక నిపుణుల‌కు గౌర‌వం ఇచ్చినందుకు ద‌క్షిణాదిపై ప్ర‌శంస‌లు కురిపించారు. తెరవెనుక ప్రతిభను ఎవ‌రు ఎలా గుర్తిస్తారో రెండు ప్రాంతాల‌ను పోల్చి చూపించారు. పుష్ప: ది రైజ్ (2021) లో సమంతా రూత్ ప్రభు స్పెష‌ల్ సాంగ్ `ఊ అంటావా`ను కొరియోగ్రాఫ్ చేసిన గ‌ణేష్ ఆచార్య‌.. సీక్వెల్ కి కూడా పాట‌ల‌కు కొరియోగ్రాఫ్ చేసారు.