బిగ్ బాస్ బ్యూటీపై హైస్కూల్‌లో గ్యాంగ్ రేప్!
12 సంవత్సరాల వయసులో గ్యాంగ్ రేప్ కి గురైంది. 25 ఏళ్ల వయసులో ఒక యువకుడు అత్యాచారం చేసాడు. ఎన్నో అవమానాలు.. అంతులేని అన్యాయం.. జీవితాంతం ఒక విధివంచిత.
By: Tupaki Desk | 13 Oct 2023 3:30 PM GMT6 సంవత్సరాల వయసులో వేధింపులకు గురైంది. 12 సంవత్సరాల వయసులో గ్యాంగ్ రేప్ కి గురైంది. 25 ఏళ్ల వయసులో ఒక యువకుడు అత్యాచారం చేసాడు. ఎన్నో అవమానాలు.. అంతులేని అన్యాయం.. జీవితాంతం ఒక విధివంచిత. కానీ ఆమె వినోదప్రపంచంలో పాప్ రారాణిగా వెలిగిపోయింది. బిగ్ బాస్ హిందీ సీజన్ లోను అలరించిన ఈ బ్యూటీ పేరు - పమేలా ఆండర్సన్. బేవాచ్ స్టార్ గాను అండర్సన్ సుపరిచితం. ఆమె జీవితంపై ఒక డాక్యు సిరీస్ ఇప్పుడు ఓటీటీలో అందుబాటులో ఉంది.
పమేలా ఆండర్సన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నేను హైస్కూల్‌లో సామూహిక అత్యాచారానికి గురయ్యానని తెలిపారు. ఆరేళ్ల చిన్నపిల్లగా ఉన్నప్పుడే వేధింపులకు గురయ్యానని తెలిపారు. నేను మనుషులను విశ్వసించడం చాలా కష్టమని చెప్పనవసరం లేదు. నేను ఈ భూమి నుండి బయట పడాలని కోరుకున్నాను అని ఆండర్సన్ ఆవేదన చెందారు. పమేలా ఆండర్సన్ తాను చిన్నతనంలో లైంగిక వేధింపులకు గురయ్యానని, ఆపై హైస్కూల్ సమయంలో ఏడుగురు అబ్బాయిలు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని వెల్లడించింది.
పమేలా ఆండర్సన్ ఫౌండేషన్ వెబ్‌సైట్‌లో ప్రచురించిన ప్రసంగం ప్రకారం-``తొమ్మిదో తరగతిలో ఉన్న నా మొదటి ప్రియుడు నన్ను (అతని ఆరుగురు స్నేహితులతో) సామూహిక అత్యాచారం చేయడం తమాషాగా ఉంటుందని నిర్ణయించుకున్నాడు. అన్నంత పనీ చేసాడు`` అని తెలిపారు. తన బేవాచ్ ఫౌండేషన్‌ను ప్రారంభించిన సందర్భంగా నటి పమేలా అండర్సన్ మాట్లాడుతూ.. 6 సంవత్సరాల నుండి 10 సంవత్సరాల వయస్సులో ఒక ఆడ దాది తనను వేధించిందని.. 12 సంవత్సరాల వయస్సులో 25 ఏళ్ల యువకుడు అత్యాచారం చేశాడని చెప్పింది. నేను ఈ భూమి నుండి బయటపడాలని కోరుకున్నాను అని 46 ఏళ్ల పమేలా అన్నారు. నేను ఎందుకు జీవించి ఉన్నానో నాకు కచ్చితంగా తెలియదు! అని ఆవేదన చెందారు.
నన్ను సురక్షితంగా ఉంచడానికి ప్రయత్నించిన తల్లిదండ్రులను ప్రేమించినప్పటికీ నా విషయంలో చాలా తప్పులు జరిగాయి. ఈ ప్రపంచం సురక్షితమైన ప్రదేశం కాదు. మా నాన్న మద్యపాన దురలవాటు వల్ల, మా అమ్మ వెయిట్రెస్‌గా రెండు ఉద్యోగాలు చేసింది! అని అండర్సన్ చెప్పారు. మా అమ్మ ఎప్పుడూ ఏడుస్తూ ఉండేది అని తెలిపింది. నేను అమ్మ హృదయం ముక్కలవ్వడాన్ని చూసాను. ఈ సంఘటనలను నేను నాలోనే ఉంచుకున్నాను. జంతువులు ఆమెకు ఓదార్పుగా మారాయి. ఆమె తన స్వంత పిల్లలను కలిగి ఉండే వరకు నిజమైన స్నేహితులు పెట్స్ మాత్రమే! అని అండర్సన్ జోడించారు. మానవత్వం బాధపడుతుందని నేను గ్రహించాను అని ఉద్వేగంగా అన్నారు. ఇక హిందీ బిగ్ బాస్ సీజన్ లో పాల్గొన్న పమేలా అండర్సన్ కి 2 కోట్ల పారితోషికం చెల్లించారు. ఆమె కేవలం మూడు రోజుల పాటు హౌస్ లో ఉన్నారు. ఇక బిగ్ బాస్ పార్టిసిపెంట్లలోనే అత్యధిక పారితోషికం అందుకున్న నటిగా పమేలా రికార్డులకెక్కారు. ఆమె తర్వాత తేజస్వి ప్రకాష్ కి 1.7 కోట్ల పారితోషికం చెల్లించారు. తేజస్వి ఇటీవలి బిగ్ బాస్ సీజన్ లో పాల్గొన్నారు.
తన డాక్యు సిరీస్ చూసి కన్నీరు మున్నీరు
పమేలా ఆండర్సన్ నెట్‌ఫ్లిక్స్‌లో తనపై చిత్రీకరించిన డాక్యుమెంటరీని చూసి తట్టుకోలేక కన్నీరు మున్నీరుగా ఏడ్చేసారు. తనలో ఉద్వేగాన్ని దాచుకోలేకపోయారు. నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ `పమేలా: ఎ లవ్ స్టోరీ`ని చూస్తున్నప్పుడు ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. పమేలా కీర్తి ప్రతిష్ఠలపైనా.. తన ఎదుగుదలను ఆవిష్కరిస్తూనే తన కష్టం గురించి ఇందులో ఓపెన్ గా చర్చించారు. ఆమె కుమారుడు బ్రాండన్ థామస్ లీ నిర్మించిన ఈ డాక్యు చిత్రం కోసం షోబిజ్ స్పాట్‌లైట్‌లో పమేలా కొంత సమయం గడిపారు. అంతేకాదు.. పమేలా ఆ సినిమాని చూడకూడదని పట్టుబట్టింది. కానీ చివరికి ఆమె పశ్చాత్తాపం చెందింది. సినిమా చూడొద్దంటూ నిరాకరించినందుకు చాలా బాధ కలిగించింది... అని కూడా పమేలా ఇంటర్వ్యూలో తెలిపారు.