Begin typing your search above and press return to search.

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి..నవ్వుతూ నరాలు లాగేస్తాం..

పూర్తిగా గోదావరి బ్యాక్ డ్రాప్లో రాబోతున్న ఈ సినిమా పై పాజిటివ్ వైబ్రేషన్స్ అయితే క్రియేట్ అవుతున్నాయి.

By:  Tupaki Desk   |   31 July 2023 5:34 AM GMT
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి..నవ్వుతూ నరాలు లాగేస్తాం..
X

టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ ఎలాంటి సినిమా చేసిన కూడా అందులో ఏదో ఒక సరి కొత్త పాయింట్ ను హైలైట్ చేస్తూ ఉంటాడు. ఇక ఈసారి గోదావరి బ్యాక్ డ్రాప్ లో చేస్తున్న సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. పూర్తిగా గోదావరి బ్యాక్ డ్రాప్లో రాబోతున్న ఈ సినిమా పై పాజిటివ్ వైబ్రేషన్స్ అయితే క్రియేట్ అవుతున్నాయి. ఇప్పటికే కొన్ని గాసిప్స్ ద్వారా ఈ సినిమా చాలా ఆసక్తికరంగా రాబోతున్నట్లుగా టాక్ అయితే వినిపించింది.


ఇక ఇప్పుడు చిత్ర యూనిట్ సభ్యులు సినిమా పై అంచనాల ను పెంచే విధంగా ఆసక్తికరమైన ఒక గ్లింప్స్ అయితే విడుదల చేశారు. అందులో విశ్వక్ సేన్ వాయిస్ ఓవర్ కూడా విభిన్నమైన తరహాలో ఉండడం విశేషం. ఇక గ్లింప్స్ విషయానికి వస్తే మొదట విశ్వక్ వాయిస్ తో ఆకట్టుకునే విధంగా మొదలైంది. గోదావరి తీరాన విజువల్స్ హైలెట్ చేస్తూ.. మేము గోదావరి మాటోటి సాగదీస్తాం.. తేడాలు వస్తే నవ్వుతూ నరాలు లాగేస్తాం.. అంటూ విశ్వక్ సేన్ పవర్ఫుల్ రోల్ ను పరిచయం చేశారు.

విజువల్స్ చూస్తూ ఉంటే సినిమా లో సీరియస్ డ్రామా ఎక్కువగానే హైలెట్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇక సాయికుమార్ కూడా ఇందు లో కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. సీనియర్ నటుడు నాజర్ కూడా మరొక ముఖ్యమైన పాత్రలో నటించబోతున్నాడు. ఒక సాధారణ గోదావరి యువకుడు ఊహించని స్థాయిలో పెద్ద నాయకుల ను ఎదిరించి వారికి దీటుగా ఎలా నిలిచాడు అనేది ఈ సినిమా లోని అసలు కథ అని తెలుస్తోంది.

ఈ సినిమా ను రౌడీ ఫెలో - చల్ మోహన్ రంగా దర్శకుడు కృష్ణ చైతన్య డైరెక్ట్ చేస్తున్నాడు. ఇక ఈ ఫస్ట్ గ్లింప్స్ లో అయితే విజువల్స్ ఎంతో ఆసక్తికరంగానే ఉన్నాయి. యువన్ శంకర్ రాజా ఈ సినిమా కు మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇక అతను బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తో కూడా ఇరగదీసినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నాగ వంశీ నిర్మిస్తుండగా త్రివిక్రమ్ భార్య సౌజన్య ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్ లో కూడా సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

ఇక సినిమా పై ఈ ఫస్ట్ గ్లింప్స్ అయితే పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసింది. తప్పకుండా ఈసారి మాస్ కా దాస్ విశ్వక్ సరికొత్త లుక్కుతో ఆకట్టుకోబోతున్నట్లు తెలుస్తోంది. మరి బాక్సాఫీస్ వద్ద సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి. ఇక సినిమా ను ఈ ఏడాది డిసెంబర్లో విడుదల చేయాలని అనుకుంటున్నారు.