Begin typing your search above and press return to search.

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సెన్సార్ రిపోర్ట్.. ఇది కదా కావాల్సింది!

కృష్ణ చైతన్య దర్శకత్వంలో సీతార ఎంటర్టైన్మెంట్స్ లో రూపొందిన ఈ సినిమా ఇప్పటికే పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసింది.

By:  Tupaki Desk   |   29 May 2024 11:39 AM GMT
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సెన్సార్ రిపోర్ట్.. ఇది కదా కావాల్సింది!
X

ఊర మాస్ యాక్షన్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న విశ్వక్ సేన్ ఎలాంటి సినిమా చేసినా కూడా అందులో కొత్త తరహా కంటెంట్ ఉంటుంది అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చివరగా తను చేసిన గామీ సినిమా అందుకు ఉదాహరణగా నిలిచింది. ఇక విశ్వక్ సేన్ ఇప్పుడు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కృష్ణ చైతన్య దర్శకత్వంలో సీతార ఎంటర్టైన్మెంట్స్ లో రూపొందిన ఈ సినిమా ఇప్పటికే పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసింది.

ఇక ఈ సినిమా సెన్సార్ నుంచి కూడా పాజిటివ్ టాక్ అందుకోవడం విశేషం. ఈ సినిమా షూటింగ్ మొదలవక ముందే కాంబినేషన్ తోనే మంచి హైప్ క్రియేట్ చేసుకుంది. ఇక ఆ తర్వాత వరుస అప్డేట్స్ తో అంచనాల స్థాయిని మెల్లగా పెంచుతూ వస్తున్నారు. పోస్టర్ నుంచి ట్రైలర్ వరకు ప్రతి కంటెంట్ కూడా మంచి అంచనాలను క్రియేట్ చేసింది.

ఇక ట్రైలర్ చూసిన తర్వాత ఈ సినిమాకు ఎలాంటి సెన్సార్ లభిస్తుందో అని అనుకున్నా ఆడియన్స్ కు పాజిటివ్ న్యూస్ వచ్చింది. ఈ సినిమాకు సెన్సార్ సభ్యులు U/A సర్టిఫికెట్ ఇచ్చారు. సినిమాలో హై వోల్టేజ్ సన్నివేశాలు గట్టిగానే ఉన్నప్పటికీ ప్రతిదీ కూడా సన్నివేశానికి తగ్గట్టుగా ఉంటుందట. సినిమాలో మాస్ ఆడియన్స్ కు కావలసిన అన్ని రకాల అంశాలు ఇందులో ఉన్నాయి.

అలాగే ఫ్యామిలీ ఆడియన్స్ కోరుకునే మంచి ఎమోషన్స్ కూడా ఈ సినిమాలో ఉన్నట్లుగా తెలుస్తోంది. సినిమాకు వర్క్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఇప్పటికే సినిమా అదిరిపోయింది అంటూ ఒక రేంజ్ లో నమ్మకాన్ని క్రియేట్ చేశారు. ఇక ఈ సినిమాను చూసిన సెన్సార్ సభ్యులకు కూడా అదే తరహాలో రియాక్ట్ అవుతున్నారు. చాలాకాలం తర్వాత ఒక పవర్ఫుల్ ఇంటెన్స్ సినిమా చూసినట్లు చెప్పడంతో పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ అయింది.

సినిమాలోని సాంగ్స్ కూడా చాలా బాగా క్లిక్ అయ్యాయి. యువన్ శంకర్ రాజా మ్యూజిక్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా స్పెషల్ ఎట్రాక్షన్ గా ఉంటుందని బలమైన టాక్ వినిపిస్తోంది. సినిమాలో ఆర్ట్ వర్క్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచినట్లుగా తెలుస్తోంది. కెమెరా పనితనం కూడా మేజర్ ప్లేస్ పాయింట్ అని ఇదివరకే మేకర్స్ తెలియజేశారు. ట్రైలర్ ద్వారా కూడా ఆ విషయం పూర్తిగా అర్థమైపోయింది.

ఇక ఇప్పుడు సెన్సార్ నుంచి కూడా పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో సినిమాపై ఉన్న అంచనాలు మరింత పెరిగాయి. ఇక ఇంతలా పాజిటివ్ వైబ్రేషన్స్ అందుకుంటున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ నెల 31న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా ఈ సినిమా విడుదల కాబోతోంది. ఈ సినిమాలో నేహా శెట్టి, అంజలి ప్రధాన పాత్రలో నటించారు.