Begin typing your search above and press return to search.

మాస్ కా దాస్ జాక్‌ పాట్‌ కొట్టినట్టేనా..!

గామి వచ్చి ఎక్కువ వారాలు కూడా కాకుండానే అప్పుడే గ్యాంగ్స్ ఆఫ్‌ గోదావరి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యాడు

By:  Tupaki Desk   |   30 May 2024 10:34 AM GMT
మాస్ కా దాస్ జాక్‌ పాట్‌ కొట్టినట్టేనా..!
X

మాస్ కా దాస్ విశ్వక్‌ సేన్‌ గత చిత్రం గామి తో అందరి దృష్టిని ఆకర్షించాడు. కమర్షియల్ గా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం లో గామి సినిమా విఫలం అయినా కూడా నటన పరంగా, కాన్సెప్ట్‌ పరంగా మంచి మార్కులు సొంతం చేసుకుంది, విశ్వక్‌ సేన్ కి ఓ మంచి సినిమాగా నిలిచింది.

గామి వచ్చి ఎక్కువ వారాలు కూడా కాకుండానే అప్పుడే గ్యాంగ్స్ ఆఫ్‌ గోదావరి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యాడు. గ్యాంగ్స్ ఆఫ్‌ గోదావరి సినిమా ప్రమోషన్‌ లో విశ్వక్‌ సేన్ తెగ హడావుడి చేశాడు. ప్రీ రిలీజ్ ఈవెంట్‌ కు నందమూరి బాలకృష్ణ హాజరు అయ్యారు.

సినిమా ట్రైలర్ విడుదల తర్వాత అందరి దృష్టిని ఆకర్షించింది. విశ్వక్ సేన్ ను మరోసారి ఫ్యాన్స్ కోరుకునే వైల్డ్‌ పాత్రలో చూడబోతున్నాం అని ట్రైలర్‌ తో క్లారిటీ వచ్చింది. దర్శకుడు కృష్ణ చైతన్య కచ్చితంగా ఓ మంచి కమర్షియల్‌ మూవీని రూపొందించినట్లుగా అనిపిస్తుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న గ్యాంగ్స్ ఆఫ్‌ గోదావరి సినిమాకు పలు అంశాలు కలిసి వస్తున్నాయి. గత కొన్ని రోజులుగా పెద్ద సినిమాలు ఏమీ లేవు, దాంతో ప్రేక్షకులు ఓ మంచి సినిమా కోసం వెయిట్‌ చేస్తున్నారు. రేపు ఈ సినిమా తో విడుదల అవ్వబోతున్న మరో రెండు సినిమాలు కూడా మీడియం రేంజ్ సినిమా లే అవ్వడం వల్లే ఈ సినిమాకు కలిసి వస్తుంది.

మొత్తానికి కాస్త పాజిటివ్‌ టాక్‌ ను గ్యాంగ్స్ ఆఫ్‌ గోదావరి సినిమా దక్కించుకుంటే ఖచ్చితంగా హీరో విశ్వక్‌ సేన్ మరియు నిర్మాతలు జాక్ పాట్‌ కొట్టినట్లే అనే అభిప్రాయం ను సినీ విశ్లేషకులు, బాక్సాఫీస్ వర్గాల వారు అంటున్నారు. మరి విశ్వక్‌ సేన్‌ ఆ పాజిటివ్‌ టాక్‌ దక్కించుకుంటాడా అనేది చూడాలి.