Begin typing your search above and press return to search.

నవ్వుతారు.. కోప్పడతారు.. బాధపడతారు.. లంకల రత్న మీకు గుర్తుండిపోతాడు..!

విశ్వక్ సేన్ లీడ్ రోల్ లో నేహా శెట్టి, అంజలి కథానాయికలుగా కృష్ణ చైతన్య డైరెక్షన్లో తెరకెక్కిన సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి

By:  Tupaki Desk   |   31 May 2024 7:41 AM GMT
నవ్వుతారు.. కోప్పడతారు.. బాధపడతారు.. లంకల రత్న మీకు గుర్తుండిపోతాడు..!
X

విశ్వక్ సేన్ లీడ్ రోల్ లో నేహా శెట్టి, అంజలి కథానాయికలుగా కృష్ణ చైతన్య డైరెక్షన్లో తెరకెక్కిన సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ కలిసి నిర్మించిన ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తుపాకి.కాం కి ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ ఇచ్చారు డైరెక్టర్ కృష్ణ చైతన్య. ఆయన కెరీర్ ఇంకా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి జర్నీకి సంబంధించిన విషయాలను పంచుకున్నారు. ఆ విశేషాలేమిటో చూద్దాం.

లిరిసిస్ట్ గా ఎలా మారారని అడిగితే.. చిన్నప్పటి నుంచి బుక్స్ చదువుతూ పాటలు రాయడం అలవాటుగా మారింది. అలా లిరిసిస్ట్ గా ఛాన్స్ వచ్చిందని అన్నారు. పాటలు రాస్తూనే సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేయడం వల్ల సినిమాకు సంబందించిన అన్ని క్రాఫ్ట్స్ లో కాస్త టచ్ ఏర్పడిందని అన్నారు. అసిస్టెంట్ డైరెక్టర్ గా చేస్తూ పాటలు రాశాను అయితే పాటలు ఎక్కువ గుర్తింపు ఇస్తాయి కాబట్టి తనని లిరిసిస్ట్ గా మాత్రమే గుర్తించారని అన్నారు.

ఇక విశ్వక్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి విషయాల గురించి చెబుతూ ఈ సినిమాలో అన్ని ఎమోషన్స్ ఉన్నాయని అన్నారు. విశ్వక్ నటించిన అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమాలో అతని పర్ఫార్మెన్స్ చూసి ఈ కథకు తను కరెక్ట్ అని అనిపించిందని అన్నారు.

ఈ సినిమా కథ చెప్పిన టైం లోనే 7 నిమిషాల షార్ట్ ఫిల్మ్ త్రివిక్రం గారికి చూపించడంతో సినిమా ఓకే చేశారని చెప్పుకొచ్చారు కృష్ణ చైతన్య. అంతేకాదు సినిమాకు టైటిల్ కూడా త్రివిక్రం గారే పెట్టిన విషయాన్ని ప్రస్తావించారు. ఈ సినిమాలో అంజలి కూడా హీరోయినే అని గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో ఇద్దరు హీరోయిన్స్ అని డౌట్ క్లియర్ చేశారు.

ఈ సినిమాలో డైలాగ్ లో లాగా చెప్పాలంటే సినిమాలో క్యారెక్టర్ వైజ్ చూస్తే విశ్వక్, అంజలి నాసిరకం.. నేహా శెట్టి ప్యూర్ సోల్ ఆమె నాణ్యమైన రకమని అన్నారు. బయట అంతా కూడా డెడికేషన్ తో వర్క్ చేస్తారు కాబట్టి అందరు కూడా నాణ్యమైన రకమే అని చెప్పారు కృష్ణ చైతన్య. సినిమాలో అన్ని అంశాలు ఉన్నాయని లంకల రత్నతో మీరు నవ్వుతారు.. వాడిపై కోప్పడతారు.. వాడి కోసం బాధపడతారు.. చివరకు వాడు మీకు గుర్తుండిపోతాడని సినిమాపై ఆసక్తి పెంచారు డైరెక్టర్ కృష్ణ చైతన్య.

ఇవే కాకుండా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి డైరెక్టర్ కృష్ణ చైతన్య సినిమా గురించి పంచుకున్న విషయాలేంటో కింద ఇంటర్వ్యూలో చూసేయండి.