Begin typing your search above and press return to search.

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి.. అక్కడా మంచి సౌండే!

టాలీవుడ్ మాస్ కా దాస్, యంగ్ హీరో విశ్వక్ సేన్.. వరుస సినిమాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే

By:  Tupaki Desk   |   16 Jun 2024 6:28 AM GMT
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి.. అక్కడా మంచి సౌండే!
X

టాలీవుడ్ మాస్ కా దాస్, యంగ్ హీరో విశ్వక్ సేన్.. వరుస సినిమాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. 2024లో ఇప్పటికే గామి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రాలతో మంచి హిట్లు అందుకున్న విశ్వక్ సేన్.. చేతి నిండా సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్నారు. వరుస షూటింగ్స్ లో పాల్గొంటూ సినిమాలను కంప్లీట్ చేస్తున్నారు. గామిలో అఘోర రోల్ లో కనిపించి విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్న విశ్వక్.. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో లంకల రత్నగా అలరించారు.

ఛల్ మెహన రంగ ఫేమ్ కృష్ణ చైతన్య దర్శకత్వం వహించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీలో విశ్వక్ సేన్.. తన యాక్షన్, డైలాగుల డెలివరీతో ప్రేక్షకులను మెప్పించారు. రూరల్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ సినిమా.. ఆడియన్స్ నుంచి మంచి టాక్ దక్కించుకుని సాలిడ్ వసూళ్లు రాబట్టింది. గోదావరి జిల్లాల బ్యాక్‍ డ్రాప్‍ లో లోకల్ పాలిటిక్స్‌ తో తెరకెక్కిన ఈ మూవీ.. బాక్సాఫీస్ వద్ద మంచి పర్ఫార్మెన్స్ చేసింది.

విశ్వక్ కెరీర్ లో గామి తర్వాత భారీ ఓపెనింగ్స్ సాధించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ.. రీసెంట్ గా ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ లోకి వచ్చింది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో కూడా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీలో మంచి వ్యూస్ దక్కించుకుని దూసుకుపోతోంది. ఓటీటీ లవర్స్ సినిమా చూసి ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. విశ్వక్ యాక్టింగ్ కు ఫిదా అవుతున్నారు.

మాస్ కా దాస్ ట్యాగ్ కు విశ్వక్ సేన్ ఈ సినిమాలో సరైన న్యాయం చేశారని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. డైరెక్టర్ కృష్ణ చైతన్య మేకింగ్ పట్ల ప్రశంసలు కురిపిస్తున్నారు. చాలా బాగా తీశారని కొనియాడుతున్నారు. మంచి కాన్సెప్ట్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారని చెబుతున్నారు. సినిమాలోని ప్రతి విషయంలో ఆయన వర్కింగ్ టాలెంట్ కనపడిందని అంటున్నారు. మొత్తానికి ఓటీటీలో GOG మూవీ దూసుకుపోతోంది.

సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్య దేవర నాగవంశీ, సాయి సౌజన్య.. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీని నిర్మించారు. డీజే టిల్లు ఫేమ్ నేహా శెట్టి హీరోయిన్ గా నటించారు. తెలుగమ్మాయి అంజలి లీడ్ రోల్ పోషించారు. నాజర్, సాయి కుమార్, గోపరాజు రమణ, మధుసూధన్, హైపర్ ఆది కీలక పాత్రల్లో నటించారు. యువన్ శంకర్ రాజా అదిరిపోయే మ్యూజిక్ అందించగా.. సాంగ్స్ ఇప్పటికీ ట్రెండింగ్ లోనే ఉన్నాయి.