Begin typing your search above and press return to search.

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి టీజర్.. శివాలెత్తిపోద్దంతే

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా ఏ క్షణంలో స్టార్ట్ చేశారో గాని దాని చుట్టూ ఉన్న పాజిటివ్ వైబ్ తో సినిమా బాక్సాఫీస్ వద్ద గట్టిగానే ఇంపాక్ట్ చూపించేలా కనిపిస్తోంది

By:  Tupaki Desk   |   27 April 2024 11:54 AM GMT
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి టీజర్.. శివాలెత్తిపోద్దంతే
X

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా ఏ క్షణంలో స్టార్ట్ చేశారో గాని దాని చుట్టూ ఉన్న పాజిటివ్ వైబ్ తో సినిమా బాక్సాఫీస్ వద్ద గట్టిగానే ఇంపాక్ట్ చూపించేలా కనిపిస్తోంది. టాలెంటెడ్ నటుడు విశ్వక్ సేన్ ఎలాంటి కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా కూడా అందులో ఏదో ఒక కొత్త తరహా పాయింట్ ఉంటుందని చెప్పవచ్చు. అలాగే GOG లో కూడా డిఫరెంట్ యాక్షన్ ఎమోషనల్ సీన్స్ హైలెట్ కాబోతున్నట్లు తెలుస్తోంది.

రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ లో ఆడియెన్స్ కు బోర్ కొట్టించకుండా విశ్వక్ విభిన్నమైన కథలను సెలెక్ట్ చేసుకుంటూ ఉన్నాడు. రీసెంట్ గా వచ్చిన గామి సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ రాబట్టడమే కాకుండా నటుడిగా అతని స్థాయిని పెంచింది. ప్రయోగాలు చేయడంలో విశ్వక్ ధైర్యం ఎలా ఉంటుందో ఆ అఘోరా పాత్రతో అర్థమైపోయింది.

ఇక ఇప్పుడు రాబోయే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో కూడా విశ్వక్ చేసే క్యారెక్టర్ హై వోల్టేజ్ వైబ్రేషన్స్ కలిగించేలా ఉండబోతోందని పోస్టర్స్ ద్వారానే ఒక క్లారిటీ వచ్చేసింది. ఒక సాధారణ యువకుడు పవర్ఫుల్ పొలిటికల్ లీడర్స్ ను ఎదిరించడమే కాకుండా చాలా చిన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎలా ఎదిగాడు అనే కాన్సెప్ట్ తో GOG ఉండబోతోంది. సినిమాలో కంటెంట్ కు తగ్గట్టుగా విశ్వక్ కాస్త నెగిటివ్ షెడ్ లో కూడా కనిపించబొతున్నట్లు తెలుస్తోంది. ఇక మొత్తానికి సినిమాకు సంబంధించిన టీజర్ విడుదల చేశారు.

'ఒక్కసారి లంకలో కత్తి కట్టారు అంటే.. ఆ మనిషిని చంపకుండా వదలరు' అంటూ సీనియర్ నటుడు సాయి కుమార్ డైలాగ్ తో టీజర్ ఓ రేంజ్ లో మొదలైంది. లంక అనే ఊరికి చెందిన రత్న అనే యువకుడి కథగా ఈ సినిమా తెరకెక్కుతోందని తెలుస్తోంది. ఓ కారణంతో హీరోపైకి గ్రామమంతా దండెత్తి వస్తుంది. అతడిని కాపాడడం ఇక అమ్మోరు దయేనని బ్కాక్ గ్రౌండ్ డైలాగ్ వినిపిస్తోంది.

ఇంతలో లంకల రత్న(విశ్వక్ సేన్) .. వచ్చినవారిని నరికేస్తూ కనిపించారు. అమ్మోరు పూనేసింది రా, ఈసారి ఒక్కొక్కడికి శివాలెత్తిపోద్దంతే అంటూ విశ్వక్ చెప్పిన డైలాగ్ వేరే లెవల్. లంకల రత్నగా విశ్వక్ ఊర మాస్ అవతార్ లో అదరగొట్టేశారు. అసలు లంకల రత్న ఏం చేశారు? ఎందుకు ఊరంతా ఆయన కోసం వెంటాడుతోంది? ఎందుకు దండెత్తింది? ఈ విషయాలు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. మొత్తానికి టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంటోంది.

సాంగ్స్ పోస్టర్స్ ద్వారానే మంచి హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమా టీజర్ తో అంచనాల స్థాయిని మరింత పెంచేసింది. దర్శకుడు కృష్ణ చైతన్య మేకింగ్ విధానం విజువల్స్ తో పాటు విశ్వక్ క్యారెక్టర్ కూడా హైలైట్స్ గా నిలిచాయి. ఇలాంటి విజువల్స్ ను హైలెట్ చేసిన డైరెక్టర్ కృష్ణ చైతన్యపై కూడా పాజిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. దర్శకుడు కృష్ణ చైతన్య మొదట పాటల రచయితగా ఇండస్ట్రీలో మంచి గుర్తింపును అందుకున్న విషయం తెలిసిందే.

ఇక మొదటగా నారా రోహిత్ తో రౌడీ ఫెలో అనే సినిమా ద్వారా కృష్ణచైతన్య దర్శకుడిగా సరికొత్త కెరీర్ ను స్టార్ట్ చేశాడు. ఆ సినిమా అప్పట్లో థియేటర్లో అంతగా ఆడకపోయినప్పటికీ ఆ తర్వాత మాత్రం OTTలో మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇక మళ్లీ కొన్నేళ్లకు నితిన్ తో చేసిన 'చల్ మోహనరంగ' సినిమాకు కూడా మంచి పాజిటివ్ టాక్ దక్కింది.

అయితే ఈ సినిమా వచ్చిన క్రమంలోనే అప్పుడే భరత్ అనే నేను - రంగస్థలం లాంటి సినిమాలు వెనకా ముందు రావడం వలన బాక్సాఫీస్ వద్ద కొంత ప్రభావం పడింది. అయినప్పటికీ ఆ సినిమా కంటెంట్ తో దర్శకుడు ఓ వర్గం ఆడియెన్స్ ను ఎంతగానో ఎట్రాక్ట్ చేశాడు. ఇక చివరిగా ఇప్పుడు అతను గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే సినిమాతో రాబోతున్నాడు. యాక్షన్ డ్రామాగా రాబోతున్న ఈ సినిమాలో మంచి ఎమోషన్స్ కూడా హైలెట్ కాబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక వరల్డ్ వైడ్ గా ఈ సినిమా మే 17న విడుదల కాబోతోంది.