Begin typing your search above and press return to search.

విశ్వక్ GOG.. రెండు రోజుల్లో ఎన్ని కోట్లంటే?

సినిమా సినిమాకు తన మార్కెట్ పెంచుకుంటూ దూసుకుపోతున్నారు.

By:  Tupaki Desk   |   2 Jun 2024 1:11 PM GMT
విశ్వక్ GOG.. రెండు రోజుల్లో ఎన్ని కోట్లంటే?
X

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్.. ఇటీవల గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఛల్ మోహన రంగ ఫేమ్ కృష్ణ చైతన్య డైరెక్ట్ చేసిన ఈ మూవీలో లంకల రత్నగా సందడి చేశారు విశ్వక్. ఊర మాస్ క్యారెక్టర్ లో అలరించారు. తన యాక్టింగ్ తో ఫిదా చేశారు. సినిమా సినిమాకు తన మార్కెట్ పెంచుకుంటూ దూసుకుపోతున్నారు.


ఇప్పటికే 2024లో గామి మూవీతో మంచి హిట్ అందుకున్నారు. సాలిడ్ ఓపెనింగ్స్ సాధించిన ఈ చిత్రంలో అఘోర శంకర్ పాత్రలో నటించి.. విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు దక్కించుకున్నారు. గత ఏడాది విశ్వక్ దాస్ కా దమ్కీ మూవీతో ప‌ల‌క‌రించగా.. ఈ సినిమాకు కూడా మంచి ఓపెనింగ్స్ వ‌చ్చాయి. ఇప్పుడు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా ఓపెనింగ్స్ కూడా సాలిడ్ గానే ఉన్నాయి.

తొలి రోజు ఈ మూవీ.. ప్రపంచ వ్యాప్తంగా రూ.8.2 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. విశ్వక్ కెరీర్ లో హైయెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా నిలిచింది. అయితే రెండు రోజులు కలిపి ఈ చిత్రం రూ.12.1 కోట్ల వసూళ్లు సాధించినట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. మొత్తానికి రెండో రోజు కూడా ఈ సినిమా డీసెంట్ వసూళ్లనే రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఆదివారం అదే జోరు కొనసాగిస్తే త్వరలోనే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకునే అవకాశం ఉందని చెప్పాయి.

ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్ బ్యాన‌ర్‌ పై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. డీజే టిల్లు ఫేమ్ నేహా శెట్టి హీరోయిన్ గా యాక్ట్ చేయగా.. అంజలి కీలక పాత్ర పోషించింది. బాలీవుడ్ బ్యూటీ ఆయేషా ఖాన్.. స్పెషల్ సాంగ్ లో మెరిసింది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది. థియేటర్లో ఈ మూవీ విడుదలైన మూడు వారాల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ అవ్వనున్నట్లు టాక్.

స్టోరీ లైన్ ఇదే.. లంక గ్రామానికి చెందిన లంకల రత్న (విశ్వక్ సేన్) దొంగతనాలు చేస్తుంటాడు. చాలా మందిని బురిడీ కొట్టించి బతుకుతుంటాడు. తన ప్రాంతానికి చెందిన రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరు ఉంటుంది. ఓ వర్గం వైపు చేరి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుస్తాడు. ఆ తర్వాత హీరోయిన్ నేహా శెట్టితో ప్రేమలో పడతాడు. అనంతరం కథ ఇంట్రెస్టింగ్ గా మలుపు తిరుగుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.