Begin typing your search above and press return to search.

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి యూఎస్ఏ ప్రీమియర్ షో టాక్

ఇక ఇప్పుడు మాస్ కా బాప్ అనేలా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి క్యారెక్టర్ తో మరో వైబ్ క్రియేట్ చేసేందుకు రేస్ స్టార్ట్ చేశాడు.

By:  Tupaki Desk   |   31 May 2024 12:30 AM GMT
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి యూఎస్ఏ ప్రీమియర్ షో టాక్
X

విశ్వక్ సేన్, రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్‌ను పక్కనబెట్టి, విభిన్నమైన కథలను ఎంచుకోవడం ద్వారా తన మార్కెట్ రేంజ్ కూడా పెరుగుతోంది. ఇటీవల విడుదలైన "గామి" చిత్రం, బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు సాధించడమే కాకుండా, విశ్వక్ సేన్ నటనలో ఉన్న నైపుణ్యాన్ని కొత్త ఎత్తుకు తీసుకువెళ్లింది. అఘోరా పాత్రలో చేసిన ప్రయోగాలు, అతని ధైర్యాన్ని నిరూపించాయి. ఇక ఇప్పుడు మాస్ కా బాప్ అనేలా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి క్యారెక్టర్ తో మరో వైబ్ క్రియేట్ చేసేందుకు రేస్ స్టార్ట్ చేశాడు.

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా గ్రాండ్ గా విడుదల అవుతోంది. ఇక ఇండియా లో కంటే ముందే యూఎస్ లో సినిమా ప్రీమియర్ షోలతో హడావుడి మొదలైంది. సినిమా టాక్ ఎలా ఉంది అనే వివరాల్లోకి వెళితే.. "గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి" సినిమాలో విశ్వక్ సేన్ హై వోల్టేజ్ పాత్రలో కనిపించాడు. ఈ కథలో సాధారణ యువకుడు, పవర్ఫుల్ పొలిటికల్ లీడర్లను ఎదిరించి, చిన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదిగే ప్రయాణం చూపించబడుతుంది.

విశ్వక్ లంకల రత్న పాత్రలో కాస్త నెగెటివ్ షేడ్స్ కూడా ఉన్నాయి, అయితే పాత్ర వెనుక ఉన్న ఏమోషన్ ను కూడా విశ్వక్ చాలా చక్కగా బ్యాలెన్స్ చేశాడు. ఇప్పటివరకు అతను వెండితెరపై ఈ స్థాయిలో కిక్ ఇవ్వలేదు అనే చెప్పాలి. లుంగీ కట్టులో.. కత్తి పట్టి.. నాటు గోదావరి స్లాంగ్ లో అతను చేసిన రచ్చ మామూలుగా లేదు. ఈ ఇంటెన్స్ డ్రామా కు అతను వంద శాతం కంటే ఎక్కువే న్యాయం చేశాడు.

కృష్ణ చైతన్య కథనంకు తగ్గట్టుగా రాసుకున్న డైలాగ్స్ సినిమాకు మరొక మేజర్ ప్లస్ పాయింట్. సినిమాలో ప్రతి సన్నివేశం ఒకదానికొకటి లింక్ అయ్యేలా అతను సెట్ చేసుకున్న స్క్రీన్ ప్లే బాగుంది. ఒక గ్యాంగ్ ను మించి మరో గ్యాంగ్ వారి ప్రపంచంలోకి తీసుకెళ్లే విధంగా ఉన్న ఎపిసోడ్స్ బాగా క్లిక్కయ్యాయి. కథ ఎక్కడ స్లో అవ్వకుండా ఉంటుంది. ఒకవైపు హై వోల్టేజ్ సీన్స్ మరోవైపు లవ్లీ డ్రామా, అలాగే ఎమోషన్ కూడా మిస్ అవ్వకుండా దర్శకుడు చాలా జాగ్రత్తగా డీల్ చేసినట్లు అనిపిస్తుంది.

నేహా శెట్టి - విశ్వక్ కాంబో సీన్స్ చాలా క్యూట్ గా ఉండడమే కాకుండా ఒక మంచి కపుల్ ఫీలింగ్ కలిగిస్తుంది. అంజలి రత్నమాల క్యారెక్టర్ కూడా మరో హైలెట్ అనే చెప్పాలి. ఆమె తప్ప ఆ పాత్రకు ఎవరు సెట్ కారేమో అనేలా తన టాలెంట్ చూపించింది. ఎమోషన్ తో కూడా కట్టి పడేసింది. ఇక విజిల్స్ వేసే మూమెంట్స్ గట్టిగానే ఉన్నాయి. ముఖ్యంగా "ఒక్కొక్కడికి శివాలెత్తిపోద్దంతే" అనే విశ్వక్ చెప్పిన డైలాగ్ కు పక్కా విజిల్స్ పడాల్సిందే.

సినిమాలో యువన్ శంకర్ రాజా సాంగ్స్ మాత్రమే కాకుండా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అయితే మరొక మేజర్ ప్లస్ పాయింట్ అని చెప్పాలి. యాక్షన్ సీన్స్ లో అలాగే, ఎమోషనల్ సీన్స్ కు అతని బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పర్ఫెక్ట్ గా సెట్టయ్యింది. అలాగే చివరి అరగంట సినిమా మరింత ఆసక్తికరంగా ఉంది. ముఖ్యంగా దర్శకుడు ఎమోషనల్ సీన్స్ తో హార్ట్ ని టచ్ చేస్తాడు. ఫైనల్ గా GOG సరిపడా మాస్ ఎలిమెంట్స్ తో పాటు మంచి ఎమోషన్ తో ఇంటిల్లిపాది చూసే విధంగా ఉంది. ఫస్ట్ డే సినిమా బాక్సాఫీస్ వద్ద సాలీడ్ ఓపెనింగ్స్ అందుకోవడం పక్కా అని చెప్పవచ్చు. తుపాకీ రివ్యూ కోసం మరి కాసేపట్లో..