Begin typing your search above and press return to search.

విశ్వక్ GOG.. గట్టిగానే ప్లాన్ చేశారుగా!

నేడు తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ జరుగుతున్న సందర్భంగా.. అంతా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుతూ పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.

By:  Tupaki Desk   |   13 May 2024 11:00 AM GMT
విశ్వక్ GOG.. గట్టిగానే ప్లాన్ చేశారుగా!
X

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్స్ లిస్ట్ లో యంగ్ హీరో విశ్వక్ సేన్.. ముందు వరుసలో కచ్చితంగా ఉంటారు. కథలు, పాత్రల ఎంపికలో వైవిధ్యం చూపిస్తూ వరుస విజయాలను తన ఖాతాలో వేసుకుంటూ దూసుకుపోతున్నారు. ఇప్పుడు మరో క్రేజీ మూవీ.. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరితో త్వరలోనే ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. లంకల రత్న అనే పవర్ ఫుల్ రోల్ లో సందడి చేయనున్నారు.

ఛల్ మోహన్ రంగ ఫేమ్ కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ.. మే 31వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన ట్రైలర్, టీజర్, పోస్టర్లకు సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా పోస్టర్లు.. సినిమాపై క్రమంగా మంచి హైప్ క్రియేట్ చేస్తున్నాయి. ఇటీవల హీరోహీరోయిన్ల లిప్ లాక్ సీన్ పోస్టర్ రిలీజ్ చేసిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మేకర్స్.. తాజాగా మరో పోస్టర్ ను రివీల్ చేశారు.

నేడు తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ జరుగుతున్న సందర్భంగా.. అంతా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుతూ పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. రాజకీయ నేతగా విశ్వక్ పోస్టర్ లో కనిపిస్తున్నారు. నుదిటిన పెద్ద బొట్టు, చేతులెత్తి దండం పెట్టడం చూస్తుంటే.. మూవీలో విశ్వక్ యాక్షన్ వేరే లెవల్ లో ఉండనున్నట్లు తెలుస్తోంది. పొలిటికల్ ఎలిమెంట్ ను ఈ సినిమాలో స్ట్రాంగ్ గానే మేకర్స్ యాడ్ చేసినట్లు సమాచారం.

ఇప్పుడు ఈ విషయం కోసమే నెట్టింట జోరుగా చర్చ సాగుతోంది. విశ్వక్ కు మరో హిట్ పక్కా అని ఫ్యాన్స్ చెబుతున్నారు. సినిమా కోసం ఈగర్లీ వెయిటింగ్ అని కామెంట్లు పెడుతున్నారు. మాస్ రోల్ లో విశ్వక్ దుమ్ముదులిపేయనున్నారని అంటున్నారు. ఇక విశ్వక్ కూడా తనకు వచ్చిన ట్యాగ్ 'మాస్ కా దాస్' కు ఈ సినిమా న్యాయం చేస్తుందని ఇటీవల ఓ ఈవెంట్ లో తెలిపారు.

ఇక ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్‌ ఫోర్ సినిమాస్‌ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తున్న ఈ చిత్రానికి వెంకట్ ఉప్పుటూరి, గోపి చంద్ ఇన్నమూరి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. యంగ్ హీరోయిన్ నేహా శెట్టి ఫిమేల్ లీడ్ రోల్ పోషిస్తున్నారు. మరో ప్రముఖ హీరోయిన్ అంజలి కీలక పాత్రలో కనిపించనున్నారు. యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందిస్తున్నారు. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.