Begin typing your search above and press return to search.

సుకుమార్, బన్నీ.. అసలేం జరుగుతోంది?

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ కి మంచి క్రేజ్ ఉంటుంది.

By:  Tupaki Desk   |   17 July 2024 4:05 AM GMT
సుకుమార్, బన్నీ.. అసలేం జరుగుతోంది?
X

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ కి మంచి క్రేజ్ ఉంటుంది. వీరిద్దరూ కలిసి కెరియర్ ఆరంభంలో చేసిన ఆర్య మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. తరువాత ఆర్య 2 కూడా సక్సెస్ అయ్యింది. ఇక పుష్ప మూవీ అయితే పాన్ ఇండియా లెవల్ సూపర్ హిట్ అయ్యింది. అల్లు అర్జున్ కి యాక్టర్ గా పుష్ప మూవీ నేషనల్ అవార్డు తీసుకొచ్చింది. అలాగే అతని క్రేజ్ ని సైతం నేషనల్ లెవల్ లో పుష్ప మూవీ ఎస్టాబ్లిష్ చేసింది.

ఈ కారణంగానే పుష్పకి సీక్వెల్ గా రెడీ అవుతోన్న పుష్ప ది రూల్ మీద భారీ హైప్ నెలకొని ఉంది. ముఖ్యంగా నార్త్ ఆడియన్స్ పుష్ప ది రూల్ మూవీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కచ్చితంగా సుకుమార్, బన్నీ కాంబినేషన్ లో బెస్ట్ మూవీ పుష్ప ది రూల్ అవుతుందని అందరూ అంచనా వేస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ కోసం సుకుమార్ చాలా ఎక్కువ సమయం తీసుకున్నారు.

గత మూడేళ్ళ నుంచి మూవీ షూటింగ్ స్టేజ్ లోనే ఉంది. ఇంకా 35 రోజుల షెడ్యూల్ పెండింగ్ ఉందంట. ఈ షూటింగ్ ఆలస్యం కావడం వలన పుష్ప ది రూల్ మూవీ ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడింది. ఆగష్టు 15న రిలీజ్ పక్కా అనుకున్నారు. అయితే డిసెంబర్ 6కి వాయిదా వేశారు. ఈ మూవీ వీలైనంత వేగంగా పూర్తి చేసి బన్నీ నెక్స్ట్ ప్రాజెక్ట్ కి వెళ్లాలని అనుకుంటున్నారు. పెర్ఫెక్షన్ కోసం అంటూ సుకుమార్ షూటింగ్ చాలా నెమ్మదిగా చేస్తున్నారు.

ఒక్క సీన్ కోసం కనీసం పది షాట్స్ తీసుకుంటారనే అభిప్రాయం ఇండస్ట్రీలో ఉంది. పుష్ప ది రూల్ లేట్ కావడంతో బన్నీ అసహనానికి గురైనట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో అతను రీసెంట్ గా షూటింగ్ పక్కన పెట్టి ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కి వెళ్లిపోయారని టాక్ వస్తోంది. మరల వెకేషన్ నుంచి తిరిగి వచ్చిన ఫోటోలు వైరల్ అయ్యాయి. తాజా లుక్ లో ఏదో తేడా కనిపిస్తోందని నెటిజన్లు నుంచి కామెంట్స్ వస్తున్నాయి. పుష్ప ది రూల్ కోసం మెయింటేన్ చేస్తోన్న లుక్ లో బన్నీ లేడని, గెడ్డం ట్రిమ్ చేసినట్లు ఉందని ఫోటోలని చూపిస్తున్నారు.

దీంతో సుకుమార్, బన్నీ మధ్య గ్యాప్ పెరిగిందనే ప్రచారం తెరపైకి వచ్చింది. షూటింగ్ చాలా నెమ్మదిగా చేస్తూ ఉండటంతో బన్నీ బాగా అసంతృప్తిగా ఉన్నాడనే మాట వినిపిస్తోంది. కంటిన్యూగా నెల రోజులు షూటింగ్ చేసిన బన్నీ పార్టిసిపేట్ చేయడానికి రెడీగా ఉన్నారు. అయితే డిసెంబర్ వరకు టైం ఉందనే ఉద్దేశ్యంతో సుకుమార్ పెండింగ్ షూటింగ్ ఇంకా ఆలస్యం చేస్తున్నారని అల్లు అర్జున్ కోపంతో ఉన్నారంటూ టాక్ ఇండస్ట్రీలో నడుస్తోంది. అందుకే అతను గెడ్డం ట్రిమ్ చేసి ఉంటాడని మాట్లాడుకుంటున్నారు. అయితే ఇందులో వాస్తవం ఎంత ఉందనేది తెలియదు. మరి మేకర్స్ ఏమైనా క్లారిటీ ఇస్తారో లేదో చూడాలి.