మా పిల్లలకు మా మతం 'మానవత్వం' అని చెబుతాం!
గౌరీఖాన్ ని పేరును అయేషాగా మారుస్తానని షారుక్ అత్తింటి కుటుంబ సభ్యుల్ని ఆటపట్టించినట్లు సరదాగా వ్యాఖ్యానించారు.
By: Tupaki Desk | 10 Oct 2024 7:30 PM GMTషారుక్ ఖాన్-గౌరీఖాన్ జోడీ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇద్దరిది ప్రేమ వివాహం. షారుక్ ని గౌరీఖాన్ని ఎంతగానో ప్రేమించి వివాహం చేసుకున్నారు. అయితే ఈ పెళ్లికి తొలుత గౌరీఖనా్ కుటుంబ సబ్యులు అంగీకరించలేదు. ఇద్దరిది వేర్వేరు మతాలు కావడంతో వివాహం అనంతరం చాలా సమస్యలు వస్తాయని అంగీకరించలేదు. అయినా ప్రేమికుల్ని కుల, మతాలు ఆపలేవు కదా. అలా గౌరీ ఖాన్-షారుక్ ఖాన్ ల పెళ్లి జరిగింది.
ఇటీవలే గౌరీఖాన్ 54 వ పుట్టిన రోజు వేడుకను జరుపుకున్నారు. ఈ సందర్భంగా గౌరీ ఖాన్ వివాహం గురించి మరిన్ని విషయాలు రివీల్ చేసారు. అవేంటో ఆమె మాటల్లోనే.. `కింగ్ ఖాన్ తో నాకు పెళ్లి చేయడానికి నా తల్లిదండ్రులు అప్పట్లో ఎంత మాత్రం సిద్దంగా లేరు. దీంతో షారుక్ ఖాన్ తన పేరును అభినవ్ గా మార్చుకున్నారు. ఇది నాకెంతో వెర్రితనంగా అనిపించింది. వివాహం కోసం పేరును మార్చుకోవడం ఏంటి? అని అనిపించింది.
తల్లిదండ్రులు షారుక్ ఖాన్ ని మతం మార్చుకోమనే ప్రపోజల్ తీసుకొచ్చారని గుర్తు చేసారు. ` గౌరీ కుటుంబ సభ్యులు మతమార్పిడి గురించి చర్చించుకోవడం షారుక్ విన్నట్లు గతంలో ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేసారు. అలాగే గౌరీ ఖాన్ ని బుర్ఖా ధరించమని, నమాజ్ చదవమన్నట్లు ఆట పట్టించినట్లు చెప్పుకొచ్చారు. గౌరీఖాన్ ని పేరును అయేషాగా మారుస్తానని షారుక్ అత్తింటి కుటుంబ సభ్యుల్ని ఆటపట్టించినట్లు సరదాగా వ్యాఖ్యానించారు.
అలాగే గౌరీఖాన్ మరో ఇంటర్వ్యూలో? తన భర్త మతాన్ని ఎప్పుడూ గౌరవిస్తానన్నారు. కానీ ఎప్పుడూ తన మతం మార్చుకోను? అనే అంశాన్ని ఉద్ఘాటించారు. షారుక్ ఖాన్ కూడా ఎప్పుడూ అలాంటి ఒత్తిడి తీసుకొచ్చింది లేదని, అన్నిమతాల్ని గౌరవిస్తారని, తమ పిల్లలు మతం గురించి అడిగితే `మానవత్వం` అని చెబుతారని గౌరీఖాన్ అన్నారు. అలాగే ప్రతి పండుగను తమ నివాసంలో ఎంతో గ్రాండ్ గా జరుపుకుంటామని గుర్తు చేసారు.