హీరో గారి వైఫ్ డిజైన్ చేసిన టాప్ సెలబ్ హోమ్స్!
A-జాబితా ప్రముఖుల ఇళ్లను అలంకరించడం, రూపకల్పన చేయడం వంటి నైపుణ్యంతో గౌరీఖాన్ నిరంతరం స్టార్ వరల్డ్ లో రాణిలా మెరిసారు.
By: Tupaki Desk | 15 Sep 2023 5:30 PM GMTబాలీవుడ్ ని ఏల్తున్న కింగ్ ఖాన్ షారూఖ్ భార్యగా గౌరీఖాన్ సుపరిచితం. ఢిల్లీలో సవిత - కల్నల్ రమేష్ చంద్ర చిబ్బర్ దంపతులకు జన్మించిన గౌరీ ఖాన్, 1984లో అప్పటి వర్ధమాన నటుడు షారూఖ్ ఖాన్ తో ప్రేమలో పడడం అటుపై ఆ ప్రేమ వికసించి బోలెడన్ని ట్విస్టుల నడుమ పెళ్లవ్వడం తెలిసినదే. ఢిల్లీలో కలిసిన ఈ ఇద్దరు ప్రేమపక్షులు అక్టోబర్ 1991లో వివాహం చేసుకున్నారు. అటుపై బాలీవుడ్‌కి ప్రథమ మహిళగా గౌరీఖాన్ గొప్ప గౌరవం అందుకున్నారు. హిస్టరీ - కళల్లో డిగ్రీని కలిగి ఉన్న గౌరీ ఖాన్ సముద్రానికి ఎదురుగా ఉన్న తన బంగ్లా 'మన్నత్'ను పునర్నిర్మిస్తున్నప్పుడు ఇంటీరియర్ డిజైనింగ్ తన నిజమైన ఆసక్తి అని కనుగొన్నారు.
ఆ తరువాత 2012లో తోటి స్టార్ వైఫ్ సుస్సానే ఖాన్ (హృతిక్ భార్య)తో కలిసి ఫర్నిచర్ లైన్ రంగంలో ప్రవేశించి అనతికాలంలోనే బిజినెస్ ఉమెన్ గా దూసుకుపోయింది. చివరికి తన స్వంత సూపర్ లేబుల్‌ను గౌరీ ప్రారంభించింది. గౌరీ-సుసానే ద్వయం వడోదరలో రెండు ప్రాజెక్ట్‌లకు పనిచేశారు. డిజైనింగ్ రంగంలో అభిరుచితో గౌరీ ఖాన్ ముందుకు సాగారు. గౌరవనీయమైన, లగ్జరీ ఇంటీరియర్ డిజైన్ అండ్ డెకర్ బ్రాండ్‌ను సృష్టించారు. నేడు ఆమె బ్రాండ్, గౌరీ ఖాన్ డిజైన్స్ (GKD), అంబానీలు, బచ్చన్‌లు, ఇతర బాలీవుడ్ ఎ-లిస్ట్ స్టార్లు, దర్శకనిర్మాతల్లో పాపులర్. కరణ్ జోహార్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, అలియా భట్, సిద్ధార్థ్ వంటి ప్రముఖుల ఇండ్లకు ఇంటీరియర్ డిజైనర్ గా గౌరీఖాన్ పేరు మార్మోగింది. సిద్ధార్థ్ మల్హోత్రా - రణబీర్ కపూర్ వంటి టాప్ హీరోలకు ఆమె ఇంటీరియర్ డిజైనర్.
2014లో గౌరీఖాన్ తన మొదటి కాన్సెప్ట్ స్టోర్ ది డిజైన్ సెల్‌ను ముంబైలోని వర్లీలో ప్రారంభించింది. ఇందులో ఇతర ప్రసిద్ధ భారతీయ ఇంటీరియర్ డిజైనర్లు రూపొందించిన విలాసవంతమైన ఫర్నిచర్ ని కూడా ప్రదర్శించారు. గౌరీ తన డిజైన్‌లు , కాన్సెప్ట్‌లను ప్రదర్శించడానికి పారిస్‌లోని ప్రతిష్టాత్మక మైసన్ ఎట్ ఆబ్జెట్ షోకు ఆహ్వానం అందుకున్నారు. ఆ తర్వాత ముంబైలోని జుహులో తన సొంత డిజైన్ స్టూడియోను ఏర్పాటు చేసింది. గృహ ఉపకరణాల కోసం, ఖాన్ రాబర్టో కావల్లి అండ రాల్ఫ్ లారెన్ వంటి ప్రముఖులతో కలిసి పనిచేసారు. ఇప్పటికే ఆమె సాధించిన విజయాలు అసాధారణం. ఇటీవల గౌరీ తన రియాలిటీ టీవీ షో డ్రీమ్ హోమ్స్ విత్ గౌరీ ఖాన్‌ను ప్రారంభించింది. ఇది లగ్జరీ డెకర్ ..విలువైన సెలబ్రిటీ హోమ్‌ల రూపకల్పన వెనుక ఉన్న ఆలోచన ప్రక్రియపై దృష్టి పెట్టే సిరీస్. షో ఆరు ఎపిసోడ్‌లలో గౌరీ సెలబ్రిటీల ఆకాంక్షలకనుగుణంగా ఇంటి డిజైన్లను ఎలా మారుస్తుందో వీక్షకులకు పరిచయం అవుతుంది. డ్రీమ్ హోమ్స్ విత్ గౌరీ ఖాన్ సెప్టెంబర్‌లో మిర్చి ప్లస్ యూట్యూబ్ ఛానెల్‌లో ప్రదర్శితమైంది.
స్టార్ వైఫ్ కత్రినా కైఫ్, మలైకా అరోరా, ఫరా ఖాన్, కబీర్ ఖాన్, మనీష్ మల్హోత్రా సహా అనేక మంది A-జాబితా ప్రముఖుల ఇళ్లను అలంకరించడం, రూపకల్పన చేయడం వంటి నైపుణ్యంతో గౌరీఖాన్ నిరంతరం స్టార్ వరల్డ్ లో రాణిలా మెరిసారు. ప్రముఖ ఇంటీరియర్ డెకరేటర్‌గానే కాకుండా గౌరీ ఖాన్ తన భర్త షారూఖ్ ఖాన్‌తో కలిసి రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ అనే ప్రొడక్షన్ హౌస్‌ను విజయవంతంగా రన్ చేస్తున్నారు. మేన్ హూనా, బద్లా, డాన్ 2, డియర్ జిందగీ, ఓం శాంతి ఓం మరియు దేవదాస్ బ్యానర్‌పై నిర్మించారు.
2021లో, ఏస్ డిజైనర్ మై లైఫ్ ఇన్ డిజైన్ పేరుతో డిజైనర్‌గా తన ప్రయాణం గురించి ఒక పుస్తకంతో రచయిత్రిగా అరంగేట్రం చేసారు. ఇది యువకులు, ఔత్సాహిక క్రియేటివ్‌లు తప్పనిసరిగా చదవాల్సి పుస్తకం. ఇన్ని సంవత్సరాల తర్వాత, బాలీవుడ్ ప్రథమ మహిళ .. బాస్-గర్ల్ గౌరీ ఖాన్ తన స్వంత సామ్రాజ్యాన్ని ఎలా సృష్టించుకున్నారు? అనేది ఆద్యంతం ఆసక్తిని కలిగిస్తుంది. ఆమె ముంబై ఆధారిత ఫ్లాగ్‌షిప్ డిజైన్ స్టూడియోను 2017లో ప్రారంభించడం ఒక పెద్ద మైలురాయి. సౌందర్యపరంగా ఆహ్లాదకరమైన అద్భుతమైన డిజైన్ లను అందించిన డిజైనర్ గా గౌరీ అత్యంత ఉన్నత-స్థాయి ప్రాజెక్ట్‌లకు పని చేస్తున్నారు.
కరణ్ జోహార్ పెంట్ హౌస్ టెర్రస్
సినీదిగ్గజం కరణ్ జోహార్ - గౌరీ ఖాన్ చాలాకాలంగా స్నేహితులు. ఒకరికొకరు అత్యంత సన్నిహితులు. KJo ఖరీదైన కార్టర్ రోడ్ పెంట్‌హౌస్‌కు పునర్నిర్మాణం అవసరమైనప్పుడు, ఏస్ డిజైనర్ , బెస్టీ గౌరీ ఖాన్ దానిని రూపొందించడానికి తన బాధ్యతను తీసుకున్నారు. 8,000 చ.అ. డ్యూప్లెక్స్‌లో ఇప్పుడు విశాలమైన రూఫ్‌టాప్ .. గౌరీ ఖాన్ రూపొందించిన శక్తివంతమైన పిల్లల నర్సరీ ఉన్నాయి. అద్భుతమైన రంగులతో, ఖాన్ తన టెర్రేస్‌లో కూర్చునే ప్రదేశానికి చెక్కను ఉపయోగించాడు. పాలరాయి పలకలను .. అందమైన మొక్కలను ఈ పెంట్ హౌస్ లో చేర్చి డిజైన్ చేసారు.
కొన్నేళ్లుగా గౌరీ ఖాన్ స్టోర్ ఫోటోషూట్లకు హాట్‌స్పాట్‌గా పనిచేసింది. సుస్సానే ఖాన్, వరుణ్ ధావన్ ,కరణ్ జోహార్‌లతో సహా స్టార్‌లు ఇక్కడకు షాపింగ్‌కు సాధారణంగా వస్తారు. సుస్సేన్ తన టెర్రేస్ కోసం కొన్ని అవుట్‌డోర్ లుక్ లను ఎంచుకోవడం ఆసక్తికరం.