గౌతమ్-సితార స్పెషల్ డే రోజున ఇలా!
ఇక సితార అప్పుడే ఎండార్స్ మెంట్స్ సైతం చేసే స్థాయికి వచ్చేసింది.
By: Tupaki Desk | 15 Nov 2024 12:33 PM GMTసూపర్ స్టార్ మహేష్-నమ్రత దంపతుల పిల్లలు చూస్తుండగానే పెద్దవాళ్లు అయిపోతున్నారు. ఇప్పటికే గౌతమ్ కి 18 ఏళ్లు నిండాయి. విదేశాల్లో చదువుకుంటున్నాడు. స్కూల్ నుంచి కాలేజీకి వెళ్లిపోయాడు. ప్రస్తుతం అమెరికాలో చదు వుతున్నాడు. ఇక సితార అప్పుడే ఎండార్స్ మెంట్స్ సైతం చేసే స్థాయికి వచ్చేసింది. ఇప్పటికే ఓ బంగారు అభర ణాల సంస్థను ఎండార్స్ చేస్తుంది. మామ్ లాగే ఎంతో స్టైలిష్ గానూ కనిపిస్తుంది.
అన్నింటిని మించి సినిమాలంటే పిచ్చి? అని చిన్న వయసులోనే ప్రూవ్ చేసింది. డాడ్ వేసిన స్టెప్పులు వేస్తుంది. సితారలో ఆ ఎనర్జీ రెండు-మూడేళ్ల వయసు నుంచే బయట పడింది. సితార నటిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ లో చదువుకుంటుంది. సితార సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. ఇంట్లో ఏ ఈవెంట్ జరిగినా?..తన విషయాలైనా మహేష్ అభిమానులకు తప్పక చెబుతుంటుంది.
తాజాగా చిల్డ్రన్స్ డేని పురస్కరించుకుని నమ్రత పిల్లలిద్దరి ఫోటో ఒకటి షేర్ చేసారు. అందులో గౌతమ్-సితార బెడ్ మీద కూర్చుని ఫోన్ చూస్తూ నవ్వుకుంటున్నారు. పిల్లలు ఎంత పెద్ద వారైన కన్నవాళ్లకు ఎప్పుడూ చిన్న పిల్లలే. పేరేంట్స్ విషయంలో అదో అద్భుతమైన మూవ్ మెంట్. ఆ క్షణాల్నే నమ్రత ఇలా షేర్ చేసుకున్నారు.
ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. మహేష్ అభిమానుల్ని ఆ పిక్ ఎంతగానో ఆకట్టుకుంటుంది. బ్రదర్ అండ్ సిస్టర్ బాండింగ్ ఎంతో అద్భుతం అంటూ అభిమానులు పోస్టులు పెడుతున్నారు. ఇక గౌతమ్ నటుడిగా ఎంట్రీ ఇస్తాడా? మరో రంగాన్ని ఎంచుకుంటాడా? అని తరుచూ అభిమానుల నుంచి ఈ ప్రశ్న ఎదురవుతూనే ఉంటుంది. అందుకు సమాధానం గౌతమ్ దగ్గరే ఉంటుంది. పిల్లల విషయంలో మహేష్-నమ్రత ఇద్దరు పూర్తి స్వేచ్ఛనిచ్చారు.