Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ 8 : అశ్వథ్ధామని కన్నీళ్లు పెట్టించారుగా..?

ఐతే ఈ వైల్డ్ కార్డ్ లో లాస్ట్ సీజన్ హౌస్ లో సందడి చేసిన గౌతం కృష్ణ కూడా ఉన్నాడు.

By:  Tupaki Desk   |   10 Oct 2024 8:20 AM GMT
బిగ్ బాస్ 8 : అశ్వథ్ధామని కన్నీళ్లు పెట్టించారుగా..?
X

బిగ్ బాస్ సీజన్ 8 లో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ గా పాత సీజన్ లో వారినే తీసుకున్నారు. సీజన్ 8 ని సంథింగ్ స్పెషల్ గా ఉండేలా చేయాలని వైల్డ్ కార్డ్ గా సీజన్ 1 నుంచి సీజన్ 7 వరకు వచ్చిన కంటెస్టెంట్స్ లో ఎనిమిది మందిని సెలెక్ట్ చేసి హౌస్ లోకి పంపించారు. ఆల్రెడీ సీజన్ 8 లో కొత్త కంటెస్టెంట్స్ ఐదు వారాలు ఉండగా పాత కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డ్ గా వచ్చి వారికి పోటీగా నిలబడనున్నారు. ఐతే ఈ వైల్డ్ కార్డ్ లో లాస్ట్ సీజన్ హౌస్ లో సందడి చేసిన గౌతం కృష్ణ కూడా ఉన్నాడు.

లాస్ట్ సీజన్ లో శివాజిపై ఎప్పుడు ఫైట్ కి సిద్ధం అన్నట్టుగా దూకుడుగా కనిపించిన గౌతం కృష్ణ ఆ సీజన్ లోనే సీక్రెట్ రూం లోకి వెళ్లి వచ్చాడు. ఐతే ఆ టైం లో అశ్వథ్ధామ 2.O అంటూ భారీ డైలాగులే కొట్టాడు. ఐతే అతను చెప్పిన మాటలే తప్ప అశ్వథ్ధామ చేసింది ఏమి లేదు. కానీ గౌతం కృష్ణకు అశ్వథ్ధామ 2.O అనే డైలాగ్ మాత్రం ట్రోల్ మెటీరియల్ అయ్యింది.

ఇక సీజన్ 8 లో అవినాష్, రోహిణిలకు ఒక టాస్క్ ఇవ్వగా అవినాష్ గౌతం ను ఉద్దేశించి అశ్వథ్ధామ 2.O అని నవ్వించే ప్రయత్నం చేశాడు. కానీ దానికి గౌతం చాలా హర్ట్ అయ్యాడు. నన్ను వెళ్లిపోమంటే వెళ్లిపోతా కానీ అలా ట్రిగర్ చేయకండని అన్నాడు. ఆ సీజన్ అయిపోయింది ఆ టైం లో తాను అన్న మాటల గురించి ఏడాదిగా సఫర్ అవుతూనే ఉన్నానని హౌస్ మెట్స్ తో చెప్పి బాధపడ్డాడు గౌతం. అవినాష్ కూడా గౌతం కి సారీ చెప్పి ఇక మీదట అలా అననని చెప్పాడు.

గౌతం కూడా ఈ విషయంలో కన్నీళ్లు పెట్టుకున్నాడు. లాస్ట్ సీజన్ లో చాలా స్ట్రాంగ్ గా అనిపించిన గౌతం ఇలా ఈ సీజన్ లో ఎమోషనల్ అవ్వడం ఆడియన్స్ కు షాక్ ఇచ్చింది. మరి అశ్వథ్ధామ అంటే ట్రిగర్ అవుతున్న గౌతం తన ఆట తీరుతో ప్రేక్షకులను ఎలా మెప్పిస్తాడన్నది చూడాలి. గౌతం ఆవేశానికి హౌస్ లో ఎవరు టార్గెట్ అవుతారన్నది ఆడియన్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 8 లో బీబీ హోటల్ టాస్క్ నడుస్తుంది. అందులో రాయల్ క్లాన్ సభ్యులు గెస్టులుగా ఓజీ క్లాన్ మెంబర్స్ హోటల్ స్టాఫ్ గా నటిస్తున్నారు.