గౌతమ్ మీనన్ కి ఆ స్టార్ హీరో ఛాన్స్!
డైరెక్టర్ గా గౌతమ్ మీనన్ కి సరైన సక్సస్ పడి చాలా కాలమవుతోన్న సంగతి తెలిసిందే. చివరికి డైరెక్ట్ చేసిన సినిమా కూడా రిలీజ్ చేయలేని పరిస్థితి ఏర్పడింది.
By: Tupaki Desk | 15 March 2025 12:31 PM ISTడైరెక్టర్ గా గౌతమ్ మీనన్ కి సరైన సక్సస్ పడి చాలా కాలమవుతోన్న సంగతి తెలిసిందే. చివరికి డైరెక్ట్ చేసిన సినిమా కూడా రిలీజ్ చేయలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో కొంత కాలంగా నటుడిగా కొనసా గుతున్నారు. డైరెక్షన్ పన్కన బెట్టి ఇతర స్టార్ హీరోల చిత్రాల్లో కీలక పాత్రలు పోషిస్తున్నారు. అయితే మలయాళం, తమిళ్ లో మాత్రం సినిమాలు చేస్తున్నా? అవి పెద్దగా వెలుగులోకి రావడం లేదు.
ఈ నేపథ్యంలో గౌతమ్ మీనన్ స్టార్ హీరో కార్తీ లిప్ట్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఇటీవలే కార్తీకి గౌతమ్ మీనన్ స్టోరీ వినిపించినట్లు సమాచారం. నచ్చడంతో ఆయన కూడా ఒకే చేసాడుట. అయితే ఇది గౌతమ్ మీనన్ సొంత కథ కాదు. జయమోహన్ ఈ చిత్రానికి స్టోరీ, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. మరి ఈ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందన్నది చూడాలి. కానీ గౌతమ్ కిది మంచి కంబ్యాక్ అయ్యే అవకాశమే.
దర్శకుడిగా ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన గౌతమ్ లవ్ స్టోరీలకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. మళ్లీ మునుపటిలో క్రేజీ డైరెక్టర్ గా మారాలంటే సక్సెస్ ఒక్కటే మార్గం. మరి కార్తీ ఇచ్చిన అవకాశాన్ని ఎంత వరకూ సద్వినియోగం చేసుకుంటాడో చూడాలి. అయితే ఈ సినిమా ఎప్పుడు ప్రారంభమ వుతుందన్నది తెలియాలి. ప్రస్తుతానికి కార్తీ చేతిలో చాలా ప్రాజెక్ట్ లున్నాయి. ప్రస్తుతం `సర్దార్ 2` లో నటిస్తున్నాడు.
ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. త్వరలోనే `ఖైదీ -2` చిత్రీకరణ మొదల వుతుంది. అలాగే సముద్ర దొంగల కథతో ఓ పీరియాడిక్ సినిమాకి కూడా కమిట్ అయ్యాడు. దీనికి తమిళ దర్శకుడే పని చేస్తున్నాడు. మరోవైపు `కర్ణన్` ఫేం మారిసెల్వరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయాలి. ఈ సినిమా స్టోరీ డిస్కషన్స్ ఇప్పటికే పూర్తయ్యాయి. మరి ఇంత హెక్టిక్ షెడ్యూల్ నడుమ గౌతమ్ మీనన్ కి డేట్లు ఎలా కేటాయిస్తాడో చూడాలి.