Begin typing your search above and press return to search.

విజయ్ 69.. రంగంలోకి కోలీవుడ్ స్టార్ డైరెక్టర్

బాజూకాతో పాటు పలు సినిమాల్లో నటిస్తున్న గౌతమ్ మేనన్.. ఇప్పుడు మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

By:  Tupaki Desk   |   3 Oct 2024 11:47 AM GMT
విజయ్ 69.. రంగంలోకి కోలీవుడ్ స్టార్ డైరెక్టర్
X

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ గౌతమ్ మేనన్.. క్లాసిక్‌, విభిన్నమైన ప్రేమకథా చిత్రాలు తెరకెక్కించడంలో దిట్ట అని అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఓ వైపు సినిమాలు తెరకెక్కిస్తూనే.. మరోవైపు మూవీల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం మాలీవుడ్ సూపర్ స్టార్ మమ్ముట్టితో బాజూకా మూవీ తీస్తున్నారు. కెరీర్ లో తొలిసారిగా మాలీవుడ్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అందులో గౌతమ్ మీనన్ కూడా కీలకపాత్ర పోషిస్తుండడం విశేషం. ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేసిన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.


బాజూకాతో పాటు పలు సినిమాల్లో నటిస్తున్న గౌతమ్ మేనన్.. ఇప్పుడు మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ మూవీలో భాగమయ్యారు. ఇప్పటికే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విజయ్.. 69వ ప్రాజెక్టే తన చివరి మూవీ అని ఇన్ డైరెక్ట్ గా తెలిపారు. దీంతో ప్రాజెక్ట్ షూటింగ్ స్టార్ట్ కాకుండానే భారీ అంచనాలు నెలకొన్నాయి. అదే సమయంలో మేకర్స్.. వినూత్నంగా క్యాస్టింగ్ ను అనౌన్స్ చేస్తున్నారు. మూడు రోజుల పాటు ఒక్కో యాక్టర్ ను రివీల్ చేస్తున్నారు.


ముందుగా సినిమాలో విజయ్ దళపతికి జోడీగా పొడుగు కాళ్ళ సుందరి పూజా హెగ్డే నటిస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే విజయ్, పూజ బీస్ట్ సినిమాకు గాను స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఆ తర్వాత బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ విలన్ గా యాక్ట్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. అనంతరం క్రేజీ బ్యూటీ మమితా బైజు సినిమాలో భాగమైనట్లు వెల్లడించారు. ఇప్పుడు దర్శకుడు కమ్ నటుడు గౌతమ్ వాసుదేవ్ మేనన్ ను రంగంలోకి దింపుతున్నట్లు గురువారం మధ్యాహ్నం వెల్లడించారు.

ఇప్పటికే నటుడిగా సీతారామం, లియో, కనులు కనులను దోచాయంటే వంటి పలు సినిమాల్లో యాక్ట్ చేసిన ఆయన.. ఇప్పుడు విజయ్ 69లో ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. అయితే GVM.. విజయ్ 69లో నటిస్తున్నట్లు ఇప్పటి వరకు పూర్తిగా ఎలాంటి టాక్ రాలేదు. సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ నటించనున్నారని చాలా మంది గెస్ చేశారు. కానీ ఇప్పుడు గౌతమ్ మీనన్ యాక్ట్ చేస్తున్నట్లు కన్ఫర్మ్ చేశారు మేకర్స్. ఆ తర్వాత సీనియర్ హీరోయిన్ ప్రియమణి కూడా నటిస్తున్నట్లు వెల్లడించారు.

హెచ్ వినోథ్ దర్శకత్వం వహిస్తున్న విజయ్ 69 మూవీని కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మించనుంది. మరికొద్ది రోజుల్లో షూటింగ్ ప్రారంభం కానుంది. వచ్చే ఏడాది మూవీ రిలీజ్ కానుంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లను అప్పుడే స్టార్ట్ చేసింది. మూవీ అనౌన్స్మెంట్ టైమ్ లో మేకర్స్ క్రేజీ పోస్టర్ ను షేర్ చేశారు. టార్చ్ బేరర్ పట్టుకున్న చేయిని చూపించి సినిమాపై బజ్ క్రియేట్ చేశారు. మరి విజయ్ 69.. మూవీ ఎలాంటి విజయం అందుకుంటుందో వేచి చూడాలి.