Begin typing your search above and press return to search.

అన్న‌య్య‌కు రాఖీ.. సితార ఘ‌ట్ట‌మ‌నేని సో క్యూట్

ఈరోజు రాఖీ ఫ‌ర్వ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని అన్నాచెల్లెళ్ల అనుబంధానికి సంబంధించిన ఒక అరుదైన అంద‌మైన ఫోటోగ్రాఫ్ ని క్లిక్ చేసిన న‌మ్ర‌త దానిని సోష‌ల్ మీడియాలో షేర్ చేసారు.

By:  Tupaki Desk   |   19 Aug 2024 2:37 PM GMT
అన్న‌య్య‌కు రాఖీ.. సితార ఘ‌ట్ట‌మ‌నేని సో క్యూట్
X

నమ్రతా శిరోద్కర్ తన కుటుంబ జీవితంలోని ప్ర‌తి అంద‌మైన క్ష‌ణాన్ని సోష‌ల్ మీడియాల్లో డాక్యుమెంట్ చేసే తీరు అంద‌రికీ ప్రేర‌ణ‌గా నిలుస్తుంది. ముఖ్యంగా త‌మ పిల్ల‌లు గౌత‌మ్ కృష్ణ‌- సితారల‌కు సంబంధించిన మ‌ధుర క్ష‌ణాల‌ను కెమెరాల్లో బంధించ‌డాన్ని అస్స‌లు మిస్ కాదు.

ఈరోజు రాఖీ ఫ‌ర్వ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని అన్నాచెల్లెళ్ల అనుబంధానికి సంబంధించిన ఒక అరుదైన అంద‌మైన ఫోటోగ్రాఫ్ ని క్లిక్ చేసిన న‌మ్ర‌త దానిని సోష‌ల్ మీడియాలో షేర్ చేసారు. ఈ ఫోటోగ్రాఫ్ లో త‌న సోద‌రుడు గౌత‌మ్ కృష్ణ‌కు రాఖీ క‌డుతోంది సితార ఘ‌ట్ట‌మ‌నేని. ఈ సంద‌ర్భంగా త‌న సోద‌రుడి నుదిటిన బొట్టు పెడుతున్న స్పెష‌ల్ మూవ్ మెంట్ ని కెమెరాలో క్యాప్చుర్ చేసారు న‌మ్ర‌త‌. సితార ట్రెడిష‌న‌ల్ దుస్తుల్లో క్యూట్ గా క‌నిపించ‌గా, గౌత‌మ్ కృష్ణ క్యాజువ‌ల్ లుక్ లో క‌నిపించాడు. సెల‌బ్రిటీ కిడ్స్ సింప్లిసిటీ ట్రెడిష‌న్ ఆక‌ట్టుకుంది.

ఇలాంటి ప్రత్యేక సంద‌ర్భాల‌ను అందంగా ఫ్లాష్ లు మెరిపిస్తారు న‌మ్ర‌త‌. కొద్ది రోజుల క్రితం త‌న‌ భర్త, సూపర్ స్టార్ మహేష్ బాబు తన 49వ పుట్టినరోజును జరుపుకున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మ‌హేష్ పై త‌న ప్రేమానురాగాల‌ను ప్ర‌ద‌ర్శిస్తూ.. మ‌హేష్ స్పెష‌ల్ లుక్ ని న‌మ్ర‌త షేర్ చేసారు.

ఇటీవ‌లే బాబీ ఘట్టమనేని (మహేష్ బాబు కజిన్) భార్య అయిన తన కోడలు ప్రియాంక ఘట్టమనేని సీమంతం వేడుక నుండి కొన్ని ఫోటోల‌ను న‌మ్ర‌త షేర్ చేసారు. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు అంత‌ర్జాలంలో వైర‌ల్ అవుతున్నాయి. ఘ‌ట్ట‌మ‌నేని కుటుంబ ఈవెంట్ల‌లో మ‌హష్ సోద‌రీమ‌ణుల‌తో న‌మ్ర‌త స్నేహానుబంధం ఎంతో గొప్ప‌గా ఎలివేట్ అవుతోంది.