Begin typing your search above and press return to search.

గౌత‌మ్ మొద‌టి స్టేజ్ ప్ర‌ద‌ర్శ‌న‌లో మ‌హేష్ & ఫ్యామిలీ

నిన్న లండన్‌లోని యునికార్న్ థియేటర్‌లో జరిగిన గౌతమ్ నాటకం 'రోమియో అండ్ జూలియట్' ప్ర‌ద‌ర్శ‌న‌ను చూసాక‌ తమ అనుభవాన్ని హైలైట్ చేస్తూ మహేష్ భార్య నమ్రత

By:  Tupaki Desk   |   23 Jun 2024 5:51 AM GMT
గౌత‌మ్ మొద‌టి స్టేజ్ ప్ర‌ద‌ర్శ‌న‌లో మ‌హేష్ & ఫ్యామిలీ
X

సూపర్ స్టార్ మహేష్ బాబు వార‌సురాలు సితార‌ డ్యాన్సులు ఇప్ప‌టికే సోష‌ల్ మీడియాల్లో అభిమానుల‌ను అల‌రిస్తున్నాయి. సితార యూట్యూబ్ చానెల్ ద్వారా అభిమానుల్లోకి దూసుకెళ్లింది. ఇప్పుడు వార‌సుడు గౌత‌మ్ ఘ‌ట్ట‌మనేని న‌ట‌ప్ర‌ద‌ర్శ‌న ఆస‌క్తిని క‌లిగిస్తోంది. లండన్‌లో తన కుమారుడు గౌతమ్ ఘట్టమనేని నటించిన మొద‌టి నాటకానికి మ‌హేష్ బాబు కుటుంబం హాజ‌రైంది. నిన్న లండన్‌లోని యునికార్న్ థియేటర్‌లో జరిగిన గౌతమ్ నాటకం 'రోమియో అండ్ జూలియట్' ప్ర‌ద‌ర్శ‌న‌ను చూసాక‌ తమ అనుభవాన్ని హైలైట్ చేస్తూ మహేష్ భార్య నమ్రత ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ అరుదైన, సంతోషకరమైన క్షణాల‌కు సంబంధించిన ఫోటోల‌ను గర్వంగా షేర్ చేసారు. నమ్రత, మహేష్ స‌హా సితార ఘ‌ట్ట‌మ‌నేని, సితార స్నేహితురాలు పైడిప‌ల్లి కుమార్తె ఆద్య కూడా ఈ స్టేజీ డ్రామాను వీక్షించిన వారిలో ఉన్నారు. లండ‌న్ లో అన్నా చెల్లెళ్లు సితార‌-గౌత‌మ్ షికార్ కి సంబంధించిన ఫోటో, అలాగే ఘ‌ట్ట‌మ‌నేని కుటుంబం త‌మ‌ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో క‌లిసి దిగిన అరుదైన ఫోటోల‌ను న‌మ్ర‌త ఇన్ స్టాలో షేర్ చేసారు.

నమ్రత ఈవెంట్ నుండి అందమైన ఫోటోలను పోస్ట్ చేసారు. గౌత‌మ్ మొద‌టి స్టేజీ ప్ర‌ద‌ర్శ‌న‌పై త‌మ ఆనందాన్న వ్య‌క్తం చేసారు. ఇది ప్రత్యేకమైన సాయంత్రం.. గౌతం ఘట్టమనేని విష‌యంలో చాలా గర్వంగా ఉంది. లండన్‌లో అతడి మొదటి థియేటర్ స్టేజ్ ప్రదర్శన... అది ఎంతటి అద్భుత‌ ప్రదర్శన.. ప్రేమిస్తున్నాం.. నా స‌న్.. నిన్ను ఎక్కువగా ప్రేమించాను. పిల్లలంతా తమ అంతరంగాన్ని అన్వేషించడానికి 'జాయ్ ఆఫ్ డ్రామా'తో ఈ చిన్న వేసవి కార్యక్రమానికి హాజరు కావాలి!! ప్రత్యేక స్నేహితులు, కుటుంబ సభ్యులతో అద్భుతమైన సాయంత్రం... సంతోషంగా కృతజ్ఞతతో''అని న‌మ్ర‌త‌ రాసారు. ఈ ఫోటోలు క్షణాల్లో వైరల్ అయ్యాయి. ఘట్టమనేని కుటుంబం త్వరలో భారతదేశానికి తిరిగి రానుంది.

త‌దుప‌రి సూప‌ర్ స్టార్ మ‌హేష్ ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్.ఎస్.రాజ‌మౌళితో భారీ పాన్ ఇండియా చిత్రానికి స‌న్నాహకాల్లో ఉన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే స్క్రిప్టు రెడీ అయింది. త‌దుప‌రి భారీ షెడ్యూళ్ల కోసం రాజ‌మౌళి ఆర్.ఎఫ్‌.సిలో సెట్ల నిర్మాణాన్ని ప‌ర్య‌వేక్షిస్తున్నార‌ని క‌థ‌నాలొచ్చాయి. అలాగే మ‌హేష్ పై టెస్ట్ ఫోటోషూట్లు చేస్తున్నార‌ని కూడా గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.