Begin typing your search above and press return to search.

వీడియో : 3వ తరం సూపర్‌ స్టార్‌ కమింగ్‌ సూన్‌

సూపర్‌ స్టార్‌ కృష్ణ వారసుడిగా మహేష్ బాబు టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చి తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు.

By:  Tupaki Desk   |   14 Jun 2024 6:15 AM GMT
వీడియో : 3వ తరం సూపర్‌ స్టార్‌ కమింగ్‌ సూన్‌
X

సూపర్‌ స్టార్‌ కృష్ణ వారసుడిగా మహేష్ బాబు టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చి తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. మహేష్ బాబు గత రెండు దశాబ్దాలుగా టాలీవుడ్‌ ను రారాజుగా ఏలేస్తున్న విషయం తెల్సిందే. దాదాపు అయిదు దశాబ్దాలుగా టాలీవుడ్‌ లో సూపర్‌ స్టార్‌ ఫ్యామిలీ సత్తా చాటుతున్నారు.

ఇప్పుడు సూపర్ స్టార్‌ ఫ్యామిలీ నుంచి మూడో తరం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మహేష్ బాబు తనయుడు గౌతమ్‌ కృష్ణ త్వరలోనే టాలీవుడ్‌ లో అడుగు పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజాగా మహేష్ బాబు భార్య, గౌతమ్ తల్లి అయిన నమ్రతా శిరోద్కర్ షేర్ చేసిన వీడియో ఫ్యాన్స్ కి కన్నుల పండుగగా నిలిచింది.

మహేష్‌ బాబు సొంత జిమ్‌ లో గౌతమ్‌ వర్కౌట్లు చేస్తున్నాడు. ప్రత్యేక ట్రైనర్ సమక్షంలో గౌతమ్‌ చేస్తున్న వర్కౌట్లకు సంబంధించిన వీడియోను నమ్రత షేర్ చేయడంతో ఆ వీడియో వైరల్‌ అవుతోంది. గౌతమ్‌ అతి త్వరలోనే కెమెరా ముందుకు రావడం ఖాయం అన్నట్లుగా కూడా ప్రచారం మొదలయ్యింది.

ప్రస్తుతం గౌతమ్ వయసు 17 ఏళ్లు. కనుక ఆయన మరో మూడు నాలుగే ఏళ్ల వరకు మరింత ఫిట్ గా తయారు అయ్యి హీరోగా ఫుల్‌ స్వింగ్ తో ప్రేక్షకుల ముందుకు రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. రావడం రావడంతోనే ఒక సునామీ అన్నట్లుగా రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి సినిమా కోసం రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం స్క్రిప్ట్‌ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్‌ ను ఈ ఏడాదిలోనే చివర్లో ప్రారంభించే విధంగా రాజమౌళి ప్లాన్‌ చేస్తున్నాడు. అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఈ సినిమాలో గౌతమ్‌ ను చిన్న పాత్రలో అయినా చూపించాలని మహేష్ బాబు ఫ్యాన్స్‌ కోరుకుంటున్నారు.