Begin typing your search above and press return to search.

గౌతం మీనన్ ఫ్యాన్స్ కి సూపర్ అప్డేట్..!

లవ్ స్టోరీ సినిమాల్లో తన మార్క్ చూపించిన గౌతం మీనన్ డైరెక్టర్ గా సినిమాలకు గ్యాప్ ఇవ్వడం ఆయన ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చింది.

By:  Tupaki Desk   |   24 Oct 2023 11:30 PM GMT
గౌతం మీనన్ ఫ్యాన్స్ కి సూపర్ అప్డేట్..!
X

కోలీవుడ్ డైరెక్టర్ గౌతం మీనన్ సినిమాలు అంటే ఆడియన్స్ లో సెపరేట్ క్రేజ్ ఉంది. తమిళ ఆడియన్స్ మాత్రమే కాదు తెలుగు ఆడియన్స్ లో కూడా గౌతం మీనన్ సినిమాలు అంటే విపరీతమైన బజ్ ఉంటుంది. తెలుగులో స్టార్స్ తో సినిమాలు చేయకపోయినా సరే గౌతం మీనన్ అంటే తెలుగు ఆడియన్స్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. తెలుగులో ఘర్షణ, ఏమాయ చేసావే సినిమాతో దర్శకుడిగా తెలుగు ఆడియన్స్ మనసులు గెలిచిన గౌతం మీనన్ అతను చేసిన కోలీవుడ్ సినిమాలతో కూడా తెలుగు ఆడియన్స్ ని అలరించాడు.

కొద్దికాలంగా డైరెక్షన్ విషయంలో ఆసక్తిగా లేని గౌతం మీనన్ నటుడిగా కొత్త కెరీర్ మొదలు పెట్టాడు. తమిళ, తెలుగు సినిమాల్లో గౌతం మీనన్ నటుడిగా వరుస అవకాశాలు అందుకుంటున్నాడు. అయితే కొద్దిపాటి గ్యాప్ తర్వాత గౌతం మీనన్ మెగా ఫోన్ పట్టుకుంటున్నాడని తెలుస్తుంది. అది కూడా తెలుగు, తమిళ బైలింగ్వెల్ సినిమాకు ఆయన ఓకే చెప్పినట్టు తెలుస్తుంది.

తెలుగు నిర్మాత విష్ణు ఇందూరి నిర్మాణంలో గౌతం మీనన్ సినిమా ఉంటుందని తెలుస్తుంది. ఈ సినిమాను లవ్ స్టోరీగా తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారట. సినిమాలో నటీనటులు ఎవరు.. మిగతా కాస్ట్ అండ్ క్రూ ఎవరన్నది తెలియాల్సి ఉంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ వస్తుందని తెలుస్తుంది.

గౌతం మీనన్ స్టైల్ ఆఫ్ టేకింగ్ సినిమాలకు సౌత్ లో సూపర్ ఫ్యాన్స్ ఉన్నారు. ముఖ్యంగా లవ్ స్టోరీ సినిమాలు చేయాలంటే ఆయనే చేయాలి అన్నట్టుగా క్రేజ్ తెచ్చుకున్నారు. డైరెక్షన్ పరంగా గ్యాప్ వచ్చినా సరే నెక్స్ట్ చేయబోయే సినిమాతో తన సత్తా చాటాలని చూస్తున్నారు గౌతం మీనన్. గౌతం మీనన్ తమిళంలో సినిమాలు చేసినా అవి తెలుగులో రీమేక్ అయ్యి మంచి సక్సెస్ అందుకున్నాయి.

లవ్ స్టోరీ సినిమాల్లో తన మార్క్ చూపించిన గౌతం మీనన్ డైరెక్టర్ గా సినిమాలకు గ్యాప్ ఇవ్వడం ఆయన ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చింది. ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ గౌతం లవ్ స్టోరీ సినిమా చేయడం అది కూడా తెలుగు నిర్మాతతో కలిసి చేయడం తెలుగు ఆడియన్స్ కి కూడా మంచి ఫీస్ట్ అందిస్తుంది. గౌతం మీనన్ చేయబోయే ఈ సినిమాలో కాస్టింగ్ ఎవరు.. ఈ సినిమా ఎలాంటి కథతో రాబోతుంది అన్నది త్వరలో తెలుస్తుంది.