Begin typing your search above and press return to search.

గౌతమ్ వాసుదేవ్ మీనన్.. కష్టకాలంలో ఓ మెగా ఆఫర్!

గౌతమ్ వాసుదేవ్ మీనన్ కు డైరెక్టర్ గా తమిళంలో పాటు తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉంది.

By:  Tupaki Desk   |   14 May 2024 2:30 PM GMT
గౌతమ్ వాసుదేవ్ మీనన్.. కష్టకాలంలో ఓ మెగా ఆఫర్!
X

గౌతమ్ వాసుదేవ్ మీనన్ కు డైరెక్టర్ గా తమిళంలో పాటు తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉంది. అతని ఫ్లాప్ సినిమాలో అయినా కూడా అందులో మంచి కంటెంట్ ఉంటుంది అనేలా గుర్తింపు అయితే అందుకున్నాడు. కానీ ఆయన చేసిన కొన్ని పొరపాట్ల వలన ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. గౌతమ్ వాసుదేవ్ రెండు మూడు సినిమాలతోనే తెలుగు వారికి కూడా చాలా దగ్గరయ్యాడు.

ముఖ్యంగా ఏ మాయ చేసావే, ఘర్షణ, సూర్య సన్నాఫ్ కృష్ణన్ లాంటి సినిమాలు తెలుగు వారికి చాలా దగ్గర చేశాయి. అందుకే ఆయనకు ఇప్పుడు తెలుగు సినిమాల్లో కూడా నటుడిగా మంచి అవకాశాలు వస్తున్నాయి. కష్టకాలంలో ఉండగా ఇపుడు గౌతమ్ వాసుదేవన్ కు ఒక మంచి ఆఫర్ వచ్చినట్లుగా తెలుస్తోంది. బడా హీరోనే నిర్మాతగా ఆయనతో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

గౌతమ్ వాసుదేవ్ గత పదేళ్ల ముందు వరకు కూడా మంచి ఫామ్ లోనే ఉన్నాడు. నిర్మాతల నుంచి మంచి పారితోషకం అందుకుంటూ కొనసాగుతున్న ఆయన కెరీర్ ఏమాత్రం ఇబ్బందులు లేకుండా సాగింది. అయితే గౌతమ్ ఎప్పుడైతే నిర్మాతగా మారాలని అనుకున్నారో అప్పటినుంచి ఇబ్బందులు మొదలయ్యాయి. ముంబై బడా సంస్థల నుంచి అధిక వడ్డీలకు డబ్బులు తీసుకుని కొన్ని సినిమాలు సొంతంగా నిర్మించరు.

తక్కువ బడ్జెట్ లోనే కొన్ని సినిమాలు తీయాలని అనుకున్నప్పటికీ ఊహించిన విధంగా ఆ బడ్జెట్ పరిదులు పెరిగిపోయాయి. దీంతో బ్యాక్ టు బ్యాక్ ఆయన తీసిన సినిమాలు దారుణంగా డిజాస్టర్ అయ్యాయి. ఇక దాదాపు ఆయన 50 కోట్లకు పైగానే అప్పులపాలైనట్లుగా ఆ మధ్య టాక్ వచ్చింది.

ఇక ఆఖరికి విక్రమ్ తో ఆయన తీసిన ధ్రువ నక్షత్రం సినిమా కూడా విడుదలకు నోచుకోవడం లేదు. అయితే ఈ కష్టకాలంలో ఆయనకు మలయాళం సూపర్ స్టార్ మమ్మూట్టి ఒక ఆఫర్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. హీరో సొంత ప్రొడక్షన్ లోనే సినిమాను నిర్మించడానికి కూడా ఒప్పుకున్నారట. అసలైతే వీరి కాంబినేషన్లో సినిమా రాబోతోంది అని గత ఏడాది నుంచి కథనాలు వస్తున్నాయి.

ఇక మొత్తానికి ఫైనల్ స్క్రిప్ట్ సిద్ధం చేసిన గౌతమ్ హీరోకు చెప్పడంతో ఆయన వెంటనే ఓకే చేసినట్లుగా తెలుస్తోంది. ఇక ఆ సినిమాను కూడా సొంతంగా నిర్మించడానికి ఒప్పుకున్నారట. గౌతమ్ వాసుదేవ్ కు మంచి అడ్వాన్స్ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమాతో అయినా దర్శకుడిగా గౌతమ్ బౌన్స్ బ్యాక్ అవుతారో లేదో చూడాలి.