Begin typing your search above and press return to search.

చందుతో గీతా ఆర్ట్స్ పెద్ద సబ్జెక్ట్..!

తండేల్ సినిమాను డైరెక్ట్ చేసిన చందు మొండేటితో గీతా ఆర్ట్స్ నెక్స్ట్ పెద్ద సబ్జెక్ట్ ప్లాన్ చేస్తుందని అది ఇంకా డిస్కషన్స్ లో ఉందని అన్నారు గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్

By:  Tupaki Desk   |   6 Feb 2025 5:04 PM GMT
చందుతో గీతా ఆర్ట్స్ పెద్ద సబ్జెక్ట్..!
X

తండేల్ సినిమాను డైరెక్ట్ చేసిన చందు మొండేటితో గీతా ఆర్ట్స్ నెక్స్ట్ పెద్ద సబ్జెక్ట్ ప్లాన్ చేస్తుందని అది ఇంకా డిస్కషన్స్ లో ఉందని అన్నారు గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్. శుక్రవారం అనగా రేపు తండేల్ సినిమా రిలీజ్ ఉందనగా ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు మేకర్స్. ఈ క్రమంలో మీడియా అడిగిన ఇంట్రెస్టింగ్ ప్రశ్నలకు చిత్ర యూనిట్ సమాధానం ఇచ్చారు.

ముందు కథ అనుకున్నప్పుడు డాక్యుమెంటరీలా అనిపించింది. ఐతే కథకుడు దర్శకుడు ఒకే అయితే బాగుంటుందని చందు మొండేటికి అప్పచెప్పాం. ఆయన ఈ సినిమాను చాలా అద్భుతంగా తెరకెక్కించారని అన్నారు అల్లు అరవింద్. సినిమా మీద ఎంతో నమ్మకం ఉంది కాబట్టి ఓన్ రిలీజ్ చేస్తున్నామని మనం తీసిన సినిమా మనం నమ్మకపోతే ఎలా అంటూ గీతా ఆర్ట్స్ పాలసీలోనే అది ఉందని అన్నారు అల్లు అరవింద్.

ఇక ఏపీలో ఈ సినిమాకు టికెట్ రేట్లు కేవలం 50 రూపాయలే పెంచారని. తెలంగాణాలో పెంచమని అడగలేదని అన్నారు అల్లు అరవింద్. ఇక బెనిఫిట్ షోస్ లేవని అంత బెనిఫిట్ తమకు వద్దని అన్నారు అల్లు అరవింద్. తండేల్ నాగ చైతన్య కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అని అన్నారు అల్లు అరవింద్. చందు మొండేటి చాలా నెమ్మదస్తుడు.. రెమ్యునరేషన్ కోసం పనిచేసే దర్శకుడు కాదని అన్నారు అల్లు అరవింద్.

గీతా ఆర్ట్స్ బ్యానర్ ఈమధ్య గ్యాప్ కి కారణాలు చెబుతూ తమకు నచ్చిన కథలు, కాంబినేషన్స్ కుదరట్లేదని అన్నారు. ఇక నుంచి గీతా ఆర్ట్స్ నుంచి పెద్ద సినిమాలు వస్తాయని అన్నారు. అల్లు అర్జున్ ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రాకపోవడానికి రీజన్స్ అడిగితే.. ఇది తండేల్ కి సంబంధించిన ప్రెస్ మీట్ అని అలాంటివి వద్దని అన్నారు అల్లు అరవింద్. రిలీజ్ ముందు మేమంతా ఇలా కాన్ఫిడేంట్ గా ఉండటానికి కారణం సినిమా అవుట్ పుట్ అని అన్నారు అల్లు అరవింద్.

నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన తండేల్ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్ లో బన్నీ వాసు నిర్మించారు. దేవి శ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ తో ఈ సినిమాకు నెక్స్ట్ లెవెల్ క్రేజ్ ఏర్పడింది. మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాపై అక్కినేని ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు.