Begin typing your search above and press return to search.

గీతా ఆర్ట్స్ లో థమన్.. వ్వాటే బీట్స్

ప్రస్తుతం సౌత్ లో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకున్న సంగీత దర్శకుడు ఎస్ ఎస్ థమన్.

By:  Tupaki Desk   |   17 Nov 2024 5:10 AM GMT
గీతా ఆర్ట్స్ లో థమన్.. వ్వాటే బీట్స్
X

ప్రస్తుతం సౌత్ లో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకున్న సంగీత దర్శకుడు ఎస్ ఎస్ థమన్. సంగీత దర్శకుడిగా థమన్ 2009లో ‘మళ్ళీ పెళ్లి’ సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. అంతకు ముందు మణిశర్మ టీమ్ లో వర్క్ చేస్తూ ఉండేవాడు. ‘మళ్ళీ పెళ్లి’ సినిమాతో ప్రేక్షకులకి చేరువ కాలేకపోయిన అదే ఏడాది రవితేజ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘కిక్’ సినిమా థమన్ కి బ్రేక్ ఇచ్చింది.

దీని తర్వాత థమన్ తమిళంలో ఎక్కువ సినిమాలు చేస్తూ వచ్చాడు. తెలుగులో కూడా ఒక్కో అవకాశం అందుకొని తనని తాను ప్రూవ్ చేసుకోవడం మొదలెట్టాడు. ‘దూకుడు’ సినిమా తర్వాత థమన్ కి తెలుగులో అవకాశాలు పెరిగాయి. స్టార్ హీరోలకి ఫస్ట్ ఛాయస్ గా మారిపోయాడు. అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా ఏడాదికి 6-10 సినిమాలు చేస్తూ వస్తున్నాడు. మ్యూజిక్ డైరెక్టర్ గా థమన్ 15 ఏళ్ళు పూర్తి చేసుకున్నాడు. ఇన్నేళ్ల కెరియర్ లో ఎన్నో సక్సెస్ ఫుల్ సినిమాలలో థమన్ భాగం అయ్యాడు.

అలాగే ఎన్నో హిట్ సాంగ్స్ కి ప్రేక్షకులకి అందించాడు. తన మీద వచ్చే విమర్శలకి కూడా థమన్ మ్యూజిక్ తోనే సమాధానం చెబుతాడు. ఇదిలా ఉంటే ఆయన పుట్టిన రోజు సందర్భంగా గీతా ఆర్ట్స్ ఇన్ స్టాగ్రామ్ లో బర్త్ డే విషెస్ తెలియజేసింది. ఇందులో ‘అల వైకుంఠపురంలో’ బుట్టబొమ్మ సాంగ్ తో పాటు ఆ ప్రొడక్షన్ లో థమన్ కంపోజ్ చేసిన సాంగ్స్ బిట్స్ ని షేర్ చేశారు. వాటిలో అల వైకుంఠపురంలో సామజవరగమన, రాములో రాముల సాంగ్స్ కూడా ఉన్నాయి. అలాగే ప్రతి రోజు పండగే సినిమాలో ఓ బావ మా అక్కని సక్కగా చూస్తావా తోపాటు మరో సాంగ్ ని జత చేశారు.

అలాగే గని సినిమాలోని రోమియో జోలియట్ లా సాంగ్ కి కూడా పోస్ట్ చేసి బర్త్ డే గ్రీటింగ్ తెలియజేశారు. అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలోని సాంగ్స్ అన్ని సూపర్ హిట్ అయ్యాయి. ఓ విధంగా చెప్పాలంటే థమన్ కెరియర్ లోనే బెస్ట్ సాంగ్స్ ‘అల వైకుంఠపురంలో’ సినిమాకి ఇచ్చారని చెప్పొచ్చు. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో తెరకెక్కిన ఈ సినిమా ‘పుష్ప’ కంటే ముందు అల్లు అర్జున్ కెరియర్ లోనే హైయెస్ట్ కలెక్షన్స్ చిత్రంగా నిలిచింది. అలాగే గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ‘శుభమస్తు’, ‘ప్రతి రోజు పండగే’ సినిమాలకి థమన్ మ్యూజిక్ అందించారు.

ఇదిలా ఉంటే ‘అల వైకుంఠపురంలో’ లాంటి బిగ్గెస్ట్ మ్యూజికల్ అండ్ సెన్సేషనల్ హిట్ ఇచ్చినందుకు గాను ఆ మూవీ సాంగ్ తోనే థమన్ కి బర్త్ డే విషెస్ తెలియజేశారు. ఇక థమన్ నుంచి ఈ ఏడాది 4 సినిమాలు థియేటర్స్ లోకి వచ్చాయి. ప్రస్తుతం అతని లైన్ అప్ లో 11 సినిమాలు ఉన్నాయి. వీటిలో చాలా వరకు పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కాబోతున్న చిత్రాలే కావడం విశేషం. అల వైకుంఠపురంలో చిత్రం తర్వాత మరోసారి అల్లు అర్జున్ తో ‘పుష్ప 2’ బ్యాగ్రౌండ్ స్కోర్ కోసం థమన్ వర్క్ చేస్తున్నాడు.