10ఏళ్ల తర్వాత ఆ సినిమాకు సీక్వెల్..
సినిమాల్లో హారర్ కామెడీ చిత్రాలకు కాస్త క్రేజ్ ఎక్కువే ఉంటుంది.
By: Tupaki Desk | 23 Sep 2023 11:51 AM GMTసినిమాల్లో హారర్ కామెడీ చిత్రాలకు కాస్త క్రేజ్ ఎక్కువే ఉంటుంది. ముఖ్యంగా టాలీవుడ్లో ఇప్పటికే పలు హారర్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్లను అందుకున్న సందర్భాలున్నాయి. అలాంటి వాటిలో 'గీతాంజలి' కూడా ఒకటి. నటి అంజలి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం అప్పట్లో మంచి విజయాన్ని అందుకుంది. ఆమెకు మంచి పేరును తెచ్చిపెట్టింది. రాజ్ కిరణ్ దర్శకత్వం వహించారు. ఎంవివి సత్యనారాయణ ప్రొడ్యూస్ చేశారు. కోనా వెంకట్ ఈ సినిమాకు కథ అందించారు. సినిమాను కూడా ఆయనే సమర్పించారు.
అయితే 2014లో వచ్చిన ఈ చిత్రానికి తాజాగా ఇప్పుడు సీక్వెల్ ప్రకటించారు మేకర్స్. ప్రతీకార జ్వాలతో మళ్లీ వచ్చేస్తోంది గీతాంజలి.. అంటూ అనౌన్స్ చేశారు. గీతాంజలి మళ్ళీ వచ్చింది.. పేరుతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. దర్శకుడు కోన వెంకటే ఈ సినిమాకు స్టోరీ ఇవ్వడంతో పాటు నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు.
ఎమ్వీవీ సత్యనారాయణ్ అండ్ జీవీ కలిసి ఎమ్వీవీ సినిమా అండ్ కోనా ఫిల్మ్ కార్పోరేషన్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. శివ తుర్లపాటి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రవీన్ లక్కరాజు మ్యూజిక్ అందిస్తున్నారు. సుహత సిద్ధార్థ సినిమాటోగ్రఫీ చూసుకుంటున్నారు. అంజలి, శ్రీనివాస రెడ్డి, సత్యం రాజేశ్, సత్య, షకలక శంకర్, అలీ, బ్రహ్మాజీ, రవి శంకర్, రాహుల్ మాధవ్ తదితరులు ఈ సీక్వెల్లో నటిస్తున్నారు. ఎడిటర్ గా చోటా కె ప్రసాద్, ఆర్ట్ డైరెక్టర్ గా నార్ని శ్రీనివాస్, ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా నాగు వై బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
ఇప్పటికే ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్, స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తైపోయింది. తాజాగా హైదరాబాద్‌లో ఈ సినిమా పూజా కార్యక్రమాలో లాంఛనంగా ప్రారంభం కూడా అయింది. పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. ఓ పాతబడ్డ బంగ్లా ప్రాంగణంలో అటుగా తిరిగి కూర్చుని ఉన్న అమ్మాయిను పోస్టర్లో చూపిస్తూ.. ఆసక్తితో పాటు భయపెట్టే ప్రయత్నం చేశారు.
కాగా, మొదటి భాగం గీతాంజలి.. ఎంతటి అద్భుత విజయం సాధించిందో తెలిసిన విషయమే. ఈ చిత్రంతోనే నటుడు శ్రీనివాసరెడ్డి హీరోగా సిల్వర్ స్క్రీన్కు పరిచయం కూడా అయ్యారు. దర్శకుడి పాత్రలో చక్కటి నటనను కనబరిచారు. బ్రహ్మానందం, సత్యం రాజేశ్, షకలక శంకర్ తమ కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేశారు. ఈ సినిమా రిలీజైన దాదాపు 10 ఏళ్ల తర్వాత సీక్వెల్ రావడం ఇంట్రెస్టింగ్గా ఉంది.