ఆ స్టార్ హీరో భార్య ఆస్తుల విలువ అధికారిక లెక్క ఇదే!
89.31 కోట్ల ఆస్తులున్నట్లు గీతాశివరాజ్ ఎన్నికల అధికారులకు సమర్పించిన అఫిడవిట్ ద్వారా తెలుస్తోంది
By: Tupaki Desk | 16 April 2024 12:30 PM GMTఎన్నికల వేళ సెలబ్రిటీల ఆస్తుల వివరాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. ఎవరు ఎంత సంపాదించారు? అన్నది ఇంతకాలం సీక్రెట్ గా ఉంచేసినా నామినేషన్ల వేళ ఆస్తివివరాలు వెల్లడించాల్సిందే. తాజాగా శాండిల్ వుడ్ నటుడు శివరాజ్ కుమార్ భార్య గీతారాజ్ కుమార్ ఆస్తుల్ని అధికారికంగా ప్రకటించారు. గీతా శివరాజ్‌కుమార్ కర్ణాటకలోని శివమొగ్గ లోక్‌సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె ఆస్తుల వివరాల్లోకి వెళ్తే..
89.31 కోట్ల ఆస్తులున్నట్లు గీతాశివరాజ్ ఎన్నికల అధికారులకు సమర్పించిన అఫిడవిట్ ద్వారా తెలుస్తోంది. 11,542 గ్రాముల వజ్ర-బంగారు ఆభరణాలున్నాయి. వాటి విలువ మూడు కోట్లకు పైగా ఉంటుంది. కేవలం గీతాకుమార్ ఆస్తులు 40.40 కోట్లు కాగా... భర్త శివరాజ్ కుమార్ ఆస్తుల విలువ 49 కోట్లగా ఉంది. గీతా కుమార్ బ్యాంక్ బ్యాలెన్స్ మాత్రం 100 రూలుగా ఉంది. అలాగే కుమార్తె నివేదిత బ్యాంకు బ్యాలెన్స్ కూడా 100 రూపాయలే ఉంది. సొంత నిర్మాణ సంస్థ అయిన శ్రీ ముత్తు సినీ సర్వీసెస్‌కు రూ.లక్ష రుణం అందించారు.
అలాగే 2022-23 ఆర్థిక సంవత్సరంలో గీతా వార్షిక ఆదాయం రూ.1. 48 కోట్లు. అలాగే భార్యభర్తలిద్దరి ఆదాయానికి సంబధించిన సమాచారం కూడా అఫిడవిట్ లో పేర్కొన్నారు. గీతా కుమార్ 2018-22 నుంచి వార్షిక ఆదాయం 29 లక్షల నుంచి 33 లక్షలకు పెరిగింది. ఇక 2022-23లో రూ.1.48 కోట్లకు పెరిగింది. ఇక శివరాజ్ కుమార్ 2022-23 లో ఏటా 2.93 కోట్లు సంపాదించినట్లు ఉంది. 201-19 లో రూ.2. 20 కోట్లు- 2019-20లో రూ.1.87 కోట్లు ఆదాయం వచ్చిందని లెక్కల్లో ఉంది.
2020-21లో వార్షిక ఆదాయం రూ.97.98 లక్షలు గా- 2021-22లో రూ.1.27 కోట్లు సంపాదన ఉన్నట్లు వెల్లడించారు. గీతా కుమార్ వద్ద మూడు లక్షలు....శివన్న వద్ద 22 లక్షల నగదు ఉన్నట్లు అఫిడవిట్ లో పేర్కాన్నారు. 1.7 కోట్ల విలువ గల టయోటా హైబ్రిడ్ కారు గీతాకుమార్ వద్ద... శివరాజ్ కుమార్ వద్ద టయోటా ఫార్చూనర్ కారు- మారుతీ ఎర్టిగా- వోల్వో ఎస్90 కార్లు ఉన్నాయి. అలాగే 11 ఎకరాల వ్యవసాయభూమి కూడా ఉన్నట్లు అఫిడవిట్ లో పేర్కోన్నారు. ఇంకా యూపీలోని మాండి నియోజక వర్గం నుంచి కంగనా రనౌత్ కూడా పోటీ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఆమె ఆస్తుల వివరాలు తెలియాల్సి ఉంది.