Begin typing your search above and press return to search.

సెకండ్‌ ఇన్నింగ్స్‌ కాదు మూడవ సారి ప్రెగ్నెంట్‌..!

తాజాగా భర్తతో కలిసి ఒక కార్యక్రమంలో జెనీలియా పాల్గొంది. ఆ సమయంలో జెనీలియా బేబీ బంప్ క్లీయర్‌ గా కనిపించింది.

By:  Tupaki Desk   |   11 Sep 2023 7:07 AM GMT
సెకండ్‌ ఇన్నింగ్స్‌ కాదు మూడవ సారి ప్రెగ్నెంట్‌..!
X

టాలీవుడ్‌ తో పాటు బాలీవుడ్ లో మంచి పాపులారిటీని సొంతం చేసుకున్న ముద్దుగుమ్మ జెనీలియా. ఈ అమ్మడు పెళ్లి తర్వాత సినీ కెరీర్ కు పూర్తిగా దూరం అయింది. ఇద్దరు కొడుకులకు జన్మనిచ్చిన తర్వాత.. వారు కాస్త పెద్ద అయిన తర్వాత సోషల్ మీడియాలో సందడి మొదలు పెట్టింది. గత కొంత కాలంగా ఈ అమ్మడి సోషల్ మీడియా హడావుడి మామూలుగా లేదు.

ఇటీవలే ఈ అమ్మడు 'వేద్‌' అనే సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడం తో సెకండ్ ఇన్నింగ్స్ లో జెనీలియా దూసుకు పోయే అవకాశాలు ఉన్నాయి అంటూ అంతా బలంగా వాదిస్తూ వచ్చాయి. హిందీ తో పాటు తెలుగు సినిమా ల్లో ఈమె సెకండ్‌ ఇన్నింగ్స్ తో దూసుకు పోనుందని భావిస్తున్న సమయంలో మూడవ ప్రెగ్నెన్సీ అంటూ వార్తలు రావడం ఆశ్చర్యంగా ఉంది.

తాజాగా భర్తతో కలిసి ఒక కార్యక్రమంలో జెనీలియా పాల్గొంది. ఆ సమయంలో జెనీలియా బేబీ బంప్ క్లీయర్‌ గా కనిపించింది. అంతే కాకుండా ఆమె తన బేబీ బంప్ పై జాగ్రత్తగా అన్నట్లుగా చేయి వేసుకుని మరీ పట్టుకుని ఉంది. దాంతో కచ్చితంగా జెనీలియా మూడవ సారి గర్భవతి అంటూ చాలా మంది వాదిస్తున్నారు.

సినిమా ఇండస్ట్రీలో రెండవ ఇన్నింగ్స్ మొదలు పెట్టి వరుస సినిమాల్లో నటిస్తోంది.. ఇక నుంచి ఏడాదికి రెండు మూడు సినిమాలతో జెనీలియా వస్తుందని అభిమానులు ఎదురు చూస్తున్న సమయంలో ఈ ట్విస్ట్‌ ఏంటో. బొమ్మరిల్లు హాసిని నిజంగానే మూడవ సారి ప్రెగ్నెంట్‌ అయితే ఆమె సినిమా ఇండస్ట్రీకి పూర్తిగా దూరం అయినట్లే అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అసలు విషయం ఏంటి అనేది తెలియాలంటే జెనీలియా దంపతులు మాట్లాడే వరకు వెయిట్‌ చేయాల్సిందే.