Begin typing your search above and press return to search.

ఘాటి కోసం రెబల్ స్టార్..?

యువి క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఘాటి సినిమా ప్రమోషన్స్ కి రెబల్ స్టార్ ప్రభాస్ ని కూడా వాడుకోవాలని చూస్తున్నారట.

By:  Tupaki Desk   |   9 Jan 2025 4:23 AM GMT
ఘాటి కోసం రెబల్ స్టార్..?
X

స్వీటీ అనుష్క సినిమాలంటే ఆమె ఫ్యాన్సే కాదు సినీ లవర్స్ కి కూడా పండగ అన్నట్టే. ఆమె కమర్షియల్ సినిమాలు చేసినా ఫిమేల్ సెంట్రిక్ సినిమా చేసినా ఏది చేసినా సరే ఆడియన్స్ ఆమెను ఆదరిస్తారు. ఐతే ఈమధ్య వరుస సినిమాలు చేయకుండా కెరీర్ గ్యాప్ తీసుకుంటున్న అనుష్క మళ్లీ తిరిగి ఫాం లోకి రావాలని చూస్తుంది. ఈ క్రమంలోనే ఘాటి అనే సినిమా చేస్తుంది. క్రిష్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ తో అంచనాలు పెంచేశారు. అనుష్క లోని మాస్ యాంగిల్ ని మరోసారి ఈ సినిమాతో చూపించబోతున్నారు.

అనుష్క చేసిన అరుంధతి, రుద్రమదేవి సినిమాలు మరో హీరోయిన్ కి సాధ్యం కాదనేలా ఆమె ఒక క్రేజ్ తెచ్చుకుంది. మిగతా హీరోయిన్స్ అలాంటి ప్రయత్నాలు చేసినా వర్క్ అవుట్ కాలేదు. ఘాటి సినిమా విషయంలో క్రిష్ పర్ఫెక్ట్ ప్లానింగ్ తో వస్తున్నారు. ఈ సినిమా తీయడం ఒక ఎత్తైతే ప్రమోషన్స్ ని కూడా భారీగా ప్లాన్ చేస్తున్నారు. ఘాటి సినిమాను ఏప్రిల్ 18న రిలీజ్ లాక్ చేశారు. అసలైతే ఆ టైం లో ప్రభాస్ రాజా సాబ్ రిలీజ్ అనుకున్నారు కానీ ఆ సినిమా వాయిదా పడుతుందని తెలిసి ఘాటిని వదులుతున్నారు.

యువి క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఘాటి సినిమా ప్రమోషన్స్ కి రెబల్ స్టార్ ప్రభాస్ ని కూడా వాడుకోవాలని చూస్తున్నారట. అనుష్క కోసం ప్రభాస్ ని అడిగితే తప్పకుండా ఓకే అంటాడు. యువి బ్యానర్ అంటే ప్రభాస్ సొంత సంస్థ అన్నట్టే అందుకే అనుష్క ఘాటి ప్రమోషన్స్ కి ప్రభాస్ కూడా తన సపోర్ట్ అదించడానికి రెడీ అన్నట్టు తెలుస్తుంది. ఘాటి సినిమాను కేవలం తెలుగులో కాకుండా పాన్ ఇండియా రిలీజ్ ప్లానింగ్ లో ఉన్నారు.

అందుకే నేషనల్ లెవెల్ లో ఈ సినిమాకు రీచ్ ఉండాలి అంటే బాహుబలి ప్రభాస్ తోనే సినిమాను ప్రమోట్ చేయించాలి. ఘాటి సినిమాలో అనుష్క మరోసారి తన విశ్వరూపం చూపించిందని తెలుస్తుంది. ఇన్నాళ్లు తన లుక్స్ పరంగా ఇబ్బంది ఉందనే కారణంతోనే బయటకు కనిపించకుండా ఉన్న స్వీటీ ఇప్పుడు తన ఇదివరకు లుక్ ని తెచ్చుకుందని తెలుస్తుంది. అనుష్క ఘాటి కోసం తానే స్వయంగా ప్రమోషన్స్ లో పాల్గొంటుందని తెలుస్తుంది. అనుష్కతో ప్రభాస్ కూడా తోడైతే ఘాటికి సూపర్ బూస్టింగ్ దొరికినట్టే లెక్క.