Begin typing your search above and press return to search.

ఆ లెజండ‌రీ గాయ‌కుడి అల్లుడు చైల్డ్ ఆర్టిస్ట్!

ఆ ర‌కంగా ఘంట‌సాల త‌ర్వాత థ‌మ‌న్ కూడా సంగీత ద‌ర్శ‌కుడిగా సక్సెస్ అవ్వ‌డం సంతోషించ‌ద‌గ్గ విష‌యం.

By:  Tupaki Desk   |   10 July 2024 1:30 PM GMT
ఆ లెజండ‌రీ గాయ‌కుడి అల్లుడు చైల్డ్ ఆర్టిస్ట్!
X

లెజెండ‌రీ మ్యూజిక్ డైరెక్ట‌ర్, గాయ‌కుడు ఘంట‌సాల వెంక‌టేశ్వ‌ర‌రావు త‌దానంత‌రం ఇండ‌స్ట్రీలో ఆయ‌న వార‌స‌త్వం కొన‌సాగ‌ని సంగ‌తి తెలిసిందే. పిల్ల‌లంతా వేర్వేరు వృత్తుల్లో స్థిర‌ప‌డ‌టంతో సినిమా రంగం వైపు ఎవ‌రూ రాలేదు. అయితే కొన్ని ద‌శాబ్ధాల త‌ర్వాత థ‌మ‌న్ పేరు మాత్రం తెర‌పైకి వ‌చ్చింది. థ‌మ‌న్ ఘంట‌సాల‌కు దూర‌పు బంధువని, మ‌న‌వ‌డి అవుతాడ‌ని ఇలా కొంత ప్ర‌చార‌మైతే సాగింది. ఆ ర‌కంగా ఘంట‌సాల త‌ర్వాత థ‌మ‌న్ కూడా సంగీత ద‌ర్శ‌కుడిగా సక్సెస్ అవ్వ‌డం సంతోషించ‌ద‌గ్గ విష‌యం.

అయితే ఘంట‌సాల వారస‌త్వంలో పిల్ల‌లు లేక‌పోయినా ఆయ‌న అల్లుడు సురేంద్ర ఉన్న‌ట్లు తాజాగా వెలుగులోకి వ‌చ్చింది. ఘంటసాల అస్త‌మించే సమయానికి ఆయన కుమార్తె శాంతి వయసు 11 సంవత్సరాలు. ఆ తరువాత ఆమె వివాహం సురేంద్రతో జరిగింది. ఆయన చెన్నైలో పెద్ద వ్యాపార‌వేత్త . త‌మిళ‌నాడు శ్రీమంతుల్లో ఆయ‌న కూడా ఒక‌రు. తాజాగా ఆయ‌న ఓ ఇంట‌ర్వ్యూలో తాను న‌టుడిని అన్న సంగ‌తి రివీల్ చేసారు.

'తొలి నుంచి నాకు సినిమాలంటే పెద్ద‌గా ఇష్టం ఉండేది కాదు. మా అమ్మగారి కోసం నటించాను. నేను హీరోను కావాలని మా అమ్మగారికి ఉండేది . కానీ నాకు ఆ వైపు ఆసక్తి ఉండేది కాదు. అంతకుముందు ఘంటసాల గారి కుటుంబంతో మాకు చుట్టరికం లేదు. ఆ తరువాత కాలంలో ఘంటసాల గారి అమ్మాయి .. నేను ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నాము' అని అన్నారు.

అయితే ఆ సురేంద్ర అప్ప‌ట్లో పాపుల‌ర్ చైల్డ్ ఆర్టిస్ట్. ఎన్టీఆర్ .. ఏఎన్నార్ .. శోభన్ బాబు .. కృష్ణ సినిమాల్లో బాల న‌టుడిగా న‌టించారు. 'బాలమిత్రుల కథ' సినిమాలో 'గున్నమామిడి కొమ్మమీద' పాట ఆయనపై చిత్రీకరించినదే. ఆ పాటలో ముద్దుగా బొద్దుగా అమాయకంగా కనిపించే ఆ కుర్రాడే ఈ సురేంద్ర. ఘంటసాల మ‌ర‌ణించే సమయానికి ఆయన వయసు 13 ఏళ్లు.