Begin typing your search above and press return to search.

లైఫ్ లాజిక్ గేమ్ కాదు… గూమెర్ రిలీజ్ కి రంగం సిద్ధం

ఇందులో చెయ్యి లేని ఒక వికలాంగురాలు క్రికెటర్ గా ఎలా సక్సెస్ అయ్యిందనే కాన్సెప్ట్ తో చూపిస్తున్నారు.

By:  Tupaki Desk   |   1 Aug 2023 3:41 AM GMT
లైఫ్ లాజిక్ గేమ్ కాదు… గూమెర్ రిలీజ్ కి రంగం సిద్ధం
X

బాలీవుడ్ లో దర్శకులుగా తమకంటూ ప్రత్యేకమైన ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్న అతికొద్ది మందిలో ఆర్ బాల్కీ ఒకరు. చీనీకామ్ సినిమా తో 2007లో బాల్కీ దర్శకుడిగా తన జర్నీ స్టార్ట్ చేశారు. తరువాత అమితాబచ్చన్ తోనే మళ్ళీ పా అనే మూవీ తీసి హిట్ కొట్టారు. ఈ మూవీ లో అరుదైన వ్యాధి బారిన పడిన వ్యక్తిగా అమితాబచ్చన్ నటించారు. ఇంగ్లీష్ వింగ్లిష్ సినిమాతో శ్రీదేవి బాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. ఆర్ బాల్కీ దర్శకత్వంలో ఈ సినిమా కూడా తెరకెక్కింది.


ఇలా ఆయన నుంచి వచ్చిన ప్రతి కథ కూడా సమాజం లోంచి పుట్టుకొచ్చింది అయి ఉంటుంది. అలాగే ప్రతి కథలో కూడా ఓ సోషల్ మెసేజ్ తో పాటు మనసుకి హత్తుకునే భావోద్వేగాన్ని ప్రేక్షకులకి అందిస్తూ ఉంటారు. అందుకే బాల్కీ సినిమాల కి ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. రెగ్యులర్ కమర్షియల్ జోనర్ కథలు అతను అస్సలు టచ్ చేయడు. చివరిగా దుల్కర్ సల్మాన్ హీరో గా చుప్ అనే మూవీ చేశారు.

ఈ సినిమా కూడా ఓ దర్శకుడు రివెంజ్ ని చూపించారు. ఎంతో కస్టపడి చేసిన సినిమా ని ఫ్లాప్ అని రివ్యూలు రాసిన క్రిటిక్స్ ని రివేంజ్ తీర్చుకునే వ్యక్తిగా దుల్కర్ నటించాడు. అతని పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దీని తర్వాత లస్ట్ స్టోరీస్ 2లో ఒక ఎపిసోడ్ కి దర్శకత్వం వహించారు. ప్రస్తుతం అతని నుంచి మరో ఇంటరెస్టింగ్ మూవీ ప్రేక్షకుల ముందుకి రావడానికి రెడీ అవుతోంది.

సయామీ ఖేర్ లీడ్ రోల్ లో గూమెర్ టైటిల్ తో సినిమా తెరకెక్కింది. ఇందులో చెయ్యి లేని ఒక వికలాంగురాలు క్రికెటర్ గా ఎలా సక్సెస్ అయ్యిందనే కాన్సెప్ట్ తో చూపిస్తున్నారు. రియల్ లైఫ్ క్యారెక్టర్స్ ని స్ఫూర్తిగా తీసుకొని ఈ సినిమా ని బాల్కీ తెరకెక్కించినట్లు తెలుస్తోంది. అభిషేక్ బచ్చన్ ఈ మూవీలో కీలక పాత్రలో నటిస్తున్నారు. సభానా అజ్మీ, ఆనంద్ బేడీ ఇతర ముఖ్య పాత్రల లో కనిపిస్తున్నారు.

తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేశారు. ఆగష్టు 18న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం రిలీజ్ కాబోతోంది. లైఫ్ లాజిక్ గేమ్ కాదు. మ్యాజిక్ గేమ్ అంటూ క్యాప్షన్ తో రిలీజ్ పోస్టర్ ని లాంచ్ చేశారు. ఇందులో సయామీ ఖేర్ ఒక చెయ్యి లేకుండా రెండో చేత్తో క్రికెట్ బాల్ పట్టుకొని బౌలింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఉంది. మరి రియల్ లైఫ్ క్యారెక్టర్స్ స్ఫూర్తితో చేస్తోన్న ఈ మూవీ ఏ మేరకు సక్సెస్ అందుకుంటుందనేది చూడాలి.