Begin typing your search above and press return to search.

పెళ్లికొచ్చిన వారికి అంబానీ స‌ర్ ప్రైజ్ ఇది!

ముఖ్యంగా బాలీవుడ్ హీరోల‌కు అందించిన బ‌హుమ‌తి.. దాని ఖ‌రీదు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.

By:  Tupaki Desk   |   14 July 2024 12:47 PM GMT
పెళ్లికొచ్చిన వారికి అంబానీ స‌ర్  ప్రైజ్ ఇది!
X

పెళ్లికి ఆహ్వానిస్తే త‌ప్ప‌క హాజ‌ర‌వుతారంతా. పెళ్లి రోజు క‌చ్చితంగా నూత‌న వ‌ధువ‌రూల‌ను ఆశీర్వ‌దిస్తూ గిప్టు బాక్సులు అందిస్తుంటారు. త‌మ త‌హాత‌కు త‌గ్గట్లు బ‌హుమ‌తులు ఉంటాయి. ఈ సంద‌ర్భంలో కేవ‌లం పెళ్లికి వెళ్లే అతిధులు మాత్ర‌మే చ‌దివింపులు..బ‌హుమ‌తులు పెళ్లి చేసుకునేవారికి అందిస్తారు. ఇది అంద‌రి రూల్. కానీ ఇక్క‌డ అంబానీ రూల్ వేరు. వాళ్లివ్వ‌డం కాదు..వాళ్ల‌కే మేం ఇస్తామంటూ అంబానీ పెళ్లికొచ్చిన అతిధులంద‌రికీ ఖ‌రీదైన బ‌హుమ‌తులు వాళ్ల స్థాయిని బ‌ట్టి అందించిన‌ట్లు తెలుస్తోంది.


ముఖ్యంగా బాలీవుడ్ హీరోల‌కు అందించిన బ‌హుమ‌తి.. దాని ఖ‌రీదు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. షారుఖ్ ఖాన్, రణ్వీర్ సింగ్ లకి అంబానీ 2 కోట్లు విలువైన వాచ్ లని బహుమతిగా ఇచ్చాడట. ఇవి రాయల్ ఓక్ పెర్పెట్యువల్ క్యాలెండర్ సంబంధించి లిమిటెడ్ ఎడిషన్ ని వారి కోసం స్పెషల్ గా బహుకరించారట. అలాగే అంబానీ కుమారుడు తరపున వచ్చిన చాలా మందికి అవే ఖ‌రీదుగ‌ల వాచ్ లని అందించారుట‌.


సోషల్ మీడియాలో కొన్ని పిక్స్ వైరల్ అవుతున్నాయి. మ‌రి అంబానీ ఇంట పెళ్లినా? మ‌జాకానా? ప్రపంచ‌మే మాట్లాడుకునేంత వైభ‌వంగా అంబానీ కోడుకు పెళ్లి జ‌రిగింది. పెళ్లి ఖ‌ర్చు ఐదు వేల కోట్లు. బంగారం చీర‌లు..బంగారు దుస్తులు...బంగారం వెడ్డింగ్ గార్డ్ ఇలా ఒక‌టేంటి ప్ర‌తీది కోట్ల విలువ చేసేదే.


అంబానీ కుమారుడు పెట్టుకున్న వాచ్ ఒక్కటే 54 కోట్లతో ప్ర‌త్యేకంగా రెడీ చేయించారుట‌. రిచర్డ్ మిల్లె ఆర్ ఎం 52-05 టర్బిల్లన్ అనే వాచ్ తాను పెట్టుకున్నాడు. అలాగే బంగారం దుస్తుల్లోనూ పెళ్లికొడుకుమెరిసిన సంగ‌తి తెలిసిందే. అంబానీ ఇంట ఇదే చివ‌రి పెళ్లి కావ‌డంతో ఎంతో వైభ‌వంగా జ‌రిగింది. నేటితో వివాహ వేడుక‌లు ముగుస్తాయి.