Begin typing your search above and press return to search.

ఆర్భాజ్‌తో బ్రేక‌ప్‌ని అధికారికం చేసిన ఆండ్రియాని

మలైకా అరోరా-అర్బాజ్ ఖాన్ విడాకుల తర్వాత ఇద్దరూ కొత్త భాగస్వాములతో సహవాసాన్ని కనుగొన్నారు. ఇద్దరూ 1998లో వివాహం చేసుకున్నారు

By:  Tupaki Desk   |   3 Dec 2023 1:30 AM GMT
ఆర్భాజ్‌తో బ్రేక‌ప్‌ని అధికారికం చేసిన ఆండ్రియాని
X

మలైకా అరోరా-అర్బాజ్ ఖాన్ విడాకుల తర్వాత ఇద్దరూ కొత్త భాగస్వాములతో సహవాసాన్ని కనుగొన్నారు. ఇద్దరూ 1998లో వివాహం చేసుకున్నారు. 2017లో అధికారికంగా విడాకులు తీసుకున్నారు. మాజీ దంపతులకు అర్హాన్ అనే కుమారుడు ఉన్నాడు. అయితే ఆర్భాజ్ విడాకుల త‌ర్వాత విదేశీ భామ జార్జియాతో స‌హ‌జీవ‌నంలో ఉన్నాడు. కానీ ఇప్పుడు ఈ బంధానికి ముగింపు స‌మ‌యం వ‌చ్చింది. అర్బాజ్ ఖాన్ - జార్జియా ఆండ్రియాని తమ సంబంధాన్ని ముగించుకున్నారని కొంతకాలంగా పుకార్లు వచ్చాయి. ఆ కథనాలు నిజమేనని ఇప్పుడు అధికారికంగా తేలింది. పాపుల‌ర్ పింక్‌విల్లాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో, జార్జియా ఆండ్రియాని ఈ వార్తలను ధృవీకరించారు. జార్జియా అతడి(ఆర్భాజ్) పట్ల తనకు ఎప్పుడూ ఫీలింగ్స్ ఉంటాయని చెప్పింది. అర్బాజ్ ఖాన్ తాను మంచి స్నేహితులమని చెబుతున్న ఒక‌ వీడియో ఒకటి విడుదలైంది.

విడాకుల తర్వాత మలైకా అరోరా - అర్బాజ్ ఖాన్‌ల సమీకరణం త‌మ‌ సంబంధాన్ని ప్రభావితం చేయలేదని, ఆమె కార‌ణంగా విడిపోలేద‌ని జార్జియా ఆండ్రియాని చెప్పారు. అంతా కూల్‌గా ఉందని కూడా జార్జియా చెప్పింది. అర్బాజ్ ఖాన్ గర్ల్‌ఫ్రెండ్ అని త‌న‌ని సంబోధించడం అవమానకరమని ఆండ్రియాని అన్నారు. ''ఒకరి స్నేహితురాలు అని పిలవడం నాకు క‌చ్చితంగా చాలా అవమానకరంగా అనిపిస్తుంది. మేము చాలా భిన్నంగా ఉన్నందున అనుబంధం ఎప్పటికీ కొనసాగదని మా ఇద్దరికీ తెలుసు'' అని అన్నారు. జార్జియా ఆండ్రియానీ - అర్బాజ్ ఖాన్ 2022లో విడిపోయారని పుకార్లు వచ్చాయి. అయితే ఇద్దరూ మౌనంగా ఉన్నారు. ఏప్రిల్ 2023లో మొహాలీలో జరిగిన IPL మ్యాచ్‌లో ప్రీతి జింటాతో ఇద్దరూ కలిసి కనిపించారు. కానీ ఇప్పుడు అధికారికంగా ఆండ్రియానీ దీనిని ధృవీక‌రించారు.

ఊహాగానాలపై మలైకా అరోరా ఏం చెప్పింది?

'మూవింగ్ ఇన్ విత్ మలైకా' ఎపిసోడ్‌లో తన ఇటాలియన్ స్నేహితురాలు జార్జియా ఆండ్రియాని నుంచి విడిపోవడం గురించి అర్బాజ్ ఖాన్‌ను అడిగారా? అని మ‌లైకాను ప్ర‌శ్నించ‌గ‌... గాసిప్‌ల గురించి తనకు క‌చ్చితంగా తెలియదని, ప్రైవేట్ విషయాల్లోకి వెళ్లడం ఇష్టం లేదని మ‌లైకా చెప్పింది. తన కొడుకును కూడా అలాంటి ప్రశ్నలు అడగనని చెప్పింది. మలైకా అరోరా మాట్లాడుతూ- ''కొంతమంది మాజీ జంటలు మాజీ భాగస్వాముల ప్రేమ వ్యవహారాలపై ఆసక్తిని కలిగి ఉంటారు. అయితే ఆమె హద్దులు దాట‌లేదు'' అని అన్నారు. మలైకా అరోరా -అర్జున్ కపూర్ నాలుగేళ్లుగా హ్యాపీ రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. వారు ఇంకా పెళ్లిపై నిర్ణయం తీసుకోని సంగ‌తి ప్ర‌జ‌ల‌కు తెలిసిందే. అర్బాజ్ ఖాన్ - సోహైల్ ఖాన్ ఆదివారం బిగ్ బాస్‌లో కనిపిస్తారు. వీకెండ్ కా వార్ ఎపిసోడ్స్ కోసం సల్మాన్ ఖాన్ హోస్ట్ గా ఉండగా, ఇద్దరు సోదరులు ఇతర పోటీదారులతో హాస్యం పరిహాసంతో ర‌క్తి క‌ట్టిస్తారు.