Begin typing your search above and press return to search.

విశ్వక్ ఊర మాస్ 'గిరి గిరి'.. GOG సేఫ్ జోన్!

విశ్వక్ సేన్ నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా గతవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే

By:  Tupaki Desk   |   5 Jun 2024 1:36 PM GMT
విశ్వక్ ఊర మాస్ గిరి గిరి.. GOG సేఫ్ జోన్!
X

విశ్వక్ సేన్ నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా గతవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. టాలెంటెడ్ దర్శకుడు కృష్ణ చైతన్య రూపొందించిన ఈ సినిమాను సీతార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్స్ లలో నాగ వంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. ఇక ఈ సినిమా విడుదలకు ముందే వరుస అప్డేట్స్ తో పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే.

తప్పకుండా సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది అనే అందరూ ఊహించారు. అయితే టాక్ మాత్రం ఎలా ఉన్నా విశ్వక్ మరోసారి బాక్సాఫీస్ వద్ద మాత్రం నిరాశపరచలేదు. క్రిటిక్స్ నుంచి కాస్త మిక్స్ డ్ టాక్ అందుకున్నప్పటికీ కూడా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా ఓ వర్గం మాస్ ప్రేక్షకులకు మంచి కిక్ ఇచ్చింది. ముఖ్యంగా విశ్వక్ అయితే తన క్యారెక్టర్ తో మంచి ఎంటర్టైన్మెంట్ అందించాడు.

గతంలో ఎప్పుడూ లేనంత కొత్తగా అతను ఊర మాస్ పాత్రలో కనిపించడంతో విజిల్స్ గట్టిగానే పడ్డాయి. ఇక ఈ సినిమాకు సంబంధించిన మరొక పాటను కూడా విడుదల చేశారు. గిరి గిరి అనే ఆ పాట ఫుల్ వీడియోలో విశ్వక్ సేన్ ఊర మాస్ స్టెప్పులు ఎంతగానో ఆకట్టుకుంటా ఉన్నాయి. అతని లుంగీ కట్టులో నాటు డ్యాన్స్ లు చాలా డిఫరెంట్ గా కనిపిస్తూ ఉన్నాయి.

మాస్ ఆడియన్స్ కు ఎలాంటి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలో విశ్వక్ కు బాగా తెలుసు అని మరోసారి నిరూపించాడు. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ విషయానికి వస్తే దాదాపు సినిమా అన్ని ఏరియాలో మంచి కలెక్షన్స్ అయితే సొంతం చేసుకుంది. మొదటి రోజు విశ్వక్ సేన్ కెరీర్ లోనే ఈ సినిమా అత్యధిక స్థాయిలో గ్రాస్ కలెక్షన్స్ అందించింది. ఇక నమ్ముకున్న డిస్ట్రిబ్యూటర్స్ కు విశ్వక్ మరోసారి నష్టాలు రాకుండా కాపాడాడు. సేఫ్ జోన్ లోకి తేవడమే కాకుండా ప్రాఫిట్స్ లోకి తీసుకు వస్తున్నాడు.

ఈ లెక్కతో అతని స్టార్ ఇమేజ్ ఏ రేంజ్ లో ఉందొ మరోసారి అర్థమైంది. సినిమాకు సంబంధించిన బాక్సాఫీస్ టార్గెట్ మొత్తానికి ఫినిష్ అయ్యింది. ఇక ఇప్పటి నుంచి వచ్చేవన్ని కూడా ప్రాఫిట్స్ అని చెప్పవచ్చు. ఎలక్షన్స్ రిజల్ట్ తాకిడి గట్టిగానే ఉన్నప్పటికీ మంగళవారం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మంచి కలెక్షన్స్ రాబట్టింది. ఇప్పుడున్న సినిమాల్లో ఇదే బెస్ట్ అప్షన్ గా ఉంది. ఇక రేపటి నుంచి కూడా సినిమాకు మంచి కలెక్షన్స్ వస్తాయని చెప్పవచ్చు. ఇలానే కొనసాగితే వీకెండ్ కి కూడా ఇదే బెస్ట్ ఛాయిస్ అవుతుంది. ఆ లెక్కతో GOG మరింత లాభాలు తెచ్చిపెట్టడం పక్కా. మొత్తానికి విశ్వక్ నటన, దర్శకుడు కృష్ణ చైతన్య మేకింగ్ కు మంచి ప్రశంసలు అందుతున్నాయి.