అఫిషియల్ : విజయ్ దేవరకొండ 'గర్ల్ ఫ్రెండ్'..!
విజయ్ దేవరకొండ చేతుల మీదుగా డిసెంబర్ 9వ తారీకు గర్ల్ ఫ్రెండ్ టీజర్ రాబోతుంది అంటూ పోస్టర్‌ను విడుదల చేసి మరీ మేకర్స్ అఫిషియల్ అనౌన్స్మెంట్ చేయడం జరిగింది.
By: Tupaki Desk | 8 Dec 2024 7:35 AM GMTరష్మిక మందన్న హీరోయిన్‌గా దీక్షిత్ శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్న 'గర్ల్ ఫ్రెండ్' సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్ వచ్చి ఆకట్టుకుంది. సినిమా పై అంచనాలు పెంచే విధంగా టీజర్ రాబోతుంది. గత రెండు మూడు రోజులుగా గర్ల్ ఫ్రెండ్ టీజర్‌ను విజయ్ దేవరకొండ చేతుల మీదుగా విడుదల చేయించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి అంటూ వార్తలు వచ్చాయి. ఇప్పుడు అదే విషయాన్ని నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు.
విజయ్ దేవరకొండ చేతుల మీదుగా డిసెంబర్ 9వ తారీకు గర్ల్ ఫ్రెండ్ టీజర్ రాబోతుంది అంటూ పోస్టర్‌ను విడుదల చేసి మరీ మేకర్స్ అఫిషియల్ అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. గత కొన్నాళ్లుగా రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ప్రేమలో ఉన్నారు అంటూ ప్రచారం జరుగుతోంది. ఇద్దరూ ఆ విషయాన్ని గురించి బాహాటంగా స్పందించకుండా ముసుగులో గుద్దులాట అన్నట్లుగా చేస్తున్నారు. ఇటీవల పుష్ప 2 సినిమాకి విజయ్ దేవరకొండ ఫ్యామిలీతో కలిసి రష్మిక వెళ్లడం జరిగింది. ఆ మధ్య ఇద్దరూ ఒక డిన్నర్ డేట్‌కి వెళ్లడం తెలిసిందే. మొత్తానికి ఇద్దరి మధ్య వ్యవహారం నడవడం లేదు పరిగెడుతోందని అంతా బలంగా నమ్ముతున్నారు.
ఈ సమయంలో విజయ్ దేవరకొండ చేతుల మీదుగా తన గర్ల్ ఫ్రెండ్ రష్మిక మందన్న సినిమా అయిన 'గర్ల్ ఫ్రెండ్' టీజర్‌ను విడుదల చేయడం అనేది కచ్చితంగా అందరి దృష్టిని ఆకర్షించడం ఖాయం. గర్ల్ ఫ్రెండ్ సినిమా గురించి పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సుకుమార్ మాట్లాడుతూ కొన్ని సీన్స్ చూశాను, చాలా బాగా వచ్చాయి. బెస్ట్ యాక్టింగ్ స్కిల్స్‌ను రష్మిక ప్రదర్శించింది అంటూ చెప్పుకొచ్చిన విషయం తెల్సిందే. సుకుమార్ వ్యాఖ్యలతో గర్ల్ ఫ్రెండ్‌పై అంచనాలు భారీగా పెరిగాయి. ఇప్పుడు విజయ్ దేవరకొండ చేతుల మీదుగా టీజర్ రాబోతున్న కారణంగా అంచనాలు మరింత పెరగడం ఖాయం.
టీజర్ విడుదల తర్వాత ఇన్నాళ్లు శ్రీవల్లి అంటూ పిలవబడిన రష్మిక మందన్న ఆ తర్వాత నుంచి గర్ల్ ఫ్రెండ్ అంటూ అందరితో పిలిపించుకుంటుందేమో చూడాలి. సోషల్ మీడియాలో ఇప్పటికే పుష్ప 2 కి గాను రష్మికకి జాతీయ అవార్డు రావడం ఖాయం అంటూ ప్రచారం చేస్తున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా రష్మిక మందన్న పుష్ప 2 లో డాన్స్‌లతో కుమ్మేసింది. అల్లు అర్జున్‌తో పోటీ పడి మరీ డాన్స్‌లు వేసినట్లుగా ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. గత ఏడాది గీతాంజలిగా, ఈ ఏడాది శ్రీవల్లిగా ఉమెన్ పవర్‌ను చూపించిన రష్మిక మందన్న గర్ల్ ఫ్రెండ్ సినిమాతో మరింత విజయాన్ని సొంతం చేసుకునే అవకాశాలు ఉన్నాయి.