ఈ హీరో స్టాటస్ కోసం అమ్మాయిలు వెయిటింగ్
విడిపోవడానికి కారణమేమిటో ఎవరూ వెల్లడించకపోవడంతో అభిమానులు డైలమాలో ఉన్నారు.
By: Tupaki Desk | 20 Oct 2024 3:00 AM GMTఆదిత్య రాయ్ కపూర్ - అనన్య పాండే తమ రిలేషన్ షిప్ బ్రేకప్‌కు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటనలు చేయకుండా, వ్యక్తిగత విషయాలను టచ్ చేయకుండా సైలెంట్ గా ఉన్నారు. విడిపోవడానికి కారణమేమిటో ఎవరూ వెల్లడించకపోవడంతో అభిమానులు డైలమాలో ఉన్నారు. కానీ ఆది, అనన్య ఎవరి పనిలో వారు బిజీగా ఉన్నారు. ఎవరి గురించి ఆలోచించే టైమ్ వారికి లేదు.
ఆదిత్య చివరిసారిగా 'ది నైట్ మేనేజర్'లో కనిపించారు. రాజ్ & డీకే తెరకెక్కిస్తున్న 'రక్త్ బ్రహ్మాండ్' సిరీస్‌లో నటిస్తున్నాడు. అనన్య పాండే 'కాల్ మీ బే'లో నటించింది. ఈ సీజన్ లో అనన్య నటనకు ప్రశంసలు కురిసాయి. దీనికి కొత్త సీజన్ ఉంటుందని ప్రకటించారు. అదంతా అటుంచితే.. ఆదిత్య రాయ్ కపూర్ ఇటీవల 'వాట్ విమెన్ వాంట్' షోలో చర్చా సమావేశంలో హోస్ట్ కరీనా కపూర్ ఖాన్ తో మాట్లాడాడు. ఈ ఎపిసోడ్ లో అతడు వ్యక్తిగత జీవితంపై ప్రశ్నల్ని ఎదుర్కొన్నాడు. రిలేషన్ షిప్‌లో ఘోస్ట్స్ ని ఎలా మ్యానేజ్ చేయాలో ప్రస్తావించాడు. అతడు పదేపదే వ్యక్తులను సంప్రదించే బదులు తదుపరి విషయాలను నిలిపివేయాలని కొత్త మార్గాన్ని ఎంపిక చేసాడట.
ఆదిత్య సింగిల్ స్టాటస్ గురించి హోస్ట్ ప్రశ్నించారు. అతడి స్టాటస్ ని తెలుసుకునేందుకు అమ్మాయిలు సిద్ధంగా ఉన్నారని హోస్ట్ కరీనా అన్నారు. అనన్య పాండే నుంచి విడిపోయాక ఈ కొత్త ఇంటర్వ్యూ నెట్ లో వైరల్ గా మారుతోంది. అనన్య పాండే నెక్ట్స్ ప్రేమ ఎవరితో...? ఆదిత్య నెక్ట్స్ ఎవరితో! అంటూ ఆరాలు ఇప్పటికే వేడెక్కిస్తున్నాయి. కానీ కొన్నిటికి కాలమే సమాధానం చెప్పాలి.