Begin typing your search above and press return to search.

రాశీ వన్స్ మోర్.. స్టన్నింగ్ పిక్స్ చూశారా?

తాజాగా క్రేజీ పిక్స్ షేర్ చేసింది. ఫ్లోరల్ డ్రెస్ వేసుకున్న బ్యూటీ.. టీ తాగుతూ నేచుర్ ను ఎంజాయ్ చేస్తున్న ఫోటో పోస్ట్ చేసింది.

By:  Tupaki Desk   |   23 Sep 2024 7:30 PM GMT
రాశీ వన్స్ మోర్.. స్టన్నింగ్ పిక్స్ చూశారా?
X

ఢిల్లీ బ్యూటీ రాశీ ఖన్నా.. యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న విషయం తెలిసిందే. మద్రాస్ కేఫ్ మూవీతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అమ్మడు.. మనం సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఊహలు గుసగుసలాడే చిత్రంతో హీరోయిన్ గా మారింది. ఆ సినిమాలో తన యాక్టింగ్ తో అందరినీ ఆకట్టుకుంది. ఆ తర్వాత వరుసగా తెలుగు చిత్రాల్లో యాక్ట్ చేసింది. మధ్యలో విలన్ మూవీతో మలయాళం సినీ ఇండస్ట్రీలో తన లక్ ను టెస్ట్ చేసుకుంది.

ఇమైక్కా నొడిగల్ సినిమాతో కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన రాశీ ఖన్నా.. ఓ రేంజ్ లో క్రేజ్ సంపాదించుకుంది. బాలీవుడ్ లో కూడా అడుగుపెట్టి తన సత్తా చాటింది. అలా కోలీవుడ్, బాలీవుడ్, మాలీవుడ్ లో నటిస్తోంది అమ్మడు. ప్రస్తుతం చేతి నిండా ప్రాజెక్టులతో బిజీగా ఉంది. 2024లో ఇప్పటికే యోధ, అరణ్మనై 4 సినిమాలతో పలకరించింది. త్వరలో గోద్రా రైలు దహన కాండ ఆధారంగా రూపొందుతోన్న ది సబర్మతీ రిపోర్ట్‌ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది రాశీ ఖన్నా.

నవంబర్ 15న విడుదల కానున్న ఆ మూవీలో కీలక పాత్ర పోషిస్తోంది అమ్మడు. తెలుగులో చివరగా పక్కా కమర్షియల్ సినిమాతో సందడి చేసింది. ఆ తర్వాత ఇప్పటి వరకు కనిపించలేదు. ఇప్పుడు తెలుసు కదా మూవీ చేస్తోంది. స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా తెరకెక్కుతున్న ఆ సినిమాలో కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. రాశీ ఖన్నా సెకండ్ హీరోయిన్ గా మెరవనుంది. లాంగ్ బ్యాక్ తర్వాత టాలీవుడ్ లో సందడి చేయనుంది అమ్మడు.

అయితే కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నా.. సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో మైమరపిస్తుంటోంది రాశీ ఖన్నా. క్లీవేజ్, థైస్ షోతో నెట్టింట ఎప్పటికప్పుడు హీట్ పుట్టించే పిక్స్ షేర్ చేస్తుంటోంది. గ్లామర్ డోస్ బాగా పెంచేసి.. రకరకాల ఫోటో షూట్స్ పోస్ట్ చేస్తూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తుంటోంది. తన అందచందాలతో నెట్టింట భారీ ఫాలోవర్స్ ను పెంచుకుంటోంది. తన గ్లామరస్ పిక్స్ తో ఆకట్టుకుంటూ.. కుర్రాళ్ల మతులు పోగుడుతుంటోంది రాశీ ఖన్నా.

తాజాగా క్రేజీ పిక్స్ షేర్ చేసింది. ఫ్లోరల్ డ్రెస్ వేసుకున్న బ్యూటీ.. టీ తాగుతూ నేచుర్ ను ఎంజాయ్ చేస్తున్న ఫోటో పోస్ట్ చేసింది. మరోసారి థైస్ షోతో సెగలు రేపింది. వేరే లెవల్ లో అందాలు ఆరబోసింది. నవ్వుతోనే మాయ చేసింది. ప్రస్తుతం ఆమె కొత్త పిక్స్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నారు. మేడమ్ సార్ మేడమ్ అంతే అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. లవ్ సింబల్స్ తో కామెంట్ సెక్షన్ నింపేస్తున్నారు. లైకుల వర్షం కురిపిస్తున్నారు.