Begin typing your search above and press return to search.

అఖిల్ కి రాంగ్ క్వశ్చన్ పేపర్ ఇస్తున్నారు..!

అక్కినేని ఫ్యామిలీలో నాగేశ్వరరావు, నాగార్జున, నాగ చైతన్య వీళ్లంతా మాస్ ఇమేజ్ కు దూరంగా ఉన్నారు.

By:  Tupaki Desk   |   15 Jun 2024 5:19 AM GMT
అఖిల్ కి రాంగ్ క్వశ్చన్ పేపర్ ఇస్తున్నారు..!
X

అక్కినేని నట వారసుడు అఖిల్ కెరీర్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అన్న సినిమా ఒక్కటి తప్ప మిగతా అన్ని సినిమాలు కమర్షియల్ గా వర్క్ అవుట్ అవ్వలేదు. బ్యాచిలర్ సినిమా కూడా బీభత్సం కాదు కానీ అసలు సక్సెస్ ఫేస్ చేయని అఖిల్ కు ఆ సినిమా కాస్త ఊరటనిచ్చింది. ఇక చివరగా చేసిన ఏజెంట్ సినిమా ఐతే డిజాస్టర్ కా బాప్ అనిపించుకుంది. అఖిల్ కి హిట్టు పడాలని అక్కినేని ఫ్యామిలీతో పాటుగా ఆ ఫ్యామిలీ ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నారు.

అక్కినేని ఫ్యామిలీలో నాగేశ్వరరావు, నాగార్జున, నాగ చైతన్య వీళ్లంతా మాస్ ఇమేజ్ కు దూరంగా ఉన్నారు. ఏయన్నార్ లెజెండ్ కాబట్టి ఆయన లెక్క వేరు నాగార్జున, నాగ చైతన్యలకు రొమాంటిక్ లవర్ బోయ్ ఇమేజ్ వచ్చింది. అఖిల్ మాత్రం మాస్ హీరోగా ఇమేజ్ తెచ్చుకునేందుకు కష్టపడుతున్నాడు. ఐతే అఖిల్ చేస్తున్న సినిమాలు.. ఆయనకు వస్తున్న కథలన్నీ రాంగ్ అంటున్నాడు హరోం హర దర్శకుడు జ్ఞాన సాగర్ ద్వారక.

సుధీర్ బాబు హీరోగా జ్ఞాన సాగర్ ద్వారక దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా హరోం హర. శుక్రవారం రిలీజైన ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది. ఐతే సుధీర్ బాబు యాక్షన్, మాస్ అంశాలు మాత్రం మాస్ ఆడియన్స్ ని మెప్పిస్తున్నాయి. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా జ్ఞానసాగర్ ని అఖిల్ గురించి మాట్లాడమని అంటే.. అఖిల్ కి రాంగ్ క్వశ్చన్ పేపర్ ఇస్తున్నారు అని తన అభిప్రాయాన్ని చెప్పాడు.

అంటే అఖిల్ స్టామినాకు ఉన్న కథలు కాకుండా రాంగ్ కథలు ఇస్తున్నారు అని. సరైన కథ పడితే అఖిల్ కూడా అద్భుతాలు చేస్తాడని జ్ఞాన సాగర్ భావిస్తున్నాడు. 2022 లో సెహరి సినిమాతో దర్శకుడిగా పరిచయమైన జ్ఞాన సాగర్ లేటెస్ట్ గా హరోం హర సినిమాతో తన మార్క్ చూపించే ప్రయత్నం చేశాడు. కుర్రాడి కాన్ఫిడెన్స్ చాలా ముచ్చటేస్తుంది. తప్పకుండా టాలీవుడ్ లో జ్ఞాన సాగర్ పేరు బాగా వినిపించేలా చేయాలని ట్రై చేస్తున్నాడు. మరి అది ఎంతవరకు కుదురుతుందో చూడాలి.

అఖిల్ విషయానికి వస్తే ఏజెంట్ తర్వాత గ్యాప్ తీసుకున్న అఖిల్ ఈమధ్య లాంగ్ హెయిర్ తో డిఫరెంట్ లుక్ తో కనిపిస్తున్నాడు. ఏజెంట్ వచ్చి ఏడాది దాటుతున్నా నెక్స్ట్ సినిమా గురించి ఎలాంటి అప్డేట్ ఇవ్వట్లేదని అక్కినేని ఫ్యాన్స్ అసంతృప్తిగా ఉన్నారు.