Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : మత్తు కళ్లతో కవ్విస్తున్న అందాల జ్ఞానేశ్వరి

ఆ తర్వాత సోషల్ మీడియా ద్వారా పాపులారిటీని సొంతం చేసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేసి ఇండస్ట్రీలో అడుగు పెట్టింది

By:  Tupaki Desk   |   21 May 2024 9:23 AM GMT
పిక్ టాక్ : మత్తు కళ్లతో కవ్విస్తున్న అందాల జ్ఞానేశ్వరి
X

నీ జతగా సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా పరిచయం అయిన ముద్దుగుమ్మ జ్ఞానేశ్వరి కండ్రేగుల. వైజాగ్‌ కు చెందిన అందాల ముద్దుగుమ్మ మోడలింగ్‌ లో కొన్నాళ్లు సందడి చేసింది. ఆ తర్వాత సోషల్ మీడియా ద్వారా పాపులారిటీని సొంతం చేసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేసి ఇండస్ట్రీలో అడుగు పెట్టింది.

టాలీవుడ్‌ లో తెలుగు అమ్మాయిలకు అంతగా ఆవకాశాలు రావు అనే విషయం జ్ఞానేశ్వరి విషయంలో కూడా నిరూపితం అయ్యింది. హీరోయిన్ గా అయితే కెరీర్‌ ను ఆరంభించిన ఈ అమ్మడు ఆ తర్వాత దాన్ని కొనసాగించడంలో చాలా కష్టాలు పడుతోంది.

మాయలో సినిమా తో గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా తో పెద్దగా ఈ అమ్మడికి గుర్తింపు రాలేదు. గత ఏడాదిలోనే చక్రవ్యూహం సినిమా తో వచ్చింది. ఆ సినిమా కూడా నిరాశ పరిచింది. అయితే సోషల్‌ మీడియాలో మాత్రం ఈ అమ్మడి సందడి కొనసాగుతుంది.

ఆకట్టుకునే అందాల ఆరబోత ఫోటోలు షేర్‌ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. నెట్టింట ఈ అమ్మడు షేర్‌ చేసే ఫోటోలు స్టార్‌ హీరోయిన్స్ అందాల ఫోటోలకు పోటీ అన్నట్లుగా ఉంటాయి అనేది కొందరి కామెంట్‌. తాజాగా మరోసారి తన అందాల ఫోటోలను షేర్‌ చేసింది.

కవ్వించే చూపులతో, మత్తు కళ్లతో నెటిజన్స్‌ కు మత్తెక్కించే విధంగా ఉన్న చూపుతో ఫోటో షూట్‌ ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చింది. ఈ రేంజ్ అందం ఉన్న కూడా పాపం తెలుగు అమ్మాయి అనే ఒకే ఒక్క ట్యాగ్‌ వల్ల ఎక్కువ ఆఫర్లు రావడం లేదు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.