Begin typing your search above and press return to search.

సెగలు పుట్టించిన తెలుగు పిల్ల.. ఎవరైనా సరే ఫ్లాటే!

తెలుగమ్మాయి జ్ఞానేశ్వరి కాండ్రేగుల పేరు.. ఆ మధ్య టాలీవుడ్ లో ఒక్కసారిగా సెన్సేషన్ అయింది.

By:  Tupaki Desk   |   12 July 2024 12:30 PM GMT
సెగలు పుట్టించిన తెలుగు పిల్ల.. ఎవరైనా సరే ఫ్లాటే!
X

తెలుగమ్మాయి జ్ఞానేశ్వరి కాండ్రేగుల పేరు.. ఆ మధ్య టాలీవుడ్ లో ఒక్కసారిగా సెన్సేషన్ అయింది. హనుమాన్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన దర్శకుడు ప్రశాంత్ వర్మతో ఆమె వర్క్ చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. ఫిమేల్ సెంట్రిక్ మూవీలో నటించనున్నట్లు ఆమెనే చెప్పినట్లు టాక్ వినిపించింది. దీంతో వైజాగ్ బ్యూటీ బంపర్ ఆఫర్ కొట్టేసిందని అంతా అన్నారు. ఇంకా దానిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు.

అంతకుముందు.. హీరో రామ్ చరణ్ ను పదేళ్ల క్రితం కలిసి ఉంటే పెళ్లి చేసుకుంటారా అని అడిగేదాన్నని ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. ఇప్పుడు కేవలం వర్క్ చేయాలని అడుగుతానని చెప్పింది. తన వద్ద ఓ పుస్తకం ఉందని.. అందులో అంతా చరణ్ ఫోటోలు అంటించి ఉంటాయని పేర్కొంది. అలా ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తుంటోంది అమ్మడు. ప్రస్తుతం సినిమాల్లో, వెబ్ సిరీసుల్లో నటిస్తూ బిజీగా గడుపుతోంది.

అయితే సోషల్ మీడియాలో ఈ తెలుగు పిల్ల సందడి మామూలుగా ఉండదు. ఎప్పటికప్పుడు తన ఫ్యాన్స్ తో టచ్ లో ఉంటోంది. మెల్లగా ఫాలోవర్స్ ను పెంచుకుంటోంది. కొత్త కొత్త పిక్స్ షేర్ చేస్తూ హీట్ పుట్టిస్తుంటోంది. పొట్టి డెస్సుల్లో అందాలు ఆరబోస్తుంటోంది. సెగలు పుట్టించే లుక్స్ తో మెస్మరైజ్ చేస్తుంటోంది. గ్లామర్ పిక్స్ తో కుర్రకారు మతులు పోగుడుతుంటోంది. నెెటిజన్ల చూపును తన వైపు తిప్పుకుంటోంది.

కచ్చితంగా తన పేజ్ డైలీ చూడాలనిపించేలా అప్డేట్స్ ఇస్తుంటోంది జ్ఞానేశ్వరి. కొన్ని నెలలుగా గ్లామర్ గేట్లు పూర్తిగా ఎత్తేసి సందడి చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల బెడ్ రూమ్ లో ఫోటోలు దిగి పోస్ట్ చేసిన అమ్మడు.. మరోసారి అంతకుమించి అందాలు ఆరబోసింది. రెడ్ కలర్ ప్లెయిన్ శారీలో హోయలు ఒలికించింది. నడుము మడతలు చూపిస్తూ కుర్రాళ్లను కిర్రెక్కించింది. వేరే లెవల్ లో ఎక్స్ప్రెషన్స్ ఇచ్చింది.

ఒక్కసారిగా సోషల్ మీడియాలో సెగలు పుట్టించిన జ్ఞానేశ్వరి పిక్స్.. ఇప్పుడు వైరల్ గా మారాయి. నడుము ఒంపులకు ఫ్లాట్ అయ్యామని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. సెగలతో అల్లాడిపోతున్నట్లు చెబుతున్నారు. ఒక్కో ఫోటో వేరే లెవల్ లో ఉందని కొనియాడుతున్నారు. గ్లామరస్ పిక్స్ కు కేరాఫ్ అడ్రెస్ జ్ఞానేశ్వరి అని అంటున్నారు. ఆమె వయ్యారానికి ఫిదా అయ్యామని చెబుతూ కామెంట్ సెక్షన్ నింపేస్తున్నారు.