Begin typing your search above and press return to search.

హీట్ పెంచేస్తోన్న తెలుగు పిల్ల.. నవ్వుతోనే పడేస్తోంది

టాలీవుడ్ ఇండస్ట్రీలో తెలుగమ్మాయిలకి ఆశించిన స్థాయిలో అవకాశాలు రావనేది చాలా మంది చెప్పే మాట.

By:  Tupaki Desk   |   13 April 2024 9:17 AM GMT
హీట్ పెంచేస్తోన్న తెలుగు పిల్ల.. నవ్వుతోనే పడేస్తోంది
X

టాలీవుడ్ ఇండస్ట్రీలో తెలుగమ్మాయిలకి ఆశించిన స్థాయిలో అవకాశాలు రావనేది చాలా మంది చెప్పే మాట. ఒక లయ, అంజలి, స్వాతి లాంటి అమ్మాయిలు కొంత వరకు అవకాశాలు సృష్టించుకున్నారు. ఈ జెనరేషన్ శ్రీలీల, డింపుల్ హయాతి, ఆనంది, వైష్ణవి చైతన్య లాంటి బ్యూటీస్ అవకాశాలు బాగానే దక్కించుకుంటున్నారు. శ్రీలీల అయితే టాప్ హీరోయిన్ గా దూసుకుపోతోంది. బేబీతో పరిచయం అయిన వైష్ణవి చైతన్యకి అవకాశాలు పెరుగుతున్నాయి.

వీరిలాగే మరో తెలుగమ్మాయి జ్ఞానేశ్వరి కాండ్రేగుల కూడా నటిగా అవకాశాలు సొంతం చేసుకుంటుంది. కమర్షియల్ హీరోయిన్ రేంజ్ క్యారెక్టర్స్ కాకపోయిన పెర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న పాత్రలని సొంతం చేసుకుంటూ ఒక్కో మెట్టు ఎక్కుతుంది. షార్ట్ ఫిలిమ్స్ ద్వారా కెరియర్ స్టార్ట్ చేసిన ఈ వైజాగ్ బ్యూటీ యాంకర్ ప్రదీప్ రియాలిటీ షో ద్వారా వెలుగులోకి వచ్చింది. తరువాత వెండితెరకి పరిచయం అయ్యింది.

మిస్టర్ అండ్ మిస్ అనే మూవీతో ఈ బ్యూటీ హీరోయిన్ గా వెండితెరపైకి అడుగుపెట్టింది. తరువాత వరుసగా అవకాశాలు దక్కించుకుంటుంది. ఓ వైపు సినిమాలు మరో వైపు వెబ్ సిరీస్ లతో సత్తా చాటుతోంది. నవీన్ చంద్ర మంత్ ఆఫ్ మధు సినిమాలో కీలక పాత్రలో కనిపించింది. నాగ చైతన్య దూత వెబ్ సిరీస్ లో కూడా జ్ఞానేశ్వరి మెప్పించింది. ఈ మాయలో మూవీలో మోడ్రన్ గర్ల్ క్యారెక్టర్ లో మెరిసింది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతినిండా ప్రాజెక్ట్స్ ఉన్నాయి.

జ్ఞానేశ్వరి సినిమాల ద్వారా ఎంత గుర్తింపు వస్తుందో అంతకంటే ఎక్కువ ఇమేజ్ సోషల్ మీడియాలో ఇన్ స్టాగ్రామ్ ద్వారా తెచ్చుకుంటుంది. తెలుగుపిల్ల అయినా అందాల ప్రదర్శనలో పెద్దగా లిమిట్స్ పెట్టుకోకుండా ఈ అమ్మడు సందడి చేస్తోంది. రెగ్యులర్ గా బికినీ ఫోటోలతో ఇన్ స్టాగ్రామ్ లో గ్లామర్ షో చేస్తూ ఉంటుంది. ఈ జెనరేషన్ తెలుగు హీరోయిన్స్ అందరూ కూడా బిగ్ స్క్రీన్ తో పాటు బయట కూడా బోల్డ్ గా కనిపించడానికి సంకోచించడం లేదు.

అలాగే జ్ఞానేశ్వరి కూడా రెగ్యులర్ గా హాట్ హాట్ ఫోటోలని ఇన్ స్టాలో షేర్ చేస్తూ వస్తోంది. తాజాగా స్విమ్మింగ్ పూల్ లో కలర్ ఫుల్ బికినీతో ఉన్న ఫోటోని జ్ఞానేశ్వరి షేర్ చేసింది. ఈ ఫోటో ప్రస్తుతం వైరల్ అవుతోంది. పేస్ లో చక్కని స్మైల్ అంతకుమించి బికినీలో హాట్ లుక్స్ తో నెటిజన్లుని ఇట్టే ఆకట్టుకుంటుంది. దీంతో ఆమె అందాలని పొగుడుతూ ఫాలోవర్స్ కామెంట్స్ కూడా పెట్టడం విశేషం.